రాష్ట్రీయం
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, తీహార్‌ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ, ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు
Hazarath Reddyకవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. జైల్లోకి ల్యాప్‌టాప్‌, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్‌ కేసులో కవితను విచారించి, ఆమెస్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనుంది. వచ్చే వారం తీహార్‌ జైలులోనే కవితను దర్యాప్తు సంస్థ విచారించనుంది
MLA Danam Nagender on IPL Tickets: పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, అందులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు, సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్
Hazarath Reddyఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా అంటూ.. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు.
KCR Meets Farmers: రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని తెలిపిన కేసీఆర్, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలోని మొగ్దుంపూర్‌లో ఎండిపోయిన పంటను కేసీఆర్‌ పరిశీలించారు
Andhra Pradesh Elections 2024: కడప జిల్లా నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన వైఎస్ షర్మిల, యాత్రలో పాల్గొన్న వైఎస్ వివేకా కూతురు సునీత, అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపు
Hazarath Reddyకడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ... కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు
Skill Development Scam: ఎన్నికల వేళ చంద్రబాబు మెడకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం ఉచ్చు, ఏ1గా టీడీపీ అధినేతను పేర్కొంటూ 41 మందిని నిందితులగా పేర్కొన్న సీఐడీ
Hazarath Reddyఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు (Chandrababu A1, Achennaidu A2), ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, పీవీఎస్‌పీ స్కిలర్‌ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.
Tractor Driver Fine: సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ. 100 జరిమానా, దీనిపై పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే..
Hazarath Reddyట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు.
Telangana Elections 2024: తెలంగాణ నుంచి పోటీ చేసే 17 మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే, మెదక్ నుంచి రఘునందన్ రావు, కరీంనగర్ నుంచి బండి సంజయ్
Hazarath Reddyవచ్చే లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన అభ్యర్థును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో నిలవగా హైదరాబాద్ నుంచి మాధవీ లత, మల్కాజ్ గిరి నుంచి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.
Telangana Elections 2024: లోక్ సభ ఎన్నికలు, లెక్కలు చూపని రూ. 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyతాజాగా హైదరాబాద్ పోలీసులు లెక్కా పత్రం లేని 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. CZ టాస్క్‌ఫోర్స్ బృందం అబిడ్స్‌ పీఎస్‌ పరిధిలోని రామకృష్ణ థియేటర్‌ పార్కింగ్‌ స్థలంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల లెక్కలు చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.
Telangana: నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
Hazarath Reddyనల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ గర్భిణీ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది. ఒక ముస్లిం మైనార్టీ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంటున్న సమయంలో డాక్టర్ తనని ఎన్నో కాన్పు అని అడగగా సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అని ఇష్టం ఉన్న రీతిలో డాక్టర్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆమె తెలిపారు.
First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి
Rudraతొలి తెలుగు న్యూస్ యాంకర్, దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు.
Chandrababu Slams CM Jagan: వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు, కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, పెన్సన్ కోసం వెళ్లిన వృద్ధులు చనిపోవడంపై ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పార్టీ ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీద మండిపడ్డారు.
Amanchi Krishna Mohan Quits YCP: వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్, ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని వెల్లడి
Hazarath Reddyఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు.
CM Jagan Speech in Naidupeta: మళ్ళీ అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థ పైనే, నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్
Hazarath Reddyసీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు
Andhra Pradesh Road Accident:నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyనెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఇసుక లారీ డీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి, బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులకి పెను ప్రమాదం తప్పింది.
Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆటో, ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట హైటెక్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) (ఉపాధ్యాయురాలు) అక్కడిక్కడే మృతి చెందింది.
HC On Vizag Steel Plant Privatization: ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, కేంద్రాని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, సీఎం జగన్‌ లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశాలు
Hazarath Reddyవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
HC On Pension Distribution: ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, పెన్సన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు
Hazarath Reddyఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈసీ ఇచ్చిన ఉత్వర్వులను సమర్థించింది.
Elephant Attack on Farmer: పొల్లాల్లో రైతులపై ఏనుగు దాడి, 24 గంటల్లో ఇద్దరు అన్నదాతలు మృతి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదకర ఘటనలు
Hazarath Reddyకుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ఓ ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగి అక్కడే ఉన్న అన్నూరి శంకర్‌(రైతు)పై దాడి చేసి చంపేసింది.
SB Organics Blast: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్ట‌రీ ప్ర‌మాదంలో పెరుగుతున్న మ‌ర‌ణాలు, 6కు చేరి మృతుల సంఖ్య‌, చికిత్స పొందుతున్న‌వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మం
VNSతాజాగా మరో కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద మరో కార్మికుడిని పోలీసులు గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారని గాలిస్తున్నారు. కాగా, మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
AP Accident: పెందుర్తితో రోడ్డు ప్ర‌మాదం, ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర‌గాయాలు, మృతులంతా ఒకే ఊరికి చెందిన‌వారే
VNSపెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో (Road Accident) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనంను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు (KGH) తరలించారు.