రాష్ట్రీయం
Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం
Rudraకేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌ సభ ఎన్నికలు2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది.
Rajya Sabha Seat For Hafiz Khan: క‌ర్నూల్ ఎమ్మెల్యేకు వైయ‌స్ జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్! రెండు సంవ‌త్స‌రాల ముందే రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టన‌
VNSవైసీపీ అధినేత జగన్‌ (YS Jagan) ప్రసంగించారు. కర్నూలు నుంచి హఫీజ్‌ ఖాన్‌కు వైసీపీ నుంచి టికెట్‌ ఇవ్వలేకపోయామని తెలిపారు. కానీ ఇదే హఫీజ్‌ను రెండేండ్ల తర్వాత వచ్చే రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు.
Hero Nikhil Joined TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్
Hazarath Reddyటాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు.
Andhra Pradesh Elections 2024: కావలిలో టీడీపీకి భారీ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కి టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు.
Andhra Pradesh Elections 2024: ఈ దుర్మార్గుడికి ఓటేస్తే అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడు, కావలి ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు
Andhra Pradesh Elections 2024: చీపురుపల్లిలో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున
Hazarath Reddyచీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని మండిపాటు
Hazarath Reddyశింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును ప్రకటించిన సంగతి విదితమే.మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది..
CM Jagan Speech in Yemmiganur: మాది పేదవాళ్ల పార్టీ, అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం, ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyమేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కొనసాగింది. 3వ రోజు కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు
Telangana Inter Summer Holidays: తెలంగాణలో మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం
Hazarath Reddyతెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది.
Telangana Phone-Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు, చంచలగూడ జైలుకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
Hazarath Reddyతెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Telangana Weather Update: తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి వడగాల్పులు, మండుతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి
Telangana Phone-Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటకు, కీలక వికెట్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, జైల్లో చిప్పకూడు తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyరాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్‌ టాస్క్‌­ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (OSD) పి.రాధాకిషన్‌రావును సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.
Telangana Elections 2024: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జోరందుకున్న వలసలు, చెక్ పెట్టేందుకు కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ, పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు.
Andhra Pradesh Elections 2024: అనంతపురంలో టీడీపీ ఆఫీసును తగలబెట్టిన కార్యకర్తలు, ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో మండిపడుతున్న అనుచరులు
Hazarath Reddyఅనంతపురంలో తెలుగుదేశం పార్టీ తీరుపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించడంతో కేడర్ భగ్గుమంది. ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నాడని మండిపడుతూ టీడీపీ ఆఫీస్‌ను ప్రభాకర్ చౌదరి అనుచరులు ధ్వంసం చేశారు
Andhra Pradesh Elections 2024: భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ తుది జాబితా ఇదిగో..
Hazarath Reddyపెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది.
Telangana: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు, చికిత్స అందించేలోగానే మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్‌కు చెందిన సాంబయ్య హుజురాబాద్ నుంచి నిజామాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. మెట్‌పల్లి బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు దిగగా, బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
BTech Student Suicide in Vizag: విశాఖలో మేడపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, ఫ్యాకల్టీ వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ
Hazarath Reddyఏపీలోని విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చైతన్య కాలేజీలో చదువుతున్న రూపశ్రీ అనే బిటెక్ విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులే కారణమని సూసైడ్ లెటర్ రాసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Hyderabad Fire: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ వాహనం పార్కింగ్ స్థలంలో భారీ అగ్నిప్రమాదం, దాదాపు పోలీసులు స్వాధీనం చేసుకున్న 40 వాహనాలు దగ్ధం
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనం పార్కింగ్ స్థలంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలు ప్రక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి, పోలీసులు స్వాధీనం చేసుకున్న అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి.అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి
Kadiam Kavya Big Shock to BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్.. వరంగల్ లోక్‌ సభ పోటీ నుంచి వైదొలగిన కడియం కావ్య.. కేసీఆర్ కు సుదీర్ఘమైన లేఖ.. తండ్రి కడియం శ్రీహరితో కలిసి హస్తం గూటికి చేరే ఛాన్స్
Rudraపుట్టెడు కష్టాల్లో మునిగిన బీఆర్ఎస్‌ కు లోక్ సభ ఎన్నికల వేళ మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య తప్పుకున్నారు.
Theft Caught on Camera: పట్టపగలే కారు అద్దాలను ద్వంసం చేసి రూ. 2 లక్షల చోరీ, సీసీటీవీ పుటేజీలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు
Hazarath Reddyజనగామ జిల్లా కేంద్రంలోని ICICI బ్యాంకులో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రూ.2 లక్షలు డ్రా చేసి డబ్బును కారులో ఉంచాడు. కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ద్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.