రాష్ట్రీయం

Hyderabad Shocker: అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌పై విరుచుకుపడిన 30 మంది హిజ్రాలు, రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన 20 నుంచి 30 మంది హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. రూ. 30 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Andhra Pradesh Elections 2024: మీతో ఒక్క ఫోటో కావాలన్నా, వికలాంగ దంపతుల కోరికను మన్నించి వారితో కూర్చుని ఫోటో దిగిన సీఎం జగన్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేమంటూ వికలాంగ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా మీతో ఒక్క ఫోటో కావాలన్నా అని అడిగిన వికలాంగ దంపతులను ఆప్యాయంగా పలకరించి జగన్ వారితో ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Road Accident: ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి, రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన తొలి ప్రమాదంలో రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు

Heart Touching Story: అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన, చనిపోయిన కూతురు స‌మాధి పక్కనే రోదిస్తూ పడుకున్న తండ్రి, ఆమె జ్ఞాప‌కాల‌నే తలుచుకుంటూ..

Hazarath Reddy

ఓ తండ్రి త‌న బిడ్డ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌.. ఆమె జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేక‌.. ఏకంగా ఆమె స‌మాధి వ‌ద్ద రోదిస్తూ ప‌డుకున్నాడు. ఆ స‌మాధిని గ‌ట్టిగా కౌగిలించుకుని త‌న బిడ్డ జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చ‌లించిపోయారు. ఈ హృద‌య విదార‌క దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, 14 మందితో ఎనిమిదో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు 14 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది, మధ్యప్రదేశ్‌లోని గుణాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రావు యద్వేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది.

Andhra Pradesh Elections 2024: అనపర్తిలో సైకిల్‌ని మంటల్లో పడవేసి నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలు, టికెట్ బీజేపీకి కేటాయించడంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి విభేధాలు భగ్గుమన్నాయి. కూటమిలో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ అభ్యర్థి ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు.

Telangana Fire: కాటేదాన్ బిస్కెట్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మైలార్ దేవుపల్లి పరిధిలో గల కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పడుకుని భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ

Hazarath Reddy

బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాసవర్మ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగానికి గురైన ఆయన్ని కార్యకర్తలు ఓదార్చారు. ఆయన ఎక్స్ లో షేర్ చేసిన పోస్టులో 30 సంవత్సరాల కష్టానికి ఫలితమే ఈ గుర్తింపు అంటూ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్

Rudra

ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

CM Jagan on Drugs Seized in Visakhapatnam Port: విశాఖ పోర్టులో డ్రగ్స్ సీజ్‌పై స్పందించిన సీఎం జగన్, నిందితులు టీడీపీ వారైనప్పటికీ వైసీపీపై బురదజల్లుతున్నారని మండిపాటు

Hazarath Reddy

విశాఖపట్నం పోర్టుపై సీబీఐ దాడులు చేసి మత్తుమందు కలిపిన డ్రై ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు కోడలు, ఏపీ బీజేపీ అధినేత్రి డి.పురందేశ్వరి బంధువుకు చెందిన సరుకు కంపెనీ కావడంతో ‘ఎల్లో బ్రదర్స్‌’ షాక్‌కు గురయ్యారు

Telangana Road Accident: పెళ్లి కూతురును తీసుకువస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి, మెదక్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

మెదక్‌ జిల్లాలో ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు ఆందోల్‌ గ్రామానికి బయల్దేరారు. మన్సాన్‌పల్లి వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది.

Telangana: ఇంట్లో గొడవపడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, ప్రాణాలకు తెగించి కాపాడిన హోంగార్డు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వరంగల్ - ఛత్తీస్‌గఢ్‌ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.. అతన్ని గమనించిన హోంగార్డు రవి ప్రాణాలకు తెగించి రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Advertisement

CM Jagan on Viveka Murder: చిన్నాన్న వివేకాను చంపినోడిని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో

Andhra Pradesh Elections 2024: మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు, మీరంతా సిద్ధమేనా అంటూ ప్రొద్దుటూర్‌ సభలో గర్జించిన సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. 58 నెలల పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత మనది. మద్దతుపలికే ఇంతటి ప్రజాసైన్యం మధ్య యాత్రను చేపట్టా. మీ అంతా సిద్ధమేనా? అని అన్నారు.

Andhra Pradesh Elections 2024: చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్, చంద్రబాబు మరో సంచలన ప్రకటన, ప్రజాగళంలో వైసీపీపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీడీపీ అధినేత

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరి,పలమనేరు ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు

Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, ఏపీలో బీజేపీ నుంచి పోటీ చేసే 10 మంది అసెంబ్లీ అభ్యర్థులు లిస్టు ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

Advertisement

Nellore Cow Sold for Rs.40 Crores: బ్రెజిల్‌లో రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు, ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డు

Hazarath Reddy

వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ (Viatina-19 FIV Mara Imoveis) అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్‌ వేలంలో.. ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట.

Andhra Pradesh Elections 2024: రేణిగుంటలో జగన్ ఫోటోతో చీరలు, వాచీలు, రూ. 50 కోట్ల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని రేణిగింటలో YSRCP నేతకు చెందినదని ఆరోపిస్తున్నగోడౌన్‌పై పోల్ అధికారులు దాడి చేసి రూ. 50 కోట్ల విలువైన చీరలు, స్పీకర్‌లు, కుక్కర్లు,.. భారీ మొత్తంలో చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై జగన్ ఫోటో ముద్రించి ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార YSRCP ఉచితాలను పంపిణీ చేస్తోందని TDP ఆరోపించింది.

Telangana Weather Update: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, అరెంజ్ అలర్ట్ జారీ చేసిన రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ

Hazarath Reddy

తెలంగాణలో మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, జైనథ్‌ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

Andhra Pradesh Elections 2024: రేపటి నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్న సీఎం జగన్, ఇచ్ఛాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర

Hazarath Reddy

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్రతో ప్రచార భేరి మోగించనున్నారు.

Advertisement
Advertisement