రాష్ట్రీయం
Half-Day Schools in Telangana: మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyమార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటి పూట బడులు (Half-day schools) నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది.
Andhra Pradesh Elections 2024: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీకి లైన్ క్లియర్, ఆనయ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ నేతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్‌ తోట నరసింహం భేటీ అయ్యారు.
Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వైద్యశాఖలో అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్యశాఖ ఉత్తర్వులు జారీ
Hazarath Reddyవైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్‌ కృష్ణబాబు జీవో జారీ చేశారు.
CM Jagan Slams Pawan Kalyan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన సీఎం జగన్, వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులు విడుదల
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్‌ చేయూత’ నాలుగో విడత నిధులను (YSR Cheyutha) బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. వైఎస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం పంపించింది
MLCs Appointment: ఎమ్మెల్సీల నియామకాలపై రేవంత్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు, గవర్నర్‌ కోటాలో జారీ చేసిన గెజిట్‌ను కొట్టేసిన ధర్మాసనం
Hazarath Reddyతెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని (MLCs Appointment) తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు (Telangana HC quashes rejection order) కొట్టివేసింది.
Car Accident Caught on Camera: కారు వేగంగా వచ్చి చెట్టును ఎలా ఢీకొట్టిందో చూడండి, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Hazarath Reddyఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Car Accident Caught on Camera) ఓ యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలానికి చెందిన పందిరి గౌతమ్(21) తన మిత్రుడు విక్టరీ వినయ్‌తో కలిసి వారి ఫ్రెండ్ ఇన్నోవా కారును తీసుకుని వరంగల్ వైపు వెళ్తున్నారు.
Kesineni Nani Slams Chandrababu: చంద్రబాబు కంటే జగన్ 20 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు, టీడీపీ అధినేతపై విరుచుకుపడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
Hazarath Reddyఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకు వస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ (YS Jagan) మూడేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం , అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు.
Palamuru Praja Deevena Sabha: 2024 నుంచి 2034 దాకా తెలంగాణలో ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే, మా జోలికి వస్తే అంతు చూస్తామని పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
Hazarath Reddyమహబూబ్ నగర్‌లో పాలమూరు ప్రజాదీవెన సభలో (Congress Praja Deevena Sabha) సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
Rythu Nestham in Telangana: డిజిటల్‌ ఫ్లాట్‌ ఫా ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కారం, రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రియల్‌ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
Hyd Man Dies in Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసి, ఉద్యోగంలో మోసపోయి రష్యన్ ఆర్మీలో చేరిన మృతుడు
Hazarath Reddyఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు బుధవారం వెల్లడించారు.
Input Subsidy to Farmers: మిచాంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల, 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారం జమ చేసిన సీఎం జగన్
Hazarath Reddyగతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(crop loss compensation)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
Moving Car Caught Fire Video: కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఈరోజు సైఫాబాద్ రోడ్డు వద్ద కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి.మంటలను డ్రైవర్ గమనించిన తర్వాత కారును రోడ్డు పక్కన తీసుకెళ్ళాడు. అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
Group 1, Group 2, Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు, గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు.
Poonam Kaur on Jagan Govt: కరోనాలో జగన్ నంబర్ వన్ పాలన అందించారు, ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ ప్రశంసలు
Hazarath Reddyకరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్‌ పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు.కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది.
Veligonda Project Twin Tunnel Inauguration: వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్, దశాబ్దాల కల సాకారం అయినందుకు గర్వంగా ఉందని వెల్లడి
Hazarath Reddyప్రకాశం, కడప, నెల్లూరులోని కరువు పీడిత, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఏగువాచెర్లోపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.
Telangana: మా కంపెనీ మందులు వాడితే కొత్త జుట్టు వస్తుందని ప్రజలను మోసం చేస్తున్న బడా కంపెనీ గుట్టు రట్టు, భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు
Hazarath Reddyగుజరాత్‌లోని హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన Minoxytop 10%తో కొత్త జుట్టు వస్తుందంటూ మిస్ లీడింగ్ ప్రకటనతో ప్రజలను కంపెనీ తప్పుదోవ పట్టిస్తోంది.మార్కెట్లో ఇది చెలామణి అవుతోంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు.
Fake Medicines Seized: ఎటువంటి డ్రగ్ వాడకుండా చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు, రూ. 33.35 లక్షల ఫేక్ మందులను స్వాధీనం చేసుకున్న తెలంగాణ డీసీఏ
Hazarath Reddyతెలంగాణలో నకిలీ టాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టును డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు. రూ. 33.35 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana Fire Video: నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో దగ్ధమైన మూడు కార్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా మూడు కార్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Fire Video: కూకట్‌పల్లిలో ఘోర అగ్నిప్రమాదం, హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్, కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని శక్తిపీఠం వద్ద ఉన్న హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. భవనం మొత్తానికి అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
Kodali Nani Slams Chandrababu: చంద్రబాబును ఓడిపోతేనే జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు దివంగత ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ మండిపడ్డారు.