రాష్ట్రీయం
Perni Nani Slams Pawan Kalyan: నీ రాజకీయాలే తేడా అనుకున్నా నువు కూడా తేడానే, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని, వీడియో ఇదిగో..
Hazarath Reddyమాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర బేరాలు ఉండవమ్మా.. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే.. నాలుగో, రెండో.. ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ. వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్‌.. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు
KTR's Challenge to CM Revanth Reddy: దమ్ముంటే రాజీనామా చేసి రా..మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్
Hazarath Reddyతెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని BRS పార్టీకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో...కేటీఆర్ స్పందించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో పోటీ చేద్దాం అంటూ సవాల్ విసిరారు.
Ambati Rambabu Slams Pawan Kalyan: నీకు, చంద్రబాబుకి మొగుడు జగన్, నీ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, జనసేనాధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, నీకు, చంద్రబాబునాయుడుకి మొగుడు జగన్ మోహన్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jithender Reddy: బట్టలు లేకుండా పిల్లాడు అటూ ఇటూ తిరుగుతున్న వీడియో షేర్ చేసిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తన ఎక్స్ లో సంచలన వీడియోను షేర్ చేశారు. బట్టలు లేకుండా అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్‌ చేస్తూ దానికి వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్ ఇచ్చారు .
Mega DSC Notification in Telangana: 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (Mega DSC notification) విడుదల చేశారు. ఈ మేరకు 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
Nagarkurnool MP Ramulu Joins BJP: బీఆర్ఎస్ పార్టీకి షాక్, బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు మావేనని తెలిపిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
Hazarath Reddyతెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.
Cop Saved Farmer Life: పొలంలో పురుగుమందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు ‌కాపాడిన పోలీసు, శభాష్ పోలీసన్న అంటున్న నెటిజన్లు
Hazarath Reddyపోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక్కోసారి దేవుని అవతారం ఎత్తుతుంటారనేది కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటన. పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ఓ పోలీసు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.
IAS Imtiaz Joins YSRCP: వైసీపీలో చేరిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌, కర్నూలు అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
Telangana Fire Accident: తార్నాకలో భారీ అగ్నిప్రమాదం, ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధం వీడియో ఇదిగో..
Hazarath Reddyతార్నాకలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
Telangana Inter Exams 2024: ఇంటర్ పరీక్షలు, విద్యార్థి ప్రాణం తీసిన ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన, డ్యాంలో దూకి సూసైడ్ చేసుకున్న విద్యార్థి
Hazarath Reddyతెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఆదిలాబాద్ - జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివ కుమార్ అనే విద్యార్థి పరీక్ష రాయడానికి రాగా ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధనతో పరీక్ష కేంద్రంలో అనుమతించలేదు.
Andhra Pradesh Elections 2024: జెండాలు మార్చుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..
Hazarath Reddyతాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు. అనంతరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు.
Mudragada Writes to Pawan Kalyan: మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు, పవన్‌ పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ, మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చంటూ..
Hazarath Reddyమీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.
Andhra Pradesh Elections 2024: నా సలహాలు పట్టించుకోకుంటే మీ ఖర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
Hazarath Reddyఈ లేఖలో తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.
BJP MP Laxman: త్వరలో తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య (వీడియోతో)
Rudraలోక్‌ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు.
Narendra Modi Telangana Visit: మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. 4న ఆదిలాబాద్‌ లో, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని
Rudraప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్‌ పూర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌‌ కు వస్తారు.
YSRCP 8th List: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల
Hazarath Reddyవైసీపీ తాజాగా మరో రెండు పార్లమెంట్‌, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్‌ యాదవ్‌, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
Chandrababu Slams CM YS Jagan: టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్‌ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అంటూ ఎద్దేవా
Hazarath Reddyతాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో ఏపీ ముఖ్యమంత్రిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ (Chandrababu Slams CM YS Jagan) అయ్యారు. టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.
Pawan Kalyan Slams CM YS Jagan: నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్, చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం, టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్‌ కళ్యాణ్ సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు.
Telangana DSC Notification Update: 11 వేలకు పైగా పోస్టులతో తెలంగాణలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి సర్కారు (Telangana Government) రద్దు చేసింది.5089 టీచర్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు (Telangana Government, Cancelled, Dsc Notification) చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Horror: సూర్యాపేటలో దారుణం, బ్లేడుతో భార్య, వదినలపై దాడి చేసి గొంతు కోసిన భర్త, కుటుంబ కలహాలే కారణమని తెలిపిన స్థానికులు
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవలో భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య నాగలక్ష్మి, వదిన స్వరూప గొంతును బ్లేడుతో కోసేశాడు. తీవ్ర గాయాలతో ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు నాగార్జునను బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.