రాష్ట్రీయం
Scorching Summer in India: రాబోయే 3 నెలలు భానుడు భగభగలు, తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని ఐఎండీ వార్నింగ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Hazarath Reddyభారతదేశం ఈ ఏప్రిల్‌లో దేశంలో అతిపెద్ద ఎన్నికల సీజన్‌లోకి వెళుతున్నందున మండే వేసవిని (Scorching Summer in India) చూడబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులను హెచ్చరించింది.రాబోయే మూడు నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో హీట్‌వేవ్ రోజులను మేము ఆశిస్తున్నామని తెలిపింది.
Indian Air Force: ఐఏఎఫ్‌ విమానంకు తప్పిన పెను ప్రమాదం, సాంకేతిక లోపంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు, ఎట్టకేలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్
Hazarath Reddyఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం IAF C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటకుపైగా ఎయిర్‌ఫోర్స్‌ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కాకవడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.
Satish Reddy Joins YSRCP: పులివెందులలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత సతీష్‌రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని వెల్లడి
Hazarath Reddyపులివెందులలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు.
Suryaprakash Joins YSRCP: వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్, ఆరేళ్లలో అరగంట కూడా నాతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మండిపాటు
Hazarath Reddyకాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై మండిపడ్డారు.
High Alert in Hyderabad: బెంగుళూరు బాంబు పేలుళ్లతో హైదరాబాద్‌లో హై అలర్ట్, కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు
Hazarath Reddyబెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌లో పోలీసులు హైఅలెర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు
Hyderabad: పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థిని, ప్రథమ చికిత్స అందించి పరీక్షా కేంద్రం దగ్గర దించిన మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌
Hazarath Reddyఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు విద్యార్థిని తన తండ్రితో కలిసి వెళ్తుండగా సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్‌ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. విద్యార్థిని, ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి.
MP BB Patil Joins BJP: బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్, బీజీపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు.
Counterfeit Drug Racket: నకిలీ టాబ్లెట్ల రాకెట్‌ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, రూ.7.34 లక్షల విలువైన నకీల మందులు స్వాధీనం,వీడియోలు ఇవిగో..
Hazarath Reddyడ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) తెలంగాణ, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ సహకారంతో, మార్చి 1 న ఉత్తరాఖండ్‌లో నిర్వహిస్తున్న నకిలీ మందుల తయారీ యూనిట్‌ను ఛేదించింది. నెక్టార్ హెర్బ్స్, డ్రగ్స్‌గా గుర్తించబడిన ఈ యూనిట్ అనేక రాష్ట్రాలకు నకిలీ మందులను పంపిణీ చేస్తోంది.
Jagananna Vidya Deevena: ఐదేళ్లలో ఒక్క విద్యారంగానికే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన జగన్ సర్కారు, జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyకృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్‌ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్‌ ఖాతాల్లోకి సీఎం జగన్‌ విడుదల చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, సునీత ముసుగు నేటితో తొలగిపోయిందంటూ కౌంటర్ విసిరిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyవివేకా కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌటంర్ ఇచ్చారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని ప్రశ్నించారు
Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కష్టాలు మరింత ఎక్కువవుతాయి, వైసీపీ పార్టీకి ఓటు వేయవద్దని తెలిపిన వైఎస్ సునీత
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసుపై ఆయన కూతురు వైఎస్ సునీత తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
AP Inter Exams 2024: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లు సిద్ధం, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు
Hazarath Reddyఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.
Nalgonda Audit Office Fire: నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం, పూర్తిగా మంటల్లో కాలిపోయిన కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్
Hazarath Reddyతెలంగాణలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీసులోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు
Viral Video: పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ యువకుడిని చితకబాదిన స్థానికులు.. నిర్మల్ లో ఘటన.. వీడియో వైరల్
Rudraపిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ ఓ యువకుడిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటన నిర్మల్ టౌన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Commercial LPG Cylinder Price Hike: పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు.. ధరలను సవరించిన చమురు కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం
Rudraవాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ మేరకు చమురు కంపెనీలు ధరలను సవరించాయి.
Mana Yatri App: హైదరాబాద్‌ లో కమీషన్‌ రహిత తొలి ఆటోక్యాబ్‌ యాప్‌ 'మనయాత్రి' అందుబాటులోకి.. డ్రైవరన్నలకు ఎంతో ఉపయుక్తం..
Rudraహైదరాబాద్‌ లో తొలిసారిగా జీరో కమీషన్‌ ఆధారిత ఆటో క్యాబ్‌ యాప్‌ ‘మనయాత్రి’ తాజాగా అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్‌లో రూపొందించారు.
Dharani Guidelines: ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రేవంత్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం, మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ
VNSధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు (Dharani Guidelines) జారీ చేసింది. పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ నెల 24న ధరణిపై రివ్యూలో.. ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
Pattipati Pullarao's Son Sharat Arrest: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్, జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మాచవరం పోలీసులు
Hazarath Reddyమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు నేడు శరత్‌ను అరెస్ట్ చేశారు.
Telangana: సాత్నాల ప్రాజెక్టులో దొరికిన ఇంటర్ విద్యార్థి మృతదేహం, ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు పరీక్ష రాయనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Hazarath Reddyఇంటర్ పరీక్షకు లేటుగా వెళ్లడంతో పరీక్ష రాయనివ్వలేదని మనస్తాపం చెందిన శివకుమార్ ఈరోజు జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోలో దూకి ఆత్మహత్య చేసుకోగా స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.