రాష్ట్రీయం

Telangana Govt Transfers IAS,IPS Officers: హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి

Hazarath Reddy

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Kotha kota Srinivasreddy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

HC on Women Allowed in Mosques: మసీదుల్లోకి షియా ముస్లిం మహిళలను అనుమతించండి, దేవుని ముందు అందరూ సమానమే, సంచలన తీర్పును వెలువరించిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని దారుల్‌షిఫాలో ఉన్న ఇబాదత్‌ఖానాలోకి అక్బరీశాఖ సహా షియా ముస్లిం మహిళలందరినీ అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.ఇబాదత్‌ఖానా అంటే.. ప్రార్థనలు, కూటములు, వేడుకలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకొనే ప్రదేశం.

Weather Forecast in Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో తుఫాను వార్తలన్నీ అబద్దం, ఇప్పట్లో ఎటువంటి సైక్లోన్ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ క్లారిటీ

Hazarath Reddy

బంగాళాఖాతంలో మళ్ళీ ఇంకో తుపాన్ రానుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని, ఆ వార్తల్లో నిజంలేదని చెప్పారు.

TSPSC Chairman Resigns: సీఎంను కలిసిన కొద్ది సేపటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన బి.జనార్ధన్‌రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు.

Advertisement

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు, ప్రతి నెలా జీతాలతో పాటు అలవెన్సులు కలిపి చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్‌ టు’లో డ్యూటీ బేస్డ్‌ అలవెన్సులను జీతాలతో పాటు కలిపి చెల్లించనుంది.

DGP Anjani Kumar Suspension Revoked: డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఈసీ, తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని సీఈసీకి విజ్ఞప్తి చేసిన ఐపీఎస్‌ అధికారి

Hazarath Reddy

No Water Supply to Hyderabad: హైదరాబాద్ లో రేపు నల్లా నీళ్లు బంద్‌.. ప్రభావం పడే ప్రాంతాల జాబితా ఇదిగో!

Rudra

హైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి పథకం ఫేజ్‌-3లోని కోదండపూర్‌ పంపింగ్‌ స్టేషన్‌ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ హైడర్‌ పైపులైన్‌ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు.

Jagitial Bribe Row: లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం’ చేసిన మత్స్యకార సంఘాల సభ్యులు.. వీడియోతో

Rudra

జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.

Advertisement

Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??

Rudra

హైదరాబాద్ అంటేనే బిర్యానీ సువాసనలు. మరి అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ శుభవార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే ఆస్వాదించొచ్చు.

Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రైతుబంధు విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు, ప్రస్తుతానికి ఎంతంటే..

Hazarath Reddy

తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను తెలంగాణ కొత్త ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు

Telangana: సివిల్ వివాదం, పోలీస్‌స్టేషన్ నుండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకు గుండెపోటుతో 50 ఏళ్ళ వ్యక్తి మృతి, పోలీసులు దాడి చేయడం మరణించారని కుటుంబ సభ్యుల ఆరోపణలు

Hazarath Reddy

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో సివిల్ వివాదంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన 50 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన సోదరుడితో ఆస్తి వివాదానికి సంబంధించి చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన సూర్యా నాయక్, పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకే అస్వస్థతకు గురయ్యాడు

Ganji Chiranjeevi: గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం, ఆర్కే రాజీనామా తర్వాత ఒక్కసారిగా మారిన రాజకీయాలు

Hazarath Reddy

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.

Advertisement

Chiranjeevi Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి, సినిమా పరిశ్రమ గురించి అడిగారని తెలిపిన మెగాస్టార్

Hazarath Reddy

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను..మెగాస్టార్ చిరంజీవి సోమవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు.

Nara Devansh in Yuvagalam Padayatra: వీడియో ఇదిగో, తండ్రితో కలిసి పాదయాత్రలో నడిచిన నారా దేవాన్ష్, ఈ నెల 18న ముగియనున్న నారా లోకేష్‌ పాదయాత్ర

Hazarath Reddy

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు. నాన్నతో కలిసి కాలు కదిపారు. తనయుడి చేయి పట్టుకొని లోకేశ్ కాసేపు పరుగు తీశారు. దేవాన్ష్ తండ్రితో కలిసి పరుగు పెట్టడం అక్కడున్న వారికి ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాదయాత్రలో నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు.

Telangana Assembly Speaker Election: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక తేదీ ఇదిగో, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు (Telangana Assembly Speaker Election) చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌ సోమవారం(డిసెంబర్‌11)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు

Chandrababu Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు, త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని ఆకాంక్షించిన మాజీ సీఎం

Hazarath Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్‌ (KCR) వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు.

Advertisement

YSR Law Nestham: రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,807 యువ లాయర్ల అకౌంట్లలో రూ.7,98,95,000 జమ

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు.

Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్పమాల ధరించిందని బాలికను స్కూలు లోపలికి రానివ్వని యాజమాన్యం, దాదాపు గంటపాటు ఎండలో నిలబడిన పాప

Hazarath Reddy

హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం... అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూలులోకి అనుమతించలేదు. పాఠశాలలోకి మాలతో అనుమతి లేదని, స్కూల్ దుస్తుల్లోనే రావాలని చెప్పింది. దీంతో మాల వేసుకున్న పాప దాదాపు గంటపాటు ఎండలో నిలబడవలసి వచ్చింది

Alla Ramakrishna Reddy Resigns: మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి

Hazarath Reddy

ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, సూర్యలంక బీచ్‌లో అలలకు కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ

Hazarath Reddy

సూర్యలంక బీచ్‌కి వచ్చి అలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మునిగిపోతున్న ఇద్దరు యువకులను చూసిన తీరం వెంబడి గస్తీ పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్లి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు.యువకులను తెనాలి టౌన్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement