రాష్ట్రీయం

Weather Update: తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

గత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Assembly Session 2023: బాలకృష్ణకు మెంటల్ ఉంది కాల్పులు జరుపుతాడేమో, అసెంబ్లీలోకి రానివ్వకండి అధ్యక్షా, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు.

Ambati Rambabu vs Balakrishna: మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో, నీవు విజిల్స్ వేయడం మానేసి టీడీపీ పగ్గాలు అందుకో, బాలకృష్ణకు అంబటి రాంబాబు సలహా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్‌ వేశారు.అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nanadamuri Balakrishna) తీరుపై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: మద్యం షాపులు ముట్టడించి మందు బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చా, వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని తెలిపిన పురంధేశ్వరి

Hazarath Reddy

మద్యపాన నిషేధం అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యం షాపులు ముట్టడించారు. షాపులో ఉన్న ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చ కార్యకర్తలు నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతామంటూ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, హిజ్రాలతో ముజ్రా డాన్స్ వేయించిన రౌడీ షీటర్లు, స్టేషన్‌కు తీసుకువెళ్లి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చిన పోలీసులు

Hazarath Reddy

హిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించిన రౌడీ షీటర్లకి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ పోలీసులు. హైదరాబాద్ లోని హబీబ్ నగర్లో అక్బర్ అనే రౌడీ షీటర్ గాంగ్ ద రింగ్ పార్టీలో హిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు తమ తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వీడియోలు ఇవిగో..

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌‌ను నిరసిస్తూ బాపట్ల సముద్ర తీరంలో శాండ్ ఆర్ట్, Justice for CBN హ్యాష్ ట్యాగ్‌తో ఆర్ట్ వేసిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్

Hazarath Reddy

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ బాపట్ల సముద్ర తీరంలో బీచ్ ఆర్ట్ వేయించారు. బాపట్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ఆధ్వరంలో ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ ఆర్ట్ వేశారు. #Justice for CBN అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఏపీ మ్యాప్, పక్కన కోర్టుల్లో న్యాయమూర్తులు వినియోగించే సుత్తిని రూపొందించారు.

Video: వీడియో ఇదిగో, గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా - ధర్మవరంలో ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

Video: వీడియో ఇదిగో, వినాయకుడి మండపంలో నిద్రిస్తున్న వారి సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన దొంగ

Hazarath Reddy

గణేష్ మండపాలను సైతం దొంగలు వదలడం లేదు. రెండు రోజుల క్రితం మియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఓ దొంగ సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు. మండపంలో నిద్రిస్తున్న వారు లేవగా అక్కడి నుంచి పారిపోయాడు

Advertisement

Skill Development Scam: చంద్రబాబుకు షాకిచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టులో పిల్, టీడీపీ అధినేత జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఈ నెల 24 వరకు పొడిగింపు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయన్ను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు.

AP Assembly Session 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో విజిల్ వేస్తూ హల్‌చల్ చేసిన బాలకృష్ణ, రెండో రోజు కూడా అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్‌ వేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా ఆయనతో కలిసి విజిల్స్‌ వేశారు

TDP MLAs Suspension: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న టీడీపీ సభ్యుల ఆందోళన.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు.. అచ్చెన్నాయుడు, అశోక్ ను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేసిన స్పీకర్.. సభలో విజిల్ వేస్తూ బాలకృష్ణ నిరసన

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల ఆందోళన.. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసన.. 15 నిమిషాల్లోనే సభ వాయిదా

Rudra

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

Advertisement

Tirumala Brahmotsavalu: కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్న గరుడ వాహన సేవ (లైవ్)

Rudra

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవ జరుగుతుంది.. లైవ్ లో చూడండి.

Changes in Vande Bharat Express: సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్‌ రెస్ట్‌ కు మెరుగులు, ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు.. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వందేభారత్‌ రైళ్లలో రైల్వేశాఖ 25 కీలక మార్పులు

Rudra

అత్యాధునిక వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో ప్రయాణం ఇకపై మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వందేభారత్‌ రైళ్లల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్టు రైల్వే శాఖ పేర్కొంది.

Telangana: వీడియో ఇదిగో, భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త , అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరింపులు, చివరకి ఏమైందంటే..

Hazarath Reddy

జగిత్యాల - ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ వృత్తి రీత్యా పెయింటర్. భార్య కాపురానికి రావడం లేదని హెవీ విద్యుత్ లైన్ పోల్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భార్య రాకుంటే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని బెదిరించాడు.

Skill Development Scam: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా, హైకోర్టులో టీడీపీ అధినేత క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

Hazarath Reddy

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి అడిగారు.

Advertisement

AP Assembly Session 2023: నేను అసెంబ్లీలో మీసం మెలేయలేదు, తొడ కొట్టి మీసం మెలేసింది వైసీపీ వాళ్లే, కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పిన బాలయ్య

Hazarath Reddy

అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు.

Roja on Balakrishna: వీడియో ఇదిగో, బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య మీసాలు మెలేస్తున్నాడు,మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం సెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రోజా మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్‌ విసిరేసి, బాటిల్స్‌ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది

Nara Lokesh on Chandrababu Arrest: దోమలతో కుట్టించి చంద్రబాబును చంపాలన్నదే జగన్ ప్లాన్, సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్

Hazarath Reddy

రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Video: దారుణమైన వీడియో ఇదిగో, బతికుండగానే మంత్రి రోజా గుండెపోటుతో చనిపోయారంటూ నివాళులర్పించిన తెలుగు మహిళలు

Hazarath Reddy

విశాఖపట్నం - చంద్రబాబు అరెస్ట్ వార్త విన్న తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు రోజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారంటూ.. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ తెలుగు మహిళలు నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. బతికుండగానే ఇలా చేయడం ఏంటీ అని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement