రాష్ట్రీయం
Harish Rao on Chandrababu Arrest: వీడియో ఇదిగో, పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, దాని గురించి మాట్లాడకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు
Hazarath Reddyసిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు. దాని గురించి మాట్లాడకూడదు గానీ గతంలో ఆయన ఐటీ ఐటీ అనేవారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగింది, పల్లెల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది' అని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Bandh: వీడియో ఇదిగో, బంద్ సమయంలో రోడ్డుపైకి వచ్చారని సామాన్యులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే బంద్ సందర్భంగా సామాన్యులు రోడ్డు మీదకు వచ్చారని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.
Skill Development Scam Case: ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్, కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదంటూ మండిపడిన జడ్జి
Hazarath Reddyచంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులోవాదనలు ముగిశాయి. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను బాబు తరపు న్యాయవాదులు ఉదహరించగా కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలను న్యాయమూర్తి అడిగారు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
Skill Development Scam Case: చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై మరి కాసేపట్లో తీర్పు, ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, ఎవరేం వాదించారంటే..
Hazarath Reddyచంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులోవాదనలు ముగిశాయి. సాయంత్రం గం. 4.30ని.లకు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించగా, ఏపీ సీఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు
Amaravati Inner Ring Road Case: చంద్రబాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుతో సహా మరో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఏపీ సీఐడీ
Hazarath Reddyటీడీపీ అధినేత అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ రెండు పిటిషన్‌లు దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేయగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేసింది.
Skill Development Scam Case: పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం, పీవీ రమేశ్ స్టేట్ మెంట్‌తోనే కేసు నడవడం లేదని తెలిపిన సీఐడీ వర్గాలు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఏపీ సీఐడీ స్పందించింది.
Indrakiladri Landslides: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత, భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyగత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది.భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి.
Gadwal MLA Disqualification Row: గద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సుప్రీం కోర్టులో ఊరట, ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyగద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Skill Development Scam Case: చంద్రబాబుకు రాజమండ్రి జైలులో స్నేహ బ్లాక్ కేటాయింపు, తొలి రోజు ఇంటి నుంచి బ్లాక్ కాఫీ, ఫ్రూట్ సలాడ్, రోజుకు ముగ్గురిని కలిసేందుకు కోర్టు అనుమతి
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం తెల్లవారుజామున 1.20 గంటలకు రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులోకి ప్రవేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రికి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు సెంట్రల్ జైలులోని 'స్నేహ బ్లాక్'ని కేటాయించారు.
Andhra Pradesh Bandh: ఏపీలో కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్, నిరసనకు దూరంగా బీజేపీ, రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, బిర్యానిలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు రెస్టారెంట్ సిబ్బంది దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కస్టమర్ మృతి
Hazarath Reddyహైదరాబాద్ - పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లి యాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముందు వస్తున్న వాహనాలను గమనించాలని సూచన
Hazarath Reddyమూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.
Thane Accident: థానెలో ఘోరం.. లిఫ్ట్ పడిపోయి ఏడుగురి కార్మికుల దుర్మరణం.. వీడియోతో
Rudraమహారాష్ట్రలోని థానెలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవంతి లిఫ్ట్ పడిపోయిన ఘటనలో ఏడుగురు మరణించారు.
AP High Court Judge Injured: ఏపీ హైకోర్టు జడ్జి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా.. ప్రమాదంలో జస్టిస్‌ సుజాతకు గాయాలు.. వీడియోతో
Rudraరోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
Telangana Rain Update: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఏపీలో కూడా..
Rudraతెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా
Rudraతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌ కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.
Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?
Rudraభారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.
Chandrababu Arrest Update: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెం 7691 కేటాయింపు.. జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి.. కొనసాగుతున్న ఏపీ బంద్.. పూర్తి వివరాలు ఇవిగో!
Rudraస్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్డు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు.
Chandrababu Shifted to Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు, ఏపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 144 సెక్షన్ అమలు, దారి పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, ఇవాళ బెయిల్ పిటీషన్ పై వాదనలు
VNSటీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu) పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబు సొంత కాన్వాయ్‌ లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి (Rajamandry Central Jail) తరలించారు.