రాష్ట్రీయం
Andhra Pradesh: చెన్నై విమానాశ్రయంలో కుప్పకూలి మృతి చెందిన చిత్తూరు వాసి, దక్షిణాఫ్రికా నుంచి సొంత ఊరికి తిరిగివస్తూ మధ్యలోనే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyచెన్నై విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌లో ఆదివారం ముంబై నుంచి విమానం దిగి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తి ఏరోబ్రిడ్జ్‌లో కుప్పకూలి మృతి చెందాడు. దక్షిణాఫ్రికాకు చెందిన సోలమన్ మార్టిన్ లూథర్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు వెళ్తున్నాడు.
Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందిన నిందితుడు, పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గల బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు.
Uddhav Thackeray: మహారాష్ట్ర సంగతి తర్వాత.. ముందు మీ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోండి.. కేసీఆర్‌పై ఉద్ధవ్ థాకరే ఫైర్
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం బాగు కోసం పోరాడతారా? లేదంటే, బీజేపీకి మద్దతిస్తారా? ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు.
Balka Suman: కాంగ్రెస్ పార్టీలోకి కోవర్టులను పంపాం.. కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దు.. కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
Rudraమరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు.
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
Rudraతిరుమలలో చిరుతలను పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు.
TSRTC To Operate Electric Buses: హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్, గ్రేటర్‌ పరిధిలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం, ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో సర్వీసులు
VNSప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ (TSRTC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను (Electric Buses) న‌డ‌పాల‌ని ఆర్టీసీ అధికారులు నిర్ణ‌యించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల ప‌రిధిలో ఈ బ‌స్సుల‌ను న‌డిపేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ అధికారులు నిర్ణ‌యించారు.
CPI On Alliance With Congress: కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఐ సై, ప్రాథమిక చర్చలు జరిగాయన్న నేతలు, బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామంటూ ప్రకటన
VNSతెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది. వామపక్ష పార్టీలతో పొత్తులు లేవని బీఆర్ఎస్ (BRS) తేల్చేయడంతో కాంగ్రెస్ (Congress ) పార్టీతో పొత్తుల కోసం సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ (CPI) చర్చించినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే
Amit Shah Meeting At Khammam: 4జీ, 3జీ, 2జీ కాదు, తెలంగాణలో వచ్చేది బీజేపీనే, రైతులను బీఆర్‌ఎస్ మోసం చేసింది - ఖమ్మం సభలో అమిత్ షా చురకలు
ahanaతెలంగాణలోని ఖమ్మంలో జరిగిన రైతు గోస-బీజేపీ భరోసా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Medak Leopard: మెదక్ జిల్లాలో చిరుత హల్ చల్, పొలంలో దూడను తినేయడంతో, భయాందోళనలు..
ahanaమాసాయిపేట మండలం చెట్ల తమ్మాయి పల్లి గ్రామంలో చిరుతపులి సంచరించడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యవసాయ పొలంలో చిరుత దూడను చంపి తినేసింది.
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.
Amit Shah: నేడే తెలంగాణకు అమిత్ షా.. ఖమ్మం జిల్లాలో బీజేపీ రైతు సభలో పాల్గొననున్న హోం మంత్రి.. చివరి నిమిషంలో రద్దయిన భద్రాచల రాములవారి దర్శనం షెడ్యూల్
Rudraకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు తెలంగాణకు (Telangana) రానున్నారు. అయితే షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
Congress SC, ST Declaration: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు, ఆర్ధిక సాయం పెంచుతామంటూ హామీ, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన ఖర్గే
VNSతెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చదువుతుండడంతో తన జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నానని చెప్పారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Allu Arjun: ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌
ahana69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం.. ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌
Tomato Price Fall: భారీగా పడిపోయిన టమాటా ధర, రూ.20కి పడిపోయిన 1 కేజీ టమాటా ధర, పత్తికొండ మార్కెట్‌లో రూ.10లకు పడిపోయిన టమాటా ధర
ahanaభారీగా పడిపోయిన టమాటా ధరలు. రూ.20కి పడిపోయిన టమాటా ధర. కర్నూలు, పత్తికొండ మార్కెట్‌లో రైతులకు రూ.10 కూడా దక్కని పరిస్థితి. కనీస పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన. మూడు వారాల క్రితం కిలో రూ. 100 పలికిన టమాటా.
Rahul Sipligunj: నేను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు..అభిమానులకు రాహుల్ సిప్లిగంజ్ సుదీర్ఘ లేఖ..
ahanaటాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన రాజకీయ ప్రవేశంపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండించారు. తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
Viral Video: వరంగల్‌లో దారుణం, ఫుల్ బాటిల్ కావాలని తల్వార్‌తో బెదిరిస్తూ మందుబాబు హంగామా..
ahanaవరంగల్లో మద్యం మత్తులో మధు అనే మందు బాబు బార్‌కు వెళ్లి తనకు ఫుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేయగా కుదరదని బార్ సిబ్బంది చెప్పడంతో తల్వార్‌తో వచ్చి తనకు ఫుల్ బాటిల్ మద్యం ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు.
Andhra Pradesh Shocker: సిగరెట్లు తీసుకురాలేదని ఏడో తరగతి విద్యార్ధిని చితకబాది చేయి విరగ్గొట్టిన యువకుడు, బాధిత బాలుడు ఆసుపత్రి పాలు..
ahanaఈస్ట్ గోదావరి - కోరుకొండ మండలం కణపుర్ గ్రామానికి చెందిన సతీష్ (23) అదే గ్రామానికి చెందిన శశిధర్ (13) అనే విద్యార్థిని రోడ్డు మీద వెళ్తుండగా ఆపి సిగరెట్లు తేవాలని కోరాడు. శశిధర్ వినకపోవడంతో అతడిని చావబాది వెనక నుండి తన్నడంతో కాలు, చెయ్యి విరిగి ఆసుపత్రి పాలయ్యాడు.
Coca Cola in Telangana: తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసిన కోకా కోలా, సంస్థ చరిత్రలో ఇంత వేగంగా భారీ పెట్టుబడి, విస్తరణ చేయడం ఇదే మొదటిసారి
ahanaతెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు కోకా కోల సంస్థ ప్రకటించింది. తాజాగా సిద్దిపేట జిల్లాలోని తన ప్లాంట్‌లో అదనంగా 647 కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి ఈ మేరకు ప్రకటించారు.
Koti Vruksharchana: కోటి వృక్షార్చనకు శ్రీకారం.. మంచిరేవుల పార్క్‌ లో నేడు మొక్క నాటనున్న సీఎం కేసీఆర్‌
Rudraభారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ (Koti Vruksharchana) కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఘనంగా ప్రారంభించనున్నది.
Rail Over Rail Bridge: గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో అత్యంత పొడవైన రైల్ వంతెన.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన ఆర్వోఆర్‌గా గుర్తింపు.. వీడియో ఇదిగో!
Rudraఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాలోని గూడూరు-నెల్లూరు జిల్లాలోని మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన అత్యంత పొడవైన రైల్వే ఫ్లై ఓవర్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.