రాష్ట్రీయం

Viral Video: ఫేస్‌బుక్ ద్వారా ప్రేమించి ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి, శ్రీలంక తిరిగి వెళ్లిపోవాలని యువతికి చిత్తూరు పోలీసుల నోటీసులు

kanha

ఫేస్‌బుక్ ద్వారా ప్రేమించి ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి..శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. విజిటింగ్ వీసాపై ఈనెల 8న వచ్చిన విఘ్నేశ్వరి, లక్ష్మణ్ వివాహం చేసుకున్నారు.

Telangana Rains: వరంగల్ భద్రకాళి చెరువుకు గండి, ముంపు ప్రాంత ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

kanha

వరంగల్ జిల్లాలో తాజాగా వరంగల్‌ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతననగర్ వైపు భద్రకాళి చెరువుకు గండి పడింది. దీంతో ఉదృతంగా వరద పోతోంది. దీంతో భయాందోళనలో పోతననగర్, సరస్వతి నగర్ వాసులు ఉన్నారు. వర్షం లేకపోయినప్పటికీ భద్రకాళి చెరువుకు భారీగా తరలివస్తోంది వరద. చెరువుకు వరద పోటేత్తడంతో కోతకు గురైంది కట్ట. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Bay of Bengal: బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.. సముద్రంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులను రక్షించిన నేవీ

Rudra

బంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలంగా ఉండడంతోపాటు కోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

MMTS Trains Cancelled: వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకూ సర్వీసులు రద్దు

Rudra

ఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతులు నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది.

Advertisement

Rottela Panduga: నెల్లూరులో నేటి నుంచి ఐదు రోజులపాటు రొట్టెల పండుగ.. ముస్తాబైన బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు.. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా ప్రసిద్ధి

Rudra

ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెల్లూరులోని రొట్టెల పండుగ మొదలైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ పండుగ జరగనుంది.

Godavari’s Danger Level In Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. 54 అడుగులు దాటిన నీటిమట్టం.. నీటమునిగిన భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం.. పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Rudra

భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది.

Fake Judge Arrest: జైలు నుంచి వచ్చి జడ్జీగా అవతారమెత్తిన కేటుగాడు, నేను న్యాయమూర్తిని మీ భూసమస్యలు పరిష్కరిస్తానంటూ రూ. 10లక్షలు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్

VNS

జిల్లా జడ్జి పేరుతో (Fake judge) మోసాలకు పాల్పడుతున్న వ్యక్తితోపాటు, ఆయ‌న‌కు భ‌ద్ర‌తా సిబ్బందిగా పనిచేస్తున్న మరోవ్యక్తిని శుక్రవారం మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ (SOT) పోలీసులు, ఉప్పల్‌ (Uppal) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్ద‌రి నుంచి పిస్టల్‌, రెండు మ్యాగ‌జైన్స్‌, ఫోర్‌వీలర్‌ వాహనం, మూడు సెల్‌ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana Rains: భారీ వరదల్లో నీటిలో ఈదుకుంటూ వెళ్లి గ్రామానికి కరెంట్ సరఫరా అందించిన విద్యుత్ ఉద్యోగి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాతర్ల పహాడ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురవుతున్న ప్రాంతం మధ్యలో వైరు తెగిపోవడంతో గ్రామంలో కరెంటు లేకుండా పోయిందని తెలుసుకున్న ఎలక్ట్రికల్ హెల్పర్‌ కొప్పుల సంతోష్‌ ఏ మాత్రం వెనుకాడకుండా నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి తీగను మరమ్మత్తు చేసి గ్రామం మొత్తానికి విద్యుత్‌ను తిరిగి తీసుకువచ్చాడు.

Advertisement

TSRTC: ప్రయాణికులకు అలర్ట్, హైదరాబాద్ - విజయవాడ బస్సు సర్వీసులు రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ, ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది.

Telangana Floods: భారీ వర్షాల్లో ప్రజలకు అండగా తెలంగాణ పోలీసులు, వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో బిజీ బిజీ

Hazarath Reddy

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పోలీసులు దగ్గరుండి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాళ్లు శ్రమిస్తున్న ఓ వీడియోనే దీనికి సాక్ష్యం.

BRO Movie Chaos: థియేటర్లో స్క్రీన్ చింపేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ "బ్రో" సినిమాకు అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి తోపులాటలో స్క్రీన్ చింపారు. స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Telangana Rains: తెలంగాణలో పది జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Hazarath Reddy

వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల పైచిలుకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

Advertisement

Video: దుకాణదారుడికి టోపీ పెట్టిన కిలేడీ, యజమాని కళ్లు గప్పి స్మార్ట్‌గా బంగారం దొంగతనం ఎలా చేసిందో వీడియోలో చూడండి

Hazarath Reddy

శ్రీకాకుళంలో కి'లేడీ' దొంగతనం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. శ్రీకాకుళం - సోంపేటలో శుక్రవారం ఓ జ్యుయలరీ షాపులో దొంగతనం జరిగింది. బంగారం కొనుగోలు చేస్తామని వచ్చిన ఒక అమ్మాయి దుకాణదారుడు కళ్ళు కప్పి దొంగతనం చేసింది. దానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వైరల్ అవుతోంది.

Revanth Reddy Missing Posters: రేవంత్ రెడ్డి కనబడటంలేదని పోస్టర్లు, 2023లో వర్షాలు వస్తున్న బటయకు రాలేదంటూ నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు

Hazarath Reddy

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కనబడుటలేదని నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు. 2020 వరదలు వచ్చినప్పుడు రాలేదు, 2023లో వర్షాలు వస్తున్న రాలేదు అంటూ పోస్టర్లు.నియోజకవర్గంలో పలు చోట్ల గోడలకు ఈ పోస్టర్లను అంటించారు. అయితే ఎవరు అంటించారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.

Telangana Floods: భారీ వరదలు, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పరిస్థితిని పర్యవేక్షించిన సీఎం కేసీఆర్, ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు

Hazarath Reddy

తెలంగాణలో గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.

Telangana Floods: హైదరాబాద్ - విజయవాడ హైవే మీద 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, మిర్యాలగూడ మీదుగా మళ్లింపు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు వాగు

Hazarath Reddy

హైదరాబాద్ - విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఐతవరం వద్ద హైవేపై మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. కోదాడ - హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Video: శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన 25 అడుగుల పొడవున్నఅరుదైన చేప బ్లూ వేల్, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చని అనుమానాలు

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.

Andhra Pradesh Floods: వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది.

Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, ముంపు బాధితులకు బాసటగా నిలవాలని అధికారులకు ఆదేశాలు, గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు

Hazarath Reddy

రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Justice Dhiraj Singh Thakur: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం, శాలువా కప్పి సన్మానం చేసిన సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకో­ర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనచేత ప్రమాణం చేయించారు. సీఎం జగన్‌ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు.

Advertisement
Advertisement