రాష్ట్రీయం

Techie Commits Suicide: భర్త, అత్తమామల వేధింపులు, ఫేస్‌బుక్ లైవ్ పెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, నాచారంలో విషాదకర ఘటన

Hazarath Reddy

భర్త, అత్తమామల వేధింపులు తాళలేక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో చోటుచేసుకుంది. గత 5 నెలల నుంచి భార్య సనను భర్త హేమంత్‌ వేధిస్తున్నాడు.

Mudragada Letter to Pawan Kalyan: గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు, పవన్ కళ్యాణ్‌పై లేఖలో మరోసారి విరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

AP SSC Supplementary Result 2023: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఈ డైరెక్ట్ లింకుల ద్వారా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్‌ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను విడుదల చేశారు.

Friends Beat Another Friend Video: దారుణం, బర్త్ డే పార్టీకి అని పిలిచి చితకబాదిన ఫ్రెండ్స్, మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దని ఆపినందుకు కక్ష పెంచుకున్న స్నేహితులు

Hazarath Reddy

మదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అన్నందుకు బర్త్ డే పార్టీ అని పిలిచి అతన్ని మిగతా స్నేహితులు దారుణంగా కొట్టారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Advertisement

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌ లో అక్రమాల ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేసిన సుబ్బారెడ్డి.. మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడి

Rudra

శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

Tirumala Horror: తిరుమలలో బాలుడిని నోట కరిచి ఎత్తికెళ్లిపోయిన చిరుత.. సినీ ఫక్కీలో వెంబడించిన స్థానికులు, తల్లిదండ్రులు.. బాలుడిని వదిలివెళ్లిపోయిన చిరుత..గాయాలపాలైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు

Rudra

తిరుమలలో ఘోరం జరిగింది. అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

Martyrs' Memorial Inauguration: అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్, కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు

Hazarath Reddy

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం, గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయిన డెడ్ బాడీ

Hazarath Reddy

హైదరాబాద్ | ఈరోజు ఉదయం సారధి హౌసింగ్ సొసైటీ గ్రౌండ్స్‌లో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు: రవికుమార్, ఇన్‌స్పెక్టర్, బోరబండ పోలీస్ స్టేషన్

Advertisement

Gruha Lakshmi Scheme Guidelines: ఆహార భద్రతా కార్డు ఉంటేనే రూ.3 లక్షలు, తెలంగాణ గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలు, అర్హతలు ఇవిగో..

Hazarath Reddy

సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Guidelines For Gruha Lakshmi Scheme: సొంత ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌ న్యూస్‌, రూ.3లక్షలు సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, ఎవరెవరు అర్హులంటే?

VNS

ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం దశలవారీగా ఇండ్లను మంజూరు చేస్తుంది. మంజూరైన ఇండ్ల కన్నా ఎక్కువమంది దరఖాస్తుదారులు ఉంటే వెయిటింగ్‌ లిస్ట్‌ను రూపొందించి అనంతరం మంజూరైన ఇండ్లలో ప్రాధాన్యం కల్పిస్తారు

Bio Ethanol Energy Plants in AP: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

ఏపీలో పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు.

CM KCR Speech in Patancheru: మళ్లీ గెలిపిస్తే పటాన్‌చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, భూముల ధరలపై చంద్రబాబుకు చురకలు

Hazarath Reddy

పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Advertisement

Southwest Monsoon: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి, ఈ జిల్లాలకు భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకు ప్రవేశించిన రుతుపవనాలు.. రాగల మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది.

CM KCR on Chandrababu: వీడియో ఇదిగో, మన శత్రువులు అంటూ చంద్రబాబుపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గతంలో ఆంధ్రలో 1 ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో 50 ఎకరాలు కొంటున్నారని తెలంగాణ ఏర్పడకూడదు అని కోరుకున్న మన శత్రువులు చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు - సీఎం కేసీఆర్

Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

Hazarath Reddy

ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

Railway Coach Factory Inauguration: కొండకల్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది.

Advertisement

Telangana: పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, శంకుస్థాపన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు.

Kollur Double Bedroom Houses Inauguration: కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, రూ.1,489.29 కోట్ల వ్యయంతో హౌసింగ్ నిర్మాణం

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Andhra Pradesh: రూ. 60 కోట్ల అక్రమాస్తులు, ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దాడులు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ (Bhimavaram Municipal Commissioner) ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జూన్‌ 21 (బుధవారం) దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను వెలికితీశారు.

Margadarsi Chit Fund Scam: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల కేసు, రామోజీరావు, శైలజా కిరణ్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు, జూలై 5న గుంటూరు సీఐడీ ఆఫీసుకు రావాలని ఆదేశాలు

Hazarath Reddy

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ఈ నాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ మరోసారి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇద్దరూ గుంటూరులోని సీఐడీ రీజనల్‌ ఆఫీస్‌కి జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Advertisement
Advertisement