రాష్ట్రీయం

Tirupati Stampede: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు.

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, నా భార్యను భూమి మీద పుట్టలేదని చూపిద్దామని అనుకున్నారా, భక్తులు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలిపే వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోపులాటకు సంబంధించిన వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి.

Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు

Hazarath Reddy

‘తెలంగాణ సంస్కృతి’పై దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు, తెలంగాణలో ప్రజలు కల్లు, మటన్‌తో అలరిస్తారు” అని వ్యాఖ్యానించారు

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Hazarath Reddy

టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు.

Advertisement

Manchu Family Dispute Case: అప్పటివరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది

Chinta Mohan on Tirupati Stampede: తొక్కిసలాట వల్ల కాదు, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తొక్కిసలాట వల్ల కాదు భక్తులు వాళ్ళంతట వాళ్లే పడిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం ఏమి లేదు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ అన్నారు.

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా

Hazarath Reddy

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satyaprasad) తెలిపారు.

Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, లుచ్చాగాళ్ల ముందు తలవంచను, కేసీఆర్ బిడ్డగా తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతానని ప్రకటన

Hazarath Reddy

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్‌ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్‌.. మాజీ మంత్రిని విచారిస్తున్నారు

Advertisement

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ , గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

Hazarath Reddy

తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం

Hazarath Reddy

భక్తులు పెద్దఎత్తున హాజరవుతారని ముందే తెలిసినా తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

Tirupati Stampede: భక్తులను పశువుల మంద మాదిరిగా తోసిపారేశారు, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే, తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన భూమన కరుణాకర్ రెడ్డి

Hazarath Reddy

పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్‌ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదని వెల్లడి, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ

Hazarath Reddy

తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో తీవ్ర అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో ఆరు మంది చనిపోగా పలువురికి గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు .

Advertisement

Formula E Race Case LIVE: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ (లైవ్)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్తున్నారు.

Tirupati Stampede Update: గేట్ సడెన్ గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వచ్చారు.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ ఏమన్నారంటే? (వీడియో)

Rudra

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు.

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి

Rudra

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

Formula E Race Case: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ!

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు.

Advertisement

Tirupati Stampede Row: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్, సీఎం చంద్రబాబు, పవన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఎవరు ఏమన్నారంటే?

Rudra

ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

Ex Minister Harishrao Under House Arrest: మాజీ మంత్రి హరీశ్‌ రావు గృహ నిర్బంధం‌.. కోకాపేటలో భారీగా మోహరించిన పోలీసులు.. ఎందుకంటే?? (వీడియో)

Rudra

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!

Rudra

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.

Tirupati Stampede Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన.. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం

Rudra

తిరుమలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకొని తొక్కిసలాట జరిగింది.

Advertisement
Advertisement