ఆంధ్ర ప్రదేశ్

Boy Climbed Up The Engine Of The Train: రైల్ ఇంజిన్ పై భాగంలోకి ఎక్కిన బాలుడు, ప్ర‌యాణికుల‌తో పాటూ పోలీసుల‌కు ముచ్చెముట‌లు పెట్టించిన వ్య‌క్తి, బాప‌ట్ల‌లో ఘ‌ట‌న‌

VNS

గూడురు (Gudur)నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు(express train ) శనివారం బాపట్ల రైల్వే స్టేషన్‌ (Bapatla Railway Station ) కు చేరుకుంది. అప్పటికే ప్లాట్‌ఫాం వద్ద ఉన్న మతిస్థిమితం లేని బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజిన్‌పైకి ఎక్కాడు. విద్యుత్‌ లైన్లు తగిలి ప్రమాదం జరుగవచ్చన భయంతో రైలు సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

Yamini Krishnamurthy: భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి ఇకలేరు, అనారోగ్యంతో ఢిల్లీలో మృతి,తిరుమల ఆస్థాన నర్తకీగా సేవలు

Arun Charagonda

ప్రముఖ నర్తకి ,పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Andhra pradesh: భార్యలను కాపురానికి పంపాలని భర్తల ధర్నా, కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష, మామపై ఫిర్యాదు

Arun Charagonda

ఏలూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాక వారిని కాపురానికి పంపించకుండా తిరిగి తమ మీదనే మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అక్రమ కేసులు పెడుతున్నాడని ధర్నాకు దిగారు అల్లుళ్లు. తమ మధ్య చిచ్చు పెడుతున్న మామపై చర్యలు తీసుకొని, తమ భార్యలను కాపురానికి పంపాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఇద్దరు అల్లుళ్లు పవన్ మరియు శేషసాయి దీక్ష చేశారు.

Nutannaidu Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేం నూతన్‌ నాయుడు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల

Arun Charagonda

ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోంది వైఎస్ షర్మిల. ఓ వైపు అధికార టీడీపీ కూటమిపై విమర్శలు మరోవైపు సొంత అన్న జగన్‌పై మాటల దాడి వెరసి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు షర్మిల. ఇక తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు.

Advertisement

Jagan Master Plan: వైఎస్‌ జగన్‌కు తొలి పరీక్ష, బొత్స ఎంపిక వెనుక మాస్టర్ ప్లాన్ అదేనా?,ఈ గెలుపుతో జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు?

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాల్లోనే విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి మినహా మిగితా వారంతా ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓటమి తర్వాత నేతలంతా కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో కేడర్‌కు భరోసా ఇచ్చే విధంగా జగన్ కామెంట్స్ చేస్తున్న వారిలో మాత్రం ధైర్యం రావడం లేదు.

Drunk And Drive: మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్.. ఆటో మీద పడి వ్యక్తి మృతి, దేహశుద్ది చేసిన స్థానికులు

Arun Charagonda

విజయవాడ - కృష్ణలంక పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఆటో డ్రైవర్ మద్యం సేవించి రాష్ డ్రైవింగ్ చేశాడు.. ములుపు దగ్గర ఆటోను కట్ కొడుతుండగా, ఆటోలోని వ్యక్తి కింద కిందపడటం, ఆ వ్యక్తిపై ఆటో పడటంతో వ్యక్తి మరణించాడు. ఆటో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానికులు ఆటో డ్రైవర్ ను దేహశుద్ది చేయగా, చనిపోయిన వ్యక్తి తన అన్నే అంటూ పారిపోవడానికి ప్రయత్నించాడు

Andhra Pradesh: నంద్యాల స్కూల్‌లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థుల అస్వస్థత, స్కూల్‌ యాజమాన్యంపై అధికారుల సీరియస్!

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల SDR స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచిన స్కూల్ యజమాన్యంపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు.

Srisailam Project: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంలో విషాదం.. వరదలో తెలంగాణ వ్యక్తి గల్లంతు (వీడియో)

Rudra

నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్‌ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Miss Universe India Contestant: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు

Rudra

ఏపీలోని కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు.

New Excise Policy In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నూత‌న మ‌ద్యం విధానం కోసం 6 రాష్ట్రాల్లో అధ్య‌య‌నం, బెస్ట్ పాల‌సీ కోసం బృందాల‌ను పంపిన ప్ర‌భుత్వం

VNS

ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు బృందాలను(Four Teams) ఏర్పాటు చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం(YCP Government) మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, జే బ్రాండ్‌ (J Brand) తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని కూటమి నేతలు ఆరోపించారు.

Road Accident Video: గుంటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై టైర్ కు పంచర్ వేయించేందుకు లారీని రోడ్డుపై ఆపారు. ఈ క్రమంలో గుంటూరు నుండి వేగంగా వస్తున్న ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై ఆరోపణలు

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ( Vallabhaneni Vamsi Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Visakha Local Bodies Election: విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, అధికారికంగా ప్రకటించిన జగన్, ఆగస్టు 30న పోలింగ్, సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేస్తూవైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి శ్రీశైలం ఆలయంలో విధులకు వచ్చిన ఉద్యోగి, పట్టుకుని చితకబాదిన భక్తులు

Hazarath Reddy

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని చితకబాదారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Andhra Pradesh Horror: అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Andhra Pradesh Shocker: నంద్యాలలో ఘోర విషాదం, అర్థరాత్రి మట్టి మిద్దె కుప్పకూలడంతో నిద్రలోనే కుటుంబం మృత్యువాత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నంద్యాలజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

YS Jagan Passport Renewal: భార్య వైఎస్ భారతితో కలిసి పాస్‌ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్

Rudra

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాస్‌ పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌ పోర్టు కార్యాలయానికి వచ్చారు.

Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

Road Accident Video: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసి బస్సు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. భాకరాపేట ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో కర్ణాటక ఆర్టీసి బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

YS Jagan Praja Darbar: వైఎస్ జగన్ ప్రజాదర్బార్ వీడియోలు ఇవిగో, ఇంకా ఏ మాత్రం తగ్గని క్రేజ్, అధినేతను కలవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
Advertisement