ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: గ్రూప్‌-1 రద్దుపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు, ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతారని స్పష్టం, సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే
Hazarath Reddyఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతున్నారని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది.
Nara Lokesh Donate to TTD: దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.38 లక్షలు విరాళం ఇచ్చిన నారా లోకేష్, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సందర్శన
Hazarath Reddyకుమారుడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు తిరుమలలో TTD నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు TDP NGS Nara Lokesh రూ.38 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలో TDP అధినేత చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్.. తన తండ్రి లోకేష్, తల్లి బ్రాహ్మణి, అమ్మమ్మ భువనేశ్వరితో కలిసి పూజలు చేశారు.
AP EAPCET 2024 Exam New Date: ఏపీలో ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ప్రకటంచిన విద్యాశాఖ అధికారులు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశం కల్పించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు.
Tirumala Update: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి
Hazarath Reddyతిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనపడుతున్నాయి. వసతి గృహాల విషయంలోనూ భక్తులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Holi Wishes In Telugu 2024: మీ బంధు మిత్రులకు Images, Wishes, Quotes, Messages, WhatsApp Greetings రూపంలో హోలీ శుభాకాంక్షలు తెలపండి..
sajayaహోలీ పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి మార్చి 25న ఈ పండుగ వస్తోంది.
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కీలక నేత మాకినీడి శేషు కుమారి
Hazarath Reddyకాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు.
Andhra Pradesh Shocker: అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ప్రియుడు చేత దారుణంగా చంపించిన కూతురు, అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ఓ కసాయి కూతురు తన ప్రియుడు చేత (Andhra Pradesh Murder) చంపించింది.
Andhra Pradesh Elections 2024: నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత
Hazarath Reddyనేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.
Andhra Pradesh Elections 2024: నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలంటూ పురుగుమందు తాగిన టీడీపీ నేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేడి మొదలైంది, వైసీపీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్ని స్థానాలను పెండింగ్ లో ఉంచింది. తాజాగా రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలని తన ఇంట్లోనే విలేకరుల సమావేశంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు
Andhra Pradesh Elections 2024: జగన్ అంటే భయం కాబట్టే ఆ ఇద్దరూ ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మీద రాపాక సెటైర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను సీఎం జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఏపీలోని ప‌లు జిల్లాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌, ఏయే జిల్లాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న ఉందంటే?
VNSశ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు (Thunder Storms) పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేసమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
Andhra Pradesh Elections 2024: నన్ను ప్రధాని మోదీ ఎంపీగా పోటీ చేయమంటే కాకినాడకు వెళతా, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఖరారు
Hazarath Reddyటీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
Skill Development Scam Case: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపిన సుప్రీంకోర్టు
Hazarath Reddyసుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్‌ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.
IAF Emergency Landing Facility: అద్దంకి నేషనల్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన IAF ఫైటర్, వీడియో ఇదిగో..
Hazarath ReddyIAF ఫైటర్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో గల అద్దంకి సమీపంలో NH-16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) ఎయిర్‌స్ట్రిప్‌లో కార్యకలాపాలు నిర్వహించాయి. An32, Dornier రవాణా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. తరువాత స్ట్రిప్ నుండి బయలుదేరింది. యాక్టివేషన్ సమయంలో Su30, హాక్ ఫైటర్‌లు ఓవర్‌షూట్‌లను విజయవంతంగా నిర్వహించాయి.
Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్ తగిలింది నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Andhra Pradesh Weather Update: ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిక
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పై అభ్యంతరకర పోస్టులు, చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఈసీ, 24 గంటల్లోగా పోస్టులు తొలగించాలని ఆదేశాలు
Hazarath Reddyటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు
Andhra Pradesh Weather Forecast: మండే ఎండల్లో ఏపీ వాసులకు ఐఎండీ చల్లని కబురు, వచ్చే నాలుగు రోజులు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం
Hazarath Reddyరానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (light to moderate rain for next four days) అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది.