ఆంధ్ర ప్రదేశ్
TDP-Janasena's First List: రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి, టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి బుద్ధ ప్రసాద్
Hazarath Reddyటీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు
TDP - Jana Sena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు..
sajayaఅమరావతి: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల.. 94 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లు.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మిగిలిన స్థానాలు తర్వాత ప్రకటించనున్న పవన్.. 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.
Medaram Jathara Ends Today: మ‌హా జాత‌ర‌లో ఇవాళ చివ‌రి అంకం, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటున్న ల‌క్ష‌లాది మంది భ‌క్తులు, నేటితో ముగియ‌నున్న మేడారం జాత‌ర‌, వ‌న ప్ర‌వేశం చేయ‌నున్న స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌
VNSసమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు. భక్తకోటిని దీవించి, ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది.
AP, Telangana Weather: తెలుగు రాష్ట్రాల‌కు చ‌ల్ల‌ని క‌బురు, రాబోయే మూడు రోజుల పాటూ ప‌లు జిల్లాలో మోస్త‌రు వ‌ర్షాలు, ఏపీలోని ఈ జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌
VNSగత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Weather Alert) పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండవేడిమితో (Summer) ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Traffic Jam Near Medaram: మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్, ఏకంగా 15 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు, నరకం చూస్తున్న భక్తులు
VNSస‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ గ‌ద్దెల‌పైకి చేర‌డంతో జాత‌ర‌కు నిండుద‌నం వ‌చ్చింది. దారుల‌న్నీ మేడారానికి అన్న‌ట్టుగా.. వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో మేడారం – తాడ్వాయి (Heavy Traffic Jam Near Medaram) మ‌ధ్య సుమారు 15 కిలోమీట‌ర్ల మేర‌, ప‌స్రా నుంచి గోవింద‌రావుపేట వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది.
Mallu Ravi Resigned: కాంగ్రెస్ కీలక నేత రాజీనామా, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పదవికి రాజీనామా చేసిన మల్లు రవి
VNSఢిల్లో(Delhi) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లు రవి(Mallu Ravi) రాజీనామా(Resigned) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు.
TDP And Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా కసరత్తు పూర్తి, ఉమ్మడి లిస్ట్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్
VNSఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన (TDP And Janasena) మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 11-40 గంటలకు ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు.
APSRTC: విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్, పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా వెళ్లవచ్చని ప్రకటన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది
Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి జగన్‌కు కానుకగా ఇస్తాం, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచి సీఎంకు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజ‌రైన‌ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
CM Jagan Ongole Visit: వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ, ఒంగోలు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మండిపడిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో 21 వేల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో పాటుగా ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ‍ప్రారంభించారు. రూ.231 కోట్ల విలువ చేసే భూమిని అక్కచెల్లెమ్మలకు (registered deeds of house-sites to women) ఇచ్చారు
Jaahnavi Kandula's Death Case: జాహ్నవి కందుల మృతి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు, ఆ పోలీస్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని వెల్లడి, భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన కేటీఆర్
Hazarath Reddyభారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.
Congress Chalo Secretariat Protest: షర్మిల అరెస్ట్, వెంటనే విడుదల, ఒక్కహామీని నెరవేర్చని జగన్ వైఎస్‌ఆర్‌ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని మండిపాటు
Hazarath Reddyమెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Party Symbols on Condoms Packets: వీడియోలు ఇవిగో, కండోమ్ ప్యాకెట్ల మీద సైకిల్, ఫ్యాన్ గుర్తులు, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న రెండు పార్టీలు
Hazarath Reddyఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కండోమ్‌ ప్యాకెట్ల మీద రాజకీయ పార్టీల గుర్తులు ఉన్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుతో ఉన్న కండోమ్ ప్యాకెట్ గురించి టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. టీడీపీ సింబల్ ఉన్న కండోమ్ ప్యాకెట్‌ గురించి వైఎస్సార్సీపీ ఓ వీడియోను బయటపెట్టింది
Congress Chalo Secretariat Protest: 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారంటూ షర్మిల నిరసన
Hazarath Reddyమెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల బైఠాయించి నిరసన తెలిపారు.
TTD Darshan Tickets For May: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తేదీలు విడుదల, ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే..
Hazarath Reddyతిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది.వీటితో పాటుగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా విడుదల చేసింది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
YS Sharmila: అరెస్టు భ‌యంతో రాత్రంతా పార్టీ ఆఫీస్ లోనే నిద్ర‌చేసిన వైయ‌స్ ష‌ర్మిల‌, ఛ‌లో సెక్ర‌టేరియేట్ పిలుపుతో ఏపీలో ఉద్రిక్త ప‌రిస్థితులు
VNSరాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోనే షర్మిల (YS sharmila) నిద్రించారు. గురువారం ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు
Andhra Pradesh Road Accident: నల్లమల ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆత్మకూరు - దోర్నాల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Vemireddy Prabhakar Reddy Resigns YSRCP: వైసీపీతో పాటు ఎంపీ పదవికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటన
Hazarath Reddyనెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా (Vemireddy Prabhakar Reddy Resigns YSRCP) చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
CM Jagan Visit Vishakha: రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్‌, శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyశారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్‌ పూజలు చేశారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
AP, Telangana Rajyasabha MP Election: ఏపీ, తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం...రాజ్యసభ నుంచి టీడీపీ డకౌట్..
sajayaతెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రిటర్నింగ్ అధికారుల ప్రకటన అనంతరం మూడు సీట్లకు 3 నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బీఆర్ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.