ఆంధ్ర ప్రదేశ్

Rajini Fans vs Jagan Fans: క్షమాపణ చెప్పేది లేదంటున్న వైసీపీ క్యాడర్, చెప్పాల్సిందేనంటున్న రజనీ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో YSRCPApologizeRAJINI

Hazarath Reddy

రజనీకాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది.

YSRCP MLA Kanna Babu: హామీ నెరవేర్చమని అడిగినందుకు యువకుడిపై చేయి చేసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

kanha

యలమంచిలి అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ , పూడిమడక జెట్టీ నిర్మాణహామీని డిమాండ్ చేయగా ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు.

Rains In AP: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు... ఐఎండీ అలర్ట్.. ఎక్కడెక్కడ వర్షాలు పడనున్నాయి అంటే? వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో బెంబేలెత్తుతున్న రైతాంగం

Rudra

ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలో మే 1వ తేదీన పల్నాడు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Rains In Hyderabad: భారీ వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. రోడ్లపైకి చేరిన నీరు... భారీగా నిలిచిన ట్రాఫిక్.. ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ

Rudra

హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి.

Advertisement

Yadadri Laxminarasimha Swamy Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత

Rudra

యాదాద్రిలో (Yadadri) ఎల్లుండి (మంగళవారం) నుంచి శ్రీ నరసింహస్వామి (Yadadri Laxminarasimha Swamy Temple) జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Pawan With Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. గంటన్నరపాటు మంతనాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

Rudra

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో నిన్న ఇరువురు నేతల సమావేశం గంటన్నర పాటు జరిగింది.

Telangana New Secretariat Inauguration: తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన చండీయాగం.. మధ్యాహ్నం 1.20 గంటలకు సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. లైవ్ వీడియో

Rudra

తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా నిలిచిన నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు.

IAS Transfers In AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, ఐదుగురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగింత

VNS

ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను((IAS Tranfers) బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఆయనకు ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది.

Advertisement

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చిన సీబీఐ, మే 10వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు

kanha

హైదరాబాద్‌: వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చిన సీబీఐ.. మే 10వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగింపు.. చంచల్‌గూడ జైలుకు భాస్కర్‌రెడ్డి తరలింపు

Samantha Temple: సమంతకు గుడి కట్టించి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన వీరాభిమాని

kanha

నటి సమంత వీరాభిమాని ఒకరైన తెనాలి సందీప్ ఆమె గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే శాకుంతలం చిత్రంలో నటించిన సమంత నటన చూసి సందీప్‌ ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి మరో అడుగు ముందుకేశాడు.

Kodali Nani On Rajinikanth: మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్ పై కొడాలి నాని ఫైర్

kanha

మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్ పై కొడాలి నాని ఫైర్ వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్, సిగ్గు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడు.

JEE Main 2023 Result: జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌.. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి..

Rudra

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి.

Advertisement

Rains In Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఈ తెల్లవారుజామున భారీ వర్షం.. జలమయమైన రోడ్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. మరో రెండు గంటలపాటు కుండపోత.. ఏపీ, తెలంగాణకు రెండురోజులపాటు వర్ష సూచన

Rudra

తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా ఏర్పడింది.

Rajinikanth Speech: కంటిచూపుతో బాలకృష్ణ ఏదైనా చేయగలడు! ఎన్డీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్‌, హైదరాబాద్‌ వెళ్తే న్యూయార్క్‌లో ఉన్నట్లుంది! చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రజినీ

VNS

ఎన్డీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. నందమూరి తారకరామారావు యుగపురుషుడు అన్న రజినీకాంత్...తన చిన్న వయస్సు నుండే, ఎన్టీఆర్ (NTR) ప్రభావం ఉండేదన్నారు. తాను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి అని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ కి వారసుడిగా బాలకృష్ణ తనదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు.

AP Inter Academic Calendar 2023-24: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

Hazarath Reddy

ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

Vizag Steel Plant Privatisation: రూ.8 వేల కోట్లు అయినా, రూ.42 వేల కోట్లైనా నేను కొంటా, విశాఖ ఉక్కుపై హైకోర్టులో కేఏ పాల్‌ పిల్‌, తెలుగు తెలిసిన విశ్రాంత న్యాయమూర్తి నియమించాలని సూచన

Hazarath Reddy

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ (Praja Shanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్‌ ఏపీ హైకోర్టులో పిల్‌ (ka paul pil) దాఖలు చేశారు.

Advertisement

Students Suicides In AP: ఏపీ ఇంటర్ పరీక్షల్లో తప్పిన 9 మంది విద్యార్థుల బలవన్మరణం.. మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో కొందరు.. ఫెయిల్ అయ్యామన్న బాధతో మరికొందరు ఆత్మహత్య

Rudra

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో మరికొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు.

Rains In Telangana: రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఉత్తరాది జిల్లాల్లో తేలికపాటి వానలు.. తూర్పున ఉన్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్లకు అవకాశం.. నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Rudra

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పడనున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Inter Supplementary Exam 2023: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

Hazarath Reddy

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీని ఏపీ విద్యాశాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి

Ambati Rambabu on Chandrababu: కోడెల ఉరివేసుకోవడానికి కారణం చంద్రబాబే, సత్తెనపల్లి సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందని కామెంట్స్ చేసిన అంబటి రాంబాబు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందని కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు ఒక ముసలి సైకో. అధికారం లేకుండా ఉండలేని సైకో చంద్రబాబు

Advertisement
Advertisement