ఆంధ్ర ప్రదేశ్
Polavaram Project: పోలవరం పనుల్లో మరో మైలు రాయి, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేసిన జగన్ సర్కారు, 1,655 మీటర్ల పొడవు, 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌
Hazarath Reddyఏపీ జీవనాడి , బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం (Polavaram Project) పనుల్లో బుధవారం మరో కీలక ఘట్టం పూర్తయింది. 1,655 మీటర్ల పొడవు, 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ (Lower Coffer Dam ) పనులను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.
Chandrababu's Convoy Meets with Accident: చంద్రబాబుకు తప్పిన ఘోర ప్రమాదం, టీడీపీ అధినేత కారును ఢీకొట్టిన మరో కారు, వంగిపోయిన వాహనం బంపర్
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బూరుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బంపర్ వంగిపోయింది. చంద్రబాబుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Ex-Telangana CS Somesh Kumar: మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ, దరఖాస్తును జగన్ ఆమోదించినట్టుగా వార్తలు, కారణం ఇదేనా..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (Ex-Telangana CS Somesh Kumar)‌ స్వచ్ఛంద పదవీవిరమణ (Somesh Kumar Taken voluntary retirement) చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
EAPCET 2023 Update: ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ, 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించిన అధికారులు
Hazarath Reddyఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. దీనికి కారణం ఏంటంటే.. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు.
MP Bharat Saves Young Man Life: గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, కారులోంచి బయటకు దూకి యువకుడిని రక్షించిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్
Hazarath Reddyగోదావరి నదిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది.
Kuthuhalamma Dies: మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత, సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Hazarath Reddyఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1980-83లో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆమె పనిచేశారు. 1985-89లో వేపంజేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.
Three Capitals Row: మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కారు, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని తెలిపిన సజ్జల, మూడు రాజధానులు అవసరం అని తేల్చిన మంత్రి అంబటి
Hazarath Reddyమూడు రాజధానుల నిర్ణయానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Govt) కట్టుబడి ఉందని మంత్రి అంబటి రాంబాబు మరోమారు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష‍్యమని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు.
Kadapa Steel Plant Bhumi Puja: దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ, కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ,ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyజేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమక్షంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ (Kadapa Steel Plant Bhumi Puja) చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు.
Andhra Pradesh: ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం జగన్, 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
Hazarath Reddyవైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి CM ysjagan భూమిపూజ నిర్వహించారు. JSPLCorporate ఛైర్మన్‌ sajjanjinda తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను జగన్‌ పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు జిందాల్‌ వివరించారు.
Andhra Pradesh Global Investors Summit 2023: ఏపీలో త్వరలో దాదాపు 90,000 మందికి ఉద్యోగావకాశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఐటీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి
Hazarath Reddyబెంగళూరులో మంగళవారం జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన గొప్ప సహజ వనరులు, మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులు, ల్యాండ్ బ్యాంక్, నియమాలు, నిబంధనలలో పలు సంస్కరణలను ప్రదర్శించింది.
Godavari Express Derails: గోదావరి ఎక్స్‌ప్రెస్‌‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం, బీబీనగర్‌ వద్ద పట్టాలు తప్పిన రైలు, ప్రయాణికులంతా సురక్షితమని తెలిపిన రైల్వే అధికారులు
Hazarath Reddyబీబీనగర్‌-ఘట్ కేసర్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమయంలో మరో ట్రాక్‌పై నుంచి గూడ్స్‌ రైలు వెళ్లింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితమని రైల్వే అధికారులు వెల్లడించారు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు, రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ప్రారంభించిన సీఎం జగన్, పర్యాటక అభివృద్దే లక్ష్యంగా కీలక నిర్ణయం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Govt)మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను (26 police stations) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మంగళవారం ప్రారంభించారు.
Mahashivratri: శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలను అత్యాధునికంగా తీర్చి దిద్దుతాం, జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్
Hazarath Reddyమహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని శైవ క్షేత్రాలను తీర్చిదిద్దుతామని, భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ అన్నారు.
CM Jagan: ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించిన ఆస్ట్రేలియా లేబర్ పార్టీ ఎంపీల బృందం.. సీఎం జగన్ తో భేటీ
Rudraఆస్ట్రేలియా లేబర్ పార్టీకి చెందిన ఎంపీల బృందం నిన్న సీఎం జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. విద్య, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రశంసించింది.
Valentine’s Day Wishes: ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..
Rudraవాలెంటైన్స్ డే లేదా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14వ తేదీన మీరు మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రపోజ్ చేయవచ్చు. వివాహిత జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా జరుపుకోవచ్చు! మీ భావాలను వ్యక్తీకరించడానికి WhatsApp, Instagram, Facebook లేదా SMS ద్వారా మీరు మీ ప్రియమైన వారికి పంపగల కొన్నిహృదయాన్ని హత్తుకునే సందేశాలను మేము మీ కోసం తీసుకువచ్చాము.
Jagananne Maa Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్తు, వైసీపీ పార్టీ కొత్త నినాదం ఇదే, ప్రతీ గడపకూ వెళ్లి వివరించాలని ఎమ్మెల్యేలకు జగన్ ఆదేశాలు
Hazarath Reddyముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏపీ అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం (CM Jagan Review Meeting) ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ సమీక్ష సమావేశం జరిగింది.
AP New Governor: ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
Rudraకొత్త గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు.
Trains Cancellation: రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ల రద్దు.. ఏ సర్వీసు రద్దు అయిందో జాబితా ఇదిగో..
Rudraమరమ్మతు పనుల కారణంగా నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్.. వీడియోతో
Rudraతెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది.