ఆంధ్ర ప్రదేశ్
Taraka Ratna Death: తారకరత్న మృతిపై సంచలన కామెంట్లు చేసిన లక్ష్మీ పార్వతి, ఇదంతా చంద్రబాబు వల్లనే అంటూ ఆరోపరణలు
VNSచంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించారని ఆమె ఆరోపించారు. నారా లోకేష్‌ పాదయాత్రకు, లోకేష్‌కు (Lokesh) చెడ్డపేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణవార్త ప్రకటించి ఉండాల్సిందన్న లక్ష్మీపార్వతి.. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారని ఆరోపించారు.
Earth Tremors At Pulichinthala: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో వణికిపోయిన ప్రజలు
Rudraఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
YS Sharmila Arrest: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు.. అరెస్ట్ ఎందుకంటే? (వీడియోతో)
Rudraవైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
Rains In Coastal Andhra: ఉపరితల ఆవర్తనంతో ఉత్తర కోస్తాలో వర్షం.. వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు
Rudraవచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Taraka Ratna No More: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో
Rudraతెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకున్నది.
Taraka Ratna Latest Health Update: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, ఆస్పత్రిలోనే బాలకృష్ణ, ఆందోళనలో అభిమానులు ఎయిర్ అంబులెన్స్‌ లో హైదరాబాద్ కు తరలించే అవకాశం
VNSనంద‌మూరి తార‌క‌ర‌త్న (Taraka Ratna) మృత్యువుతో పోరాడుతున్నారు. గ‌త 23 రోజుల నుంచి బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య‌లో చికిత్స పొందుతున్నారు. తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మించడంతో.. శ‌నివారం సాయంత్రం హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ (Balakrishna), ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
CBI Notice To Avinash Reddy: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి చుట్టు బిగుస్తున్న ఉచ్చు, రెండోసారి సీబీఐ నోటీసులు, ఈ నెల 24న విచారణకు హాజరుకావాలంటూ పిలుపు
VNSమాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి శనివారం సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్‌ ద్వారా అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపారు.
Maha Sivaratri Special Buses: మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు.. శైవ క్షేత్రాలకు 3,800 బస్సులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ
Rudraమహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసీ నేడు స్పెషల్ బస్సులు నడపనుంది. వివిధ శైవ క్షేత్రాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ 3,800 ప్రత్యేక బస్సులు నడపనుంది.
Happy Maha Shivaratri Wishes Telugu: నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి..
Rudraనేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి.. మీకు కూడా లేటెస్ట్ లీ తరుఫున పండుగ శుభాకాంక్షలు.
Hyderabad Horror: పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌ పై అత్యాచారం.. గుంటూరు యువకుడి ఘాతుకం.. హైదరాబాద్ లో కేసు
Rudraపెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్టు అతనికి దగ్గరైంది. తీరా ఆమెనూ గర్భవతిని చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్నాడు ఓ దుండగుడు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువకుడిపై హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. హరహర నామస్మరణతో ఆలయాల్లో పెరిగిన రద్దీ.. భక్తుల రద్దీతో శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి, వేములవాడ, కీసర, హన్మకొండ వేయిస్తంభాల ఆలయాలు కిటకిట.. వీడియోతో..
Rudraతెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరహర అంటూ ఆలయాలన్నీ శివనామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి.
Tension Prevailed at CBN Tour: ఇకపై పోలీసుల సంగతేంటో చూస్తా! అనపర్తి నుంచి ఖాకీలకు సహాయ నిరాకరణ ప్రకటించిన చంద్రబాబు, అనపర్తి పర్యటనలో ఉద్రిక్తత, సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే ప్రసంగం..
VNSటీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తూర్పుగోదావరి జిల్లా చివరి రోజు పర్యటనలో పోలీసుల ఆంక్షలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అనపర్తి దేవిచౌక్‌లో బహిరంగ సభకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు.. తీరా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతిలేదన్నారు (Anaparthi ). చంద్రబాబును అనపర్తి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
Andhra Pradesh: టిడ్కో ఇళ్లమీద రూ.20,745 కోట్లు ఖర్చు పెట్టాం, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని తెలిపిన ఏపీ సీఎం జగన్, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష
Hazarath Reddyఏపీలో గృహ నిర్మాణ శాఖపై (housing department) తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan in Action) శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లపై ఆయన సమీక్షించారు.టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని సీఎం జగన్‌ తెలిపారు.
New Committee on Rushikonda Excavation: రిషికొండ తవ్వకాలపై సర్వే నిమిత్తం కొత్త కమిటీ, కేంద్ర ప్రభుత్వ అధికారులకు మాత్రమే స్థానం కల్పిస్తూ ఎంవోఈఎఫ్‌ కీలక నిర్ణయం
Hazarath Reddyవిశాఖపట్నంలోని రిషికొండ తవ్వకాలపై సర్వే నిమిత్తం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (MOEF) కొత్త కమిటీని (New Committee on Rushikonda Excavation) నియమించింది. గతంలో ఉన్న కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసారి కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారులకు మాత్రమే స్థానం కల్పిస్తూ MOEF కమిటీని ఏర్పాటు చేసింది.
Chaganti Meets CM jagan: సీఎం జగన్‌ను కలిసిన చాగంటి కోటేశ్వరరావు, శాంతా బయోటెక్నిక్స్‌ ఎండీ డాక్టర్‌ కేఐ వరప్రసాద్‌ రెడ్డి, శాలువాతో సత్కరించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లికి వెళ్లిన చాగంటి, సీఎం జగన్‌తో భేటీ అయ్యి.. అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ఇటీవలె నియమించిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Medical Apathy: స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం, సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyవిశాఖలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో (Andhra Pradesh Medical Apathy) చిన్నారి మృతదేహంతో ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులు 120కి.మీ. ప్రయాణించారు.
Former TDP MLA Joins YSRCP: జయమంగళ వెంకటరమణకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏలూరు జిల్లా కైకలూరు మాజీ MLA జయమంగళ వెంకటరమణ లాంఛనంగా వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు. జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు. మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించారు.
Minister Roja vs Nara Lokesh: లోకేష్ జబర్దస్త్ ఆంటీ వ్యాఖ్యలపై రోజా కౌంటర్, అంకుల్ జోకులకు అంకులే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా
Hazarath Reddyఇటీవల నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి నారా లోకేశ్, మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం (Roja vs Nara Lokesh) కొనసాగుతూనే ఉంది.మంత్రి రోజాను లోకేశ్ డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ ఎద్దేవా చేయగా, రోజా (Minister RK Roja) కూడా అందుకు ధీటుగానే అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు
Kodali Nani Dirves RTC Bus Video: కొడాలి నాని ఆర్టీసీ బస్సును నడుపుతున్న వీడియో ఇదే, స్టీరింగ్‌ పట్టి సుమారు 10 కిలోమీటర్ల దూరం బస్సును ట్రాఫిక్‌లో సునాయాసంగా నడిపిన గుడివాడ ఎమ్మెల్యే
Hazarath Reddyమాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో అయిదు అద్దె బస్సులను ప్రారంభించారు. ఈ నూతన పల్లె వెలుగు బస్సు సర్వీసులు గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. అనంతరం గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో మాజీ మంత్రి కొడాలి నాని పల్లె వెలుగు బస్సును స్వయంగా నడిపారు.
Kanna Lakshmi Narayana Quits BJP: ఏపీలో బీజేపీకి బిగ్ షాక్, రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు
Hazarath Reddyఏపీలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది.బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana resign to bjp) రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda)కు కన్నా రాజీనామా లేఖను పంపారు. అనుచరులతో కలిసి బీజేపీ (BJP)కి కన్నా మూకుమ్మడిగా రాజీనామా చేశారు.