ఆంధ్ర ప్రదేశ్

Shaakuntalam: 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం

Rudra

సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.

Palnadu Horror: ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. అనుమానంతో డాబాపై నుంచి కిందికి తోసేసిన తండ్రి.. ఏపీలో ఘటన

Rudra

కుమార్తె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానించిన ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. ఆమెను డాబా పైనుంచి కిందికి తోసేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఏపీలోని పల్నాడు జిల్లా యడ్లపాడులో జరిగిందీ ఘటన.

TTD SED Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..

Rudra

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనుంది.

Bharat Reply To CM Jagan Tweet: మీ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టం సర్, సీఎం జగన్‌ ట్వీట్‌కు కేఎస్‌ భరత్‌ రిప్లై, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తానని వెల్లడి

Hazarath Reddy

బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్‌కి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు. సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌కు కేఎస్‌ భరత్‌ రిప్లై ఇచ్చాడు."

Advertisement

AP Capital Row: ఏపీ రాజధాని రగడ, శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలి, సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు, ఇంతకీ శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏం చెప్పింది ?

Hazarath Reddy

ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక (Sivaramakrishnan Committee Report) అమలు చేయాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది.ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయని తెలిపిస సీఎం జగన్

Hazarath Reddy

వైఎస్సార్‌ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ పథకాల నిధులను సీఎం జగన విడుదల చేశారు.అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

RDE Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి??

Rudra

రియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేని కార్లు ఏప్రిల్ 1 తర్వాత రోడ్ల మీద కనిపించకపోవచ్చు. దీనికి కారణం వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే.

Smart Phone Warning: చీకట్లో స్మార్ట్ ఫోన్ ను తదేకంగా అలాగే చూస్తున్నారా? అయితే, జాగ్రత్త.. మీరూ ఈ హైదరాబాద్ మహిళలాగే కంటి చూపు పోగొట్టుకొనే వరకూ వెళ్లొచ్చు!!

Rudra

స్మార్ట్ ఫోన్ అధిక వాడకంతో మానసిక సమస్యలతో పాటు కంటి చూపుపై ప్రభావం పడుతున్నట్టు ఇప్పటికే ఎన్నో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా చీకట్లో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ను చూసి ఓ హైదరాబాదీ మహిళ తన కంటిచూపు పోగొట్టుకొనేవరకూ వెళ్ళింది.

Advertisement

Nara Lokesh's Padayatra: లోకేష్ పాదయాత్రలో పోలీసులు,టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, మీ సొంత రాజ్యాంగంతో మాకు పనిలేదని నారా లోకేష్ విమర్శలు

Hazarath Reddy

యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి 14వ రోజు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు.

Andhra Pradesh: ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష, రెవిన్యూ వనరుల గురించి ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో కోవిడ్‌ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు

MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు, మార్చి 16న ఫలితాలు, షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది

Atchannaidu Audio Clip Video: లోకేష్‌ పాదయాత్రకు జనం లేరంటూ టీడీపీ నేతల మాట్లాడుకుంటున్న ఆడియో ఇదే, అచ్చెన్నాయుడితో బీమినేని చిట్టిబాబు ఫోన్‌లో సంభాషణ క్లిప్ వైరల్

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకమంటూ ప్రచారం చేసిన లోకేష్‌ పాదయాత్ర జనం లేరంటూ టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ అయింది. జిల్లానేతలతో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన సంభాషణ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

CM Jagan Wishes to KS Bharat: భారత్ క్రికెట్ జట్టులోకి వైజాగ్ కుర్రాడు భరత్, తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందనలు తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

భారత క్రికెట్‌ జట్టులోకి వైజాగ్ కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భరత్‌ ఫొటో షేర్‌ చేస్తూ అభినందనలు తెలియజేశారు.

Andhra Pradesh Tragedy: కాకినాడలో ఘోర ప్రమాదం, ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతి, ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులు

Hazarath Reddy

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలోని ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

Mekapati Chandrasekhar Reddy Health Update: నిలకడగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం, నేను బాగానే ఉన్నాను, మీరెవరు భయపడవద్దని తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు.డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు.రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Andhra Pradesh: జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ, అధ్యక్షత వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయింది. సబ్ కమిటీలోని సభ్యులుగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి జగన్న భూరక్ష-భూహక్కు పథకం ప్రగతిపై సమీక్షించారు.

Advertisement

AP Cabinet Key Decisions: ఉగాదికి ఏపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇవే, పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, 70 అజెండా అంశాలపై క్యాబినెట్‌‌లో చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.

AP Capital Row: ఏపీ రాజధానిపై కొత్త ట్విస్ట్, అమరావతిని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని తెలిపిన కేంద్రం, రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ఎక్కువ మాట్లాడలేమని వెల్లడి

Hazarath Reddy

విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా (AP Capital Row) అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

Kotamreddy Phone Tapping Row: అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై స్పష్టతనిచ్చిన స్నేహితుడు రామశివారెడ్డి, నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి

Hazarath Reddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వార్తలపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మీడియాకు స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ..నాది ఆండ్రాయిడ్‌ ఫోన్‌. నా ఫోన్‌ లో ప్రతీకాల్‌ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్‌ రికార్డయింది’’ అని చెప్పారు.

Visakhapatnam: విశాఖలో క్లాస్ రూంలో పైనుంచి ఊడిపడిన సీలింగ్ ప్లాస్టర్, ముగ్గురు విద్యార్థులకు గాయాలు, విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు

Hazarath Reddy

విశాఖపట్నం | పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోని సీలింగ్ ప్లాస్టర్ విద్యార్థులపై పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement