ఆంధ్ర ప్రదేశ్

Mekapati Chandrasekhar Reddy: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు, గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు గుర్తించిన వైద్యులు, చెన్నై లేదంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు

Hazarath Reddy

ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(71) అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆయనకు అక్కడే చికిత్స అందుతున్నట్లు సమాచారం. అయితే.. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నై లేదంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి

Geotagging for Civil Supply Vehicles: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌, ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం

Hazarath Reddy

ఇక నుంచి ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్‌ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్‌ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్‌ ద్వారా వాహనాన్ని ట్రాక్‌ చేస్తామన్నారు.

Fact Check: ఆ డ్రైవర్ ఉద్యోగం తొలగించలేదు, క్లారిటీ ఇచ్చిన APSRTC, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఆయనతో షేక్ హ్యాండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ జాబ్ తీసేసారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.అయితే ఏపీఎస్‌ఆర్టీసీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించామనడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు

G20 Summit 2023: వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన జీ20 విదేశీ ప్రతినిధులు, లేపాక్షి ఆలయ శిల్ప కళ చూసి మంత్ర ముగ్ధులైన ప్రతినిధులు

Hazarath Reddy

శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రాచీన చరిత్ర కల్గిన వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయానికి వచ్చి ... దేవాలయంలోని శిల్ప కళను చూసి మంత్ర ముగ్ధులయ్యారు.

Advertisement

Kolusu Parthasarathy: విద్య కోసం రూ.30 వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే, చంద్రబాబుది విభజించు పాలన..సీఎం జగన్ ది ప్రజా పాలన, మాజీ విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యలు

Hazarath Reddy

సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Andhra Pradesh: పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే, స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు అధ్యక్షతన సీఎం జగన్ సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.

Andhra Pradesh: అటవీ శాఖ అధికారిని చంపేసిన నాలుగు ఏనుగులు, గ్రామాల్లోకి రాకుండా వాటిని అడ్డుకునే క్రమంలో అధికారిపై దాడి చేసిన ఏనుగులు

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్| మన్యం జిల్లాలోని పసుకుడి గ్రామ సమీపంలోని గ్రామాల్లోకి రాకుండా నాలుగు ఏనుగుల గుంపు అడ్డుకునే క్రమంలో అటవీ శాఖకు చెందిన లక్షీనారాయణ అనే ట్రాకర్‌ను నాలుగు ఏనుగుల గుంపు తొక్కించి చంపేసింది. అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

TTD: ఈ నెల 8న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుదల, 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం, పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.

Advertisement

Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు

Rudra

వైసీపీ (YCP) నేత బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ పార్టీ కార్యాలయాన్ని(Borugadda Anil Party Office) గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు. గుంటూరులో అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌ కార్యాలయంపై పెట్రోల్‌ చల్లి నిప్పుపెట్టారు.

House Searching For AP CM: సీఎం జగన్ కోసం విశాఖ బీచ్ రోడ్డులో ఇంటి కోసం అధికారుల అన్వేషణ.. మంత్రుల కోసం కూడా..

Rudra

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు విశాఖపట్టణం బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నారు.

JEE Main-1 Results: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి

Rudra

దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

Adani Row: తెలుగు రాష్ట్రాల్లో అదాని ప్రకంపనలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నిరసనకు దిగన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నాకు దిగారు.ఆదానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారంటూ డిమాండ్ చేస్తూ వారు SBI ముందు నిరసనలు చేపట్టారు.

Advertisement

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరనున్న డీఏ!

Rudra

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం పెంచి 42 శాతం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Kotamreddy Gunmen Removed: ఎమ్మెల్యేను వదిలివెళ్లలేక వెక్కి వెక్కి ఏడ్చిన గన్‌మెన్లు, మిగిలిన ఇద్దరిని కూడా వెనక్కు పంపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

VNS

మిగిలిన గన్ మెన్లు కూడా తనకు వద్దన్నారు. ప్రభుత్వానికి తాను రిటర్న్ ఇస్తానని చెప్పారు. గన్ మెన్లను తొలగించినంత (Scaling down security cover) మాత్రాన భయపడేదిలేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే.

Viral Video: వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో? ఈ వీడియో చూశాక చెప్పండి: ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్

Rudra

ఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు.

Vande Bharat Express: ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి... మూడు గంటల ఆలస్యం.. వీడియోతో

Rudra

ఇటీవల సికింద్రాబాద్-విశాఖ నగరాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఈసారి ఖమ్మం జిల్లాలో దీనిపై దాడి జరిగింది.

Advertisement

Whatsapp Exam: వాట్సాప్‌లో డిగ్రీ ఇంటర్నల్ ప్రశ్నపత్రం.. ఫోన్‌లో చూస్తూ పరీక్ష రాసిన విద్యార్థులు.. ఎక్కడంటే??

Rudra

ప్రింటర్ పాడవడంతో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో విద్యార్థులకు పంపించి పరీక్ష రాయించింది ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల.

Kotamreddy Sridhar Reddy: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న ఆడియో! మీరూ వినండి..

Rudra

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

KA Paul: నేను, దేవుడు వద్దనుకున్నాం.. అందుకే సచివాలయం కాలిపోయింది: కేఏ పాల్ (వీడియోతో )

Rudra

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని... అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు.

AP High Court Fires: హబ్బా! రోజూ మీ ముఖాల్ని చూడాలంటే చికాకు పుడుతోంది.. ప్రభుత్వ కార్యదర్శులపై ఏపీ హైకోర్టు అసహనం.. వీడియోతో

Rudra

పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో పదేపదే న్యాయస్థానానికి వస్తున్న మిమ్మల్ని చూడాలంటేనే చికాగ్గా ఉందని వ్యాఖ్యానించింది.

Advertisement
Advertisement