ఆంధ్ర ప్రదేశ్
Cyclone Mandous: దటీజ్ భూమన కరుణాకర్ రెడ్డి, భారీ వరదల్లో, మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యాహ్నం తిరుపతిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ఆయన వెంట తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి పర్యటించారు.
Cyclone Mandous: మహాబలిపురం సమీపంలో తీరం దాటిన ‘మాండూస్‌’.. నేటి మధ్యాహ్నానికి మరింత బలహీనపడనున్న తుపాను.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. తుపాను ప్రభావంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష .. ఇప్పటివరకూ ఐదుగురి మృతి
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మాండూస్‌ లేదా మాండౌస్’ గత అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. నిన్న ఉదయమే బలహీనపడిన తుపాను నేటి ఉదయం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.
Special Buses For Sankranti: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి పండుగ ప్రయాణికుల కోసం 4,233 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి
Rudraసంక్రాంతి పండుగకు వెళ్ళే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఫోటో వైరల్, రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ప్రాక్టీస్‌లోకి వచ్చానంటూ ట్వీట్
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దానికి రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చానంటూ ట్యాగ్ లైన్ జోడించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Andhra Pradesh: గుడివాడలో ఒకే వేదిక మీద కొడాలి నాని, వంగవీటి రాధా, వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఇరువురు
Hazarath Reddyగుడివాడలో మాజీ మంత్రి, కొడాలి నాని , టిడిపి నాయకుడు వంగవీటి రాధా ఆత్మీయ కలయిక జరిగింది. కె. కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో ఇరువురు పాల్గొన్నారు.
Perni Nani: నీ వారాహి బస్సుకు పసుపు రంగు వేసుకో, పవన్ లక్ష పుస్తకాలు కాకుండా ఆ పుస్తకం చదివుంటే రూల్స్ తెలిసేవంటూ పేర్ని నాని సెటైర్
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రచార వాహనం ‘వారాహి’కి తెలుపు, నలుపు, మరో ఇతర రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వ్యంగ్యోక్తులు విసిరారు.
G-20 Summit in Vizag: విశాఖలో 3 రోజుల పాటు జీ–20 సమ్మిట్, ఫిబ్రవరి 3,4 తేదీల్లో, ఏప్రిల్‌ 24న వివిధ అంశాలపై సదస్సులు, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ–20 సదస్సుకు విశాఖపట్నం (Visakhapatnam ) వేదిక కానుంది. జీ–20 అధ్యక్ష దేశంగా భారత్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది నవంబర్‌ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
Vande Bharat Express: ఏపీకీ గుడ్ న్యూస్, రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కేటాయించిన కేంద్రం, సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు రెండో రైలు
Hazarath Reddyరైల్వే శాఖ ఏపీ రాష్ట్రానికి రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి వర్తమానం అందింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్‌ ఎక్స్‌­ప్రెస్‌ను 2023 జనవరిలో సికింద్రాబాద్‌–­విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించారు.
Cyclone Mandous: రాత్రికి తీరం దాటనున్న తుపాను, స్కూళ్లు, పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, మూడు రోజలు పాటు భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.
Cyclone Mandous: తీవ్ర తుఫానుగా మారిన మాండూస్.. నేడే తీరం దాటే అవకాశం.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల అలర్ట్
Rudraఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిన మాండూస్.. ప్రస్తుతానికి చెన్నైకి 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ) తెలిపింది. శుక్రవారం తీరం దాటొచ్చని, ఈ సమయంలో బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Jagadish Reddy Response To Sajjala: తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన అన్న తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి.. సజ్జల వ్యాఖ్యలపై స్పందన.. చరిత్రను వెనక్కి తిప్పలేరని స్పష్టీకరణ
Rudraఎనిమిదేండ్ల క్రితం విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి కలిస్తే మొదట స్వాగతించేది వైసీపీయేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
Andhra Pradesh: తీవ్ర విషాదం, రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థిని మృతి, యూరిన్‌ బ్లాడర్‌ దెబ్బతిని తీవ్ర రక్తస్రావం, కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలం
Hazarath Reddyవిశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో (duvvada railway station) నిన్న రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ(20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. యూరిన్‌ బ్లాడర్‌ దెబ్బతిని తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
Cyclone Mandous: శ్రీహరికోట వైపు దూసుకొస్తున్న మాండూస్ తుఫాన్, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్, నేడు అర్థరాత్రి కోస్తాంధ్ర, తమిళనాడుపై విరుచుకుపడే అవకాశం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న మాండూస్ తుపాను (Cyclone Mandous) పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభావిత జిల్లా కలెక్టర్లను (CM YS Jagan Directs Collectors) ఆదేశించారు. గురువారం తుపానుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు.
Pawan Kalyan's Bus Trip: పవన్ కళ్యాణ్ వారాహి రథం రెడీ, బస్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన జనసేన అధినేత
Hazarath Reddy2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్సు సిద్ధమైంది. బస్‌కు సంబంధించిన వీడియోను పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.
Andhra Pradesh Road Mishap: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, పెళ్లి వేడుకకు వెళుతూ అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా, పెళ్లి బృందంలో ఆరు మంది మృతి, మరో 22 మందికి గాయాలు
Hazarath Reddyఏపీలోని చిత్తూరు జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పూతలపట్టు మండలం పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా.. మరో 22 మందికి (Six killed, 22 hurt) తీవ్రగాయాలయ్యాయి.
Cyclone Mandous: దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు, రేపు మహాబలిపురంలో తీరం దాటనున్న మాండూస్ తుపాను, ప్రస్తుతం తమిళనాడుకు వైపుకు దూసుకు వస్తున్న సైక్లోన్
Hazarath Reddyబుధవారం రాత్రి ట్రింకోమలీ (శ్రీలంక)కి 410 కిలోమీటర్లు, జాఫ్నాకు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్‌కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
Andhra Pradesh: షాకింగ్ వీడియో, రైలు ఎక్కుతుండగా ఫుట్‌పాత్‌, రైలు మధ్యలో ఇరుక్కుపోయిన విద్యార్థిని, క్షేమంగా బయటకు తీసిన రైల్వే అధికారులు
Hazarath Reddyగాజువాకలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ చోటుచేసుకుంది. గుంటూరు-రాయగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దువ్వాడకు వచ్చింది. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని శశికళ కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది.
Jayaho BC Maha Sabha: మీకు మంచి జరిగిందని అనిపిస్తే జగనన్నకు తోడుగా నిలవండి, చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, జయహో బీసీ మహాసభలో సీఎం జగన్
Hazarath Reddyవెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ మహాసభలో (Jayaho BC Maha Sabha) సీఎం జగన్ మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది.
Egg Prices Spike: ఏపీలో చుక్కలనంటిన కోడిగుడ్డు ధర, ఏడు రూపాయలకు పైసా తగ్గేది లేదంటున్న వ్యాపారులు, నోరెళ్లబెడుతున్న సామాన్యుడు
Hazarath Reddyచాలామంది అమితంగా ఇష్టపడే కోడి గుడ్డు ధర ఏపీలో చుక్కలనంటుతోంది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.ఏడుకు చేరింది.కార్తిక మాసం ముగియడంతో స్థానికంగా వినియోగం పెరగడంతో గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Cyclone Mandous: మాండూస్ తుపాన్‌గా మారనున్న వాయుగుండం, చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు, తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడి
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనివల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.