ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: చంద్రగిరిలో తీవ్ర విషాదం, చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య, అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి..
Hazarath Reddyతిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతులు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, భార్య లత'గా గుర్తించారు
TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి
Arun Charagondaతిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.
Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం
Arun Charagonda5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.
NTR Fan Kaushik Discharged: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిన ఎన్టీఆర్, జూనియర్‌పై కామెంట్స్ చేసిన కౌశిక్ తల్లి
Hazarath Reddyదేవర రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతి కి చెందిన కౌశిక్ తాజాగా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా చేసిన విషయం విదితమే.
Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం
Hazarath Reddyతిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Cyclone Coming? మళ్లీ దూసుకొస్తున్న ఇంకో తుపాను? కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, వివిధ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్, చింతలూరు వద్ద బస్సు ఆపి అందులో నిద్రపోతున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyఏపీలోని కాకినాడ జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా చూసి బస్టాండ్ లోని బస్ లో పడుకొని.. బస్ కు తాళం ఉండటం చూసి ఓ దుండగుడు బస్ ఎత్తుకెళ్లిన సంగతి విదితమే.తాజాగా చింతలూరు వద్ద బస్సు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని ఆ దొంగను అరెస్ట్ చేశారు.
Tirupati: వీడియో ఇదిగో, తిరుపతిలో తీవ్ర అపచారం, క్రిస్మస్ పండుగ ముందు రోజు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టిన దుండగులు, మండిపడుతున్న హిందూ సంఘాలు
Hazarath Reddyతిరుపతిలో తీవ్ర అపచారం ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు
Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్పీడుగా వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
Hazarath Reddyఏపీలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జకర సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది
Allu Arjun To Sandhya Theatre: మరోసారి సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్? కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ.. అటు నుంచి సినిమా హాల్ కు?? అసలేం జరుగనున్నది??
Rudraసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.
Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
Rudraసినీ నటుడు అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Allu Arjun To PS: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ఏం జరుగనున్నది??
Rudraసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.
Centre Scraps 'No-Detention' Policy: ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై 5, 8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి
Rudraకేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్ధులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే.
AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraబంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Sandhya Theatre Tragedy Row: పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఘోర రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి, పొగ మంచులో రోడ్డు మీద వెళ్తున్న మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Hazarath Reddyఅద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం జరిగింది. పులిపాడు వద్ద ట్రావెల్ బస్సు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు.
Earthquake in Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు, మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూప్రకంపనలు
Hazarath Reddyప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో మూడు రోజుల నుంచి వరుసగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)
Rudraఅల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.
Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్
Rudraసంధ్య థియేటర్ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.