ఆంధ్ర ప్రదేశ్

Cyclone Dana Live Updates: నాలుగు రాష్ట్రాలకు 'దానా' తుపాను ఎఫెక్ట్, ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు మూసివేత, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

Arun Charagonda

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఒడిశా ,పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలలోని అన్ని పాఠశాలలును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. దానా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Amaravati Drone Summit 2024: ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన విజయవాడ డ్రోన్ షో, సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి.

Cyclone Dana: రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, ఉదయం నుండి పవన్ రాక కోసం ఎదురుచూపులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జనసేన ఆఫీస్ దగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పడిగాపులు గాస్తున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుండగా ఆయన కార్యాలయ సిబ్బంది స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం కటిక నేల మీదేనిన్నంతా మహిళ ఉద్యోగుల పడిగాపులు గాశారు

Advertisement

Anchor Kavya: అప్పు తీర్చాలని అడిగినందుకు యాంకర్ మీద వైసీపీ నేత దాడి, అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన యాంకర్ కావ్య

Hazarath Reddy

ఈనెల 13న వైసీపీ నాయకుడు ఎన్వి శ్రీనివాస్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం చేయాలని కోరిన యాంకర్ కావ్య.నేను ఇచ్చిన 3 లక్షల రూపాయలకు అదనంగా మరో రెండు లక్షల వరకు ఖర్చయింది. మొత్తం ఐదు లక్షల రూపాయలు నాకు ఎన్వీ శ్రీనివాస్ దగ్గర నుంచి రావాలి. నా డబ్బులు నాకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నని తెలిపారు.

Anantapur Rains: వీడియో ఇదిగో, అనంతపురం వరదల్లో చిక్కుకున్న నాగార్జున, ఉప్పొంగి ప్రవహిస్తున్న పండమేరు వాగు

Hazarath Reddy

అనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి..రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచపోయాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున వదరల్లో చిక్కుకుపోయారు.

Anantapur Rains: వీడియోలు ఇవిగో, అనంతపురంలో ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, ఉగ్రరూపం చూపిస్తోన్న పండమేరు వాగు

Hazarath Reddy

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Anantapur Rains: భారీ వర్షాలకు ఉప్పొంగిన పండమేరు వాగు, జల దిగ్భంధంలో అనంతపురం, హైదరాబాద్ - బెంగళూరుకు రాకపోకలు బంద్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వరదకు పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Guidelines For Deepam Scheme: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, దీపం పథకం ద్వారా దీపావళి నుండి అమలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే!

Arun Charagonda

కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహిళలకు దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అఫిషియల్‌గా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందింనుండగా ఏడాదికి రూ.2,684 ఖర్చు చేయనున్నారు. ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.

Cyclone Dana: సైక్లోన్ దన దూసుకొస్తోంది, తీర ప్రాంతాల ప్రజలకు హై అలర్ట్, రేపు తుపానుగా మారే అవకాశం, తుపాను లైవ్ ట్రాకర్ ఇదిగో..

Hazarath Reddy

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Kattaleru Vagu: ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగుపై వరద ప్రవాహం, నీటిలో ఇరుక్కుపయిన టిప్పర్ లారీ, 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లాగంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై వరద ప్రవాహం ముంచెత్తింది. ఎగువున తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోటమూల- వినగడప మధ్య ఉన్న వంతెనపై వరద నీరు పోటెత్తింది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వరద నీటిలో ఇరుక్కుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??

Rudra

తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్, బర్త్ డే వేడుకలకు అనుమతి నిరాకరణ,సీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు

Arun Charagonda

బర్త్ డే రోజు మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. గుడివాడలో కొడాలి నాని పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీ ఏర్పాటుని అడ్డుకున్నారు పోలీసులు. మంగళవారం జరగాల్సిన కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరించగా వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.

Jeevan Reddy Follower Killed: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత

Rudra

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)

Rudra

సినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.

Cyclone Dana: ముంచుకొస్తున్న దన తుఫాను ముప్పు, ఈ సారి ఏపీ, ఒడిషాలకు హై అలర్ట్, వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Advertisement

Police Commemoration Day: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో స్పృహ తప్పి పడిపోయిన కానిస్టేబుల్, ఆస్పత్రికి తరలించిన అధికారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కానిస్టేబుల్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసు అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అతని ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.

Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో హెలికాప్టర్ కలకలం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

Hazarath Reddy

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో సోమవారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10:35గంటల సమయంలో ఆలయంపై హెలికాప్టర్ తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని TTD చెబుతోంది.

Police Commemoration Day: పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత, పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని వెల్లడి

Hazarath Reddy

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

Viral Video: హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు (వీడియో)

Rudra

హిమాయత్ సాగర్ జలాశయంలోని క్రస్ట్ గేటు వద్ద ఓ భారీ కొండ చిలువ ఇరుక్కుపోయింది. కొండ చిలువను గుర్తించిన డ్యాం సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలకు తెగించిన స్నేక్ సొసైటీ సభ్యులు ఎట్టకేలకు కొండ చిలువను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement