ఆంధ్ర ప్రదేశ్

Tirupati Laddu Row: రేపు తిరుమలలో ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌, డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ పిలుపు

Hazarath Reddy

తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

Food Poison At Hostel: ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత, చికెన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు..వీడియో

Arun Charagonda

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చికెన్ తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Harsha Sai: హర్షసాయి కోసం పోలీసుల ముమ్మర గాలింపు, విజయవాడలో ఉన్నట్లు అనుమానం, బంధువులను ఆరా తీసిన పోలీసులు!

Arun Charagonda

యూట్యూబర్ హర్షసాయి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు. ఇంకా పరారీలోనే యూట్యూబర్ హర్షసాయి ఉన్నారు. నిన్న వైజాగ్ లో వెతికిన సైబరాబాద్ పోలీసులు...విజయవాడలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళాలు, ఆపదలో రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని సీఎం చంద్రబాబు వెల్లడి, వరద బాధితులకు రూ.602 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాల ప్రజల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు అందాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం తెలిపారు.

Advertisement

Tirupati Laddu Dispute: చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా ? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు, ఆయన పాపాలు కడిగేందుకే పూజలు చేస్తున్నామని పేర్ని నాని ప్రకటన

Hazarath Reddy

తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.

Kodali Nani Slams Chandrababu: వీడియో ఇదిగో, నువ్వు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడివేనా? చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్, ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించావో చెప్పాలంటూ డిమాండ్

Hazarath Reddy

తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై కొడాలినాని, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) మీడియాతో మాట్లాడారు. అసలు చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా అని కొడాలి నాని ప్రశ్నించారు. స్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారు.

Tirupati Laddu Dispute: తిరుమల మీద చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన, ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

తిరుమల పవిత్రతకు చంద్రబాబు నాయుడు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు

S.A. Rahman Quits YSRCP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై, రాజీనామా చేసిన వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్, టీడీపీలో చేరునున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

వైసీపీకి తాజాగా మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

Advertisement

Andhra Pradesh: చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఆర్‌ కృష్ణయ్యను తెలుగు ప్రజలు క్షమించరు, మాజీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, సాంబార్లో పిండి ముద్దలు, అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఘటన

Hazarath Reddy

ఏలూరు జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వండిన సాంబార్లో పిండి ముద్దలు.. డిహెచ్ 5 మెస్ లోని సాంబారులో పిండి ముద్దలు.. అర్థాకలితో లెగసి వెళ్లిన విద్యార్థులు..

Tirupati Laddu Dispute: హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలా ? చురకలు అంటించిన వైసీపీ నేత పోతిన మహేష్

Hazarath Reddy

బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్‌ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్‌ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

Tirupati Laddu Dispute: వీడియో ఇదిగో, తిరుపతి లడ్డూ ఘటనలో మాది తప్పు అని నిరూపిస్తే నీ బూట్లు తుడుస్తా, పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Hazarath Reddy

లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.

Advertisement

MLA Koneti Adimulam: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్ రిలీఫ్, లైంగిక వేధింపుల కేసును కొట్టేసిన హైకోర్టు

Arun Charagonda

ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు హాజరై తాను చేసిన ఆరోపణలు, FIRలో అంశాలన్నీ అవాస్తవమని, కేసును కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించడంతో కేసును హైకోర్టు కొట్టేసింది.

Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్ల­డించింది.

R Krishnaiah Resigns: ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య, పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా

Hazarath Reddy

వైఎస్సార్​సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు.

Tirupati Laddu Dispute: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.

Advertisement

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.

Temple Chariot Set on Fire: అనంతపురంలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన దుండగులు, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

సోమవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లాలోని కనేకల్‌ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలో రామాలయ రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.

Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో

Hazarath Reddy

తిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.

Tirupati Laddu Prasadam Controversy: తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం, నెయ్యి సరఫరా చేసే కంపెనీకి కేంద్రం షోకాజ్ నోటీసులు

Hazarath Reddy

నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ నాలుగు కంపెనీల నుండి నమూనాలను స్వీకరించింది, వాటిలో ఒక కంపెనీ నమూనాలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి,

Advertisement
Advertisement