ఆంధ్ర ప్రదేశ్

Kadambari Jatwani Case: కాదంబరి జత్వానీ కేసు..ఇద్దరు పోలీసులపై వేటు,పోలీసులు వేధించారని ఫిర్యాదుతో ఇద్దరు పోలీసుల సస్పెండ్

Arun Charagonda

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణ సస్పెన్షన్‌ వేటు పడింది. పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి వేధించారని నటి జత్వానీ ఆరోపణలు చేస్తుండగా.. ఇద్దరు పోలీసులు సస్పెండ్ కావడం గమనార్హం.

Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్‌ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.

YSRCP Spoke Persons: జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే

Arun Charagonda

ఏపీలో అధికారం దూరమైన తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కీలక పదవులు అప్పజెప్పిన జగన్ తాజాగా మరిన్ని కమిటీలను నియమించారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించారు.

UIDAI Extends Free Online Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌ డేట్‌ గడువు మళ్లీ పొడిగింపు.. డిసెంబర్ 14 వరకూ అవకాశం

Rudra

పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్‌ ప్రకటించింది.

Advertisement

Symbol Of Communal Harmony: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్

Rudra

మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు.

Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ ప్రోగ్రాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై ప్రశ్న.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారా? వీడియో ఇదిగో

Rudra

ప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ పై ప్రశ్న అడిగారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటూ అడగ్గా.. కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పారు. ఈ ప్రశ్న విలువ రూ.1.6 లక్షలు. దీనికి సంబంధించిన వీడియో చూడొచ్చు.

Sankranti Trains Full: దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

Rudra

తెలుగువారికి ముఖ్యంగా ఆంధ్రులకు పెద్దపండుగగా పిలిచే సంక్రాంతి ఎంత ప్రముఖమైందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే.

Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్, పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియామకం

Hazarath Reddy

సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, కువైట్‌లో అమ్మేస్తామని బెదిరిస్తున్నారు, నన్ను కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న ఆంధ్రప్రదేశ్ యువతి

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కవితా అనే మహిళ బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లానని, కువైట్ వాళ్ళు నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Andhra Pradesh Rains: రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, వచ్చే రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు

Hazarath Reddy

ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్‌ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

YS Jagan: వీడియో ఇదిగో, పాపా నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ సెటైర్ వేసిన జగన్, పిఠాపురం పర్యటనలో ఆసక్తికర వీడియో వైరల్

Hazarath Reddy

చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.

YS Jagan Slams CM Chandrababu: ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమంటారు, చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ జగన్, ఇకనైనా జగన్నామం ఆపు అంటూ ఎద్దేవా

Hazarath Reddy

పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు ముంపు గ్రామాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏమాదిరిగా అతలాకుతలం అయ్యిందో.. అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్‌ రైతులను ముంచేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత అన్నారు.

Advertisement

Andhra Pradesh: సీబీఎస్‌ఈ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన బాధితురాలు, రాజీ కోసం టీడీపీ నాయకులు రహస్య మంతనాలు

Hazarath Reddy

టీడీపీ నుంచి సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.

TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, వైఎస్సార్‌సీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు

Hazarath Reddy

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tollywood: సీఎం చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారనే వార్తలు అబద్దం, క్లారిటీ ఇచ్చిన చరణ్ పీఆర్ టీమ్, అసలు నిజం ఏంటంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి విదితబే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

Rudra

స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.

Andhra Pradesh Shocker: తాడిపత్రిలో దారుణం, బైక్ పై వస్తున్న వ్యక్తిని రాళ్లతో దాడి చేసి హత్య చేసిన దుండగులు..వీడియో

Arun Charagonda

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు

Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

Rudra

టాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్‌ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.

Telugu States Weather Update: మొన్నటి విలయానికి ఇంకా కోలుకోకముందే తెలంగాణ, ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

Rudra

ఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నది. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు.

Advertisement
Advertisement