Annamayya Violence Case: ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, టీడీపీ అధినేతతో సహా 20 మందిపై కేసు నమోదు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు
అన్నమయ్య జిల్లాలోని ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
VJY, August 9: అన్నమయ్య జిల్లాలోని ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో (Annamayya Violence Case) అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన (Former CM Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
పథకం ప్రకారమే పోలీసులపై దాడి, పుంగనూరు ఉద్రికత్తలపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి
‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొ..... వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు.
సాయంత్రం అయితే నా తమ్ముళ్లకు ఓ పెగ్గు పడాల్సిందే, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
కాగా, పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు.

వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్లులో జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై ముదివేడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాలనుచ ఏ3గా అమర్నాథ్ రెడ్డిని చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపీసీ 120 బీ, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506 ఆర్/డబ్ల్యూ, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు చంద్రబాబుపై కేసు నమోదు చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ వాళ్లు అల్లర్లు చేస్తే చంద్రబాబుపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కాగా, పుంగనూరులో ఇప్పటి వరకు 74 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అమర్ నాథ్ రెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిలతో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 09, 2023 11:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

