Extreme tension in Chandrababu's Punganur tour, both groups attacked with sticks and stones

Punganur, August 4: టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో ఒక్కసారిగా వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఫలితంగా అక్కడంతా హైటెన్షన్ వాతారణం నెలకొంది.

ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.చంద్రబాబును పుంగనూరు టౌన్‌లోకి రానీయకుండా వైసీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా లారీని ఉంచారు.

దీంతో లారీని అడ్డు తొలగించాలని ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ లాఠీఛార్జ్‌తో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక చంద్రబాబు వస్తున్న వేళ పుంగనూరులో టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింపేశారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా దాడులు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం, పోలీసుల వాహనాలకు కూడా నిప్పటించారు. మరోవైపు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. టీడీపీ శ్రేణులు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను జిల్లా ఎస్పీ పరామర్శించారు.

చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో టీడీపీ ఎంపీటీసీ దేవేందర్‌కి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. పుంగనూరు మీదుగా చంద్రబాబు సోంపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. అయితే గో బ్యాక్ చంద్రబాబు అని నినాదాలు చూస్తే వైసీపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పుంగనూరులోకి అనుమతి లేదని చంద్రబాబుకు పోలీసులు తెలిపారు. చంద్రబాబు వెళ్లే రోడ్డులో కంటైనర్ లారీ, వాహనాలను అడ్డుగా పెట్టారు.

Here's Videos

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంగళ్లులో మంత్రి అంటూ పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. దాక్కోవడం కాదు, దమ్ముంటే రమ్మని పిలిస్తున్నానంటూ సవాల్‌ విసిరారు. అయితే ఉదయం నుంచి చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్రిక్తతల నడుమ ఈ పర్యటన సాగుతోంది. టెన్షన్ వాతావరణం నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉద్రిక్తతల నేపథ్యంలో పుంగనూరు బైపాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

చంద్రబాబు పుంగనూరు బైపాస్‌ కూడలి వద్దకు చేరుకుని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఇవాళ జరిగిన విధ్వంసానికి మంత్రి పెద్దిరెడ్డి, పోలీసులే కారణం. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ దారిలో వెళ్లకూడదా? ఈ రహదారి మంత్రి పెద్దిరెడ్డి తాత జాగీరా? ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారు. నేను మళ్లీ వస్తా.. పుంగనూరు పట్టణమంతా పర్యటిస్తా. తలలు పగులుతున్నా, నెత్తురోడుతున్నా నిలబడిన కార్యకర్తలను అభినందిస్తున్నా. చల్లా బాబుపై దెబ్బపడితే నాపై పడినట్టే. మీ నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా.. నా నుంచి కారినట్టే. ప్రజలకు అండగా ఉంటా. వై నాట్‌ పుంగనూరు. వై నాట్‌ 175..

Here's Videos

"మొన్ననే పులివెందులలో పొలికేక వినిపించా... ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా. అధికార పార్టీకి దాసోహం కావొద్దని పోలీసులను కోరుతున్నా. ఇవాళ్టి ఘటనలకు ఎస్పీనే బాధ్యుడు, నేటి దాడి ఘటనపై విచారణ జరపాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలను చంద్రబాబు తన వాహనంపైకి పిలిపించుకున్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. నేను మళ్లీ పుంగనూరు వస్తా... పుంగనూరు పట్టణమంతా పర్యటిస్తా అంటూ మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. ఇవాళ్టి విధ్వంసానికి కారణం పెద్దిరెడ్డేనని ఆరోపించారు. ఈ విధ్వంసంలో పోలీసు యంత్రాంగం పాత్ర కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భగవంతుడు స్క్రిప్టు రాశాడని అసెంబ్లీలో జగన్‌ చెప్పారు.. దేవుడు ఆ స్క్రిప్టు తిరగ రాశాడు. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరిగాయి. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది. ఈరోజు మీరు చూపించిన పట్టుదలను అభినందిస్తున్నా. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా. ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా. అధికార పార్టీకి దాసోహం కావొద్దు. శాంతిభద్రతలు కాపాడండి’’ అని పోలీసులను హెచ్చరించారు. వైకాపా రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.