Anantapur, August 3: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.తన ప్రేమను నిరాకరించిందని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఓ ప్రేమోన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు.భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను యువతి (opposing his love in Anantapur) నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెళుతున్న మైథిలిని కారుతో (Young man collides a car with girl) ఢీకొట్టాడు భాస్కర్. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో 15 రోజుల కిత్రమే భార్యతో గొడవపడిన హరీష్ క్రిమిసంహారక మందు తాగాడు. హస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు.అయితే మరోసారి భార్యభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్ సోమవారం అర్థరాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.