Karachi, August 1: పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ భర్త... ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ఝాంగ్ జిల్లాలో ఆదివారం (Pakistan Shocker) చోటు చేసుకుంది. తన భార్యను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆమెతో అక్రమ సంబంధాలు కొనసాగించాలని వేధిస్తున్నాడనే (Having Affair With His Wife) కారణంతో నిందితుడు ముహమ్మద్ లిఫ్తీకర్ తన స్నేహితులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ కాసిమ్ హయత్‌పై ఈ దుశ్చర్యకు (Man Chops Off Cop's Ears) పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని కానిస్టేబుల్ కాసిమ్ హతయ్‌పై లిఫ్తీకర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాధితుడిని 12 మందితో కలిసి అపహరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు.’ అని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు.
కాగా గతనెల పోలీస్ కానిస్టేబుల్ హయత్‌పై పీపీసీలోని 354(మహిళపై దాడి), 384(దోపిడి), 292(అక్రమ సంబంధం)వంటి సెక్షన్ల కింద కేసు పెట్టాడు ఇఫ్తీకర్. తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని, అతడి వద్దకు వెళ్లిన తన భార్యపై బలవంతంగా అత్యాచారం చేసి వీడియో తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వీడియోల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ హయత్‌పై దాడి కేసులో ఇఫ్తీకర్‌తో పాటు అతడి అనుచరులను పట్టుకునే పనిలో పంజాబ్ పోలీసులు పడ్డారు .