Hyderabad, Mar 10: తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు శుభవార్త. ఏపీ (AP), తెలంగాణ (Telangana) మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ రైలును 12న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ లో ప్రారంభమైయ్యే వందేభారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 1.50 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వైజాగ్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్ల కోట మీదుగా ఈ రైలును నడపనున్నారు.
PM @narendramodi will flag off the second Vande Bharat Express connecting Secunderabad and Visakhapatnam on March 12. #VandeBharatExpress #Secunderabad #Visakhapatnam pic.twitter.com/VzkWlXLUFX
— Deccan Chronicle (@DeccanChronicle) March 10, 2024
తొలి వందేభారత్ ఇలా
ఇక వైజాగ్-సికింద్రాబాద్ మధ్య తొలి వందేభారత్ గతేడాది జనవరి 15న పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ రైలుకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉండటంతో వంద శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. చాలా సందర్భాల్లో రిజర్వేషన్ దొరక్కపోవడంతో పాటూ రానుపోను ఒకే రైలు ఉండటంతో తరచూ సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా అధికారులు రెండో వందేభారత్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.