తెలంగాణ
Mahbubnagar: పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగం కొల్పోయిన యువకుడు, ఇంటర్వ్యూ లెటర్ ఆలస్యంగా ఇవ్వడంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
Arun Charagondaఓ పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కొల్పోయాడు ఓ యువకుడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ కి చెందిన నాగరాజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. సెప్టెంబర్ 27 లోపు ఇంటర్వ్యూకి హాజరు కావాలని అధికారులు నాగరాజుకి కాల్ లెటర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు.
Patnam Narender Reddy Arrested: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, పాదయాత్రకు బయలుదేరుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaకొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ నెలకొల్పకూడదని గ్రామ ప్రజలతో కలిసి ఇవాళ పాదయాత్రకు పిలుపునివ్వగా హైదరాబాద్ నుండి కొడంగల్ బయలుదేరుతుండగా బొమ్మరాసపేట తుంకిమెట్ల వద్ద అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Suryapet: మహిళతో అసభ్య ప్రవర్తన, కర్రలతో దాడి చేసిన కుటుంబ సభ్యులు..వైరల్ వీడియో
Arun Charagondaమహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కర్రలతో దేహశుద్ధి చేశారు కుటుంబ సభ్యులు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్‌లో ఓ వ్యక్తి గతంలో పరిచయం ఉన్న ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.దీంతో ఆగ్రహించిన మహిళ కుటుంబసభ్యులు కర్రలతో ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Warangal: కూల్చివేతలు..ఎమ్మార్వోపై దాడి, ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని అనుకుని ఎమ్మార్వోపై దాడి చేసిన వరంగల్ ఎస్‌ఆర్ నగర్ కాలనీ వాసులు, బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి వచ్చానని చెప్పిన వినని ప్రజలు..వీడియో ఇదిగో
Arun Charagondaఇల్లు కూలగొట్టడానికి వస్తున్నాడని ఎమ్మార్వోపై దాడి చేసిన సంఘటన వరంగల్ ఎస్‌ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. బతుకమ్మ ఆటస్థలం పరిశీలించడానికి ఎమ్మార్వో వెళ్లగా తమ ఇండ్లను కూలగొట్టడానికే ఎమ్మార్వో వచ్చాడేమో అనుకొని ఆయనపై దాడి చేశారు కాలనీ వాసులు. దీంతో తనపై దాడికి పాల్పడిన వారిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో.
Hyderabad Metro Rail Second Phase: హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధం, రూ.24,269 కోట్లతో అంచనా వ్యయం, కేబినెట్ అమోదం తెలిపాక కేంద్రానికి నివేదించనున్న ప్రభుత్వం
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే మూడు కారిడార్లుగా హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతుండగా మరో ఐదు కారిడార్లలో మెట్రో రెండో దశను విస్తరించనున్నారు.
Hyderabad Horror: దారుణం, నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త, అనంతరం పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన కసాయి
Hazarath Reddyరంగారెడ్డి - హైదర్ షాకోట్లో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన కిరాతకుడు. గత కొంత కాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త.. పలు మార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన భార్య, తన కుటుంబ సభ్యులు. పోలీసులు పట్టించుకోక పోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ.
Telangana: వీడియో ఇదిగో, మీ కుటుంబంపై చేతబడి చేశా.. 48 గంటల్లో అతి భయంకరంగా చావబోతున్నారంటూ బెదిరింపులు, అరెస్టు చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ బండ్లగూడలో మీ కుటుంబంపై చేతబడి చేశా.ఈ రోజు అమావాస్య.మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారని వాట్సాప్‌లో వీడియోలు పంపి బెదిరించిన వ్యక్తిని సౌత్ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి క్షుద్ర పూజల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana: వీడియో ఇదిగో, రైతు ఆవేదన తెలియజేయడం తప్పా.. జర్నలిస్టు గౌతమ్ గౌడ్‌పై కేసు పెడతారా ? డీజీపీని ప్రశ్నించిన కేటీఆర్
Hazarath Reddyనల్లగొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు.. కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో సాగునీరు వచ్చింది. 24 గంటల నాణ్యమైన కరెంట్ అందింది. ఏడాదికి రెండుసార్లు రైతుబంధు జమ చేసి అప్పుల పాలు కాకుండా చేశారు
Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
Hazarath Reddyహీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు
Woman Attacked RTC Conductor: తెలంగాణ బస్సులో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్ అడిగిన మహిళ, చెల్లదని చెప్పడంతో కండక్టర్ మీద దాడి
Hazarath Reddyఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది
Bhukya Yashwanth: పర్వతారోహణలో తెలంగాణ యువకుడు అద్భుతం, మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన భుక్యా యశ్వంత్
Hazarath Reddyతెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ అద్భుతాలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6,488 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ గోరీ చెన్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. 16వ ఏట పర్వతారోహణను ప్రారంభించిన యశ్వంత్.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన తదుపరి లక్ష్యం అంటున్నారు.
Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)
Rudraటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం
Hazarath Reddyమేడ్చల్ - రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుండి కొన్ని రోజులుగా దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ దొంగ కొన్ని పాల పాకెట్లను దొంగిలించడం చూడవచ్చు.
Congress Vs MIM Leaders Clash: వీడియో ఇదిగో, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి, ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Hazarath Reddyహైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు
Teegala Krishna Reddy Meet Chandrababu: మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మనవరాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
KA Paul on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎ పాల్, మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
HYDRA Demolition Row: జీహెచ్ఎంసీని కూల్చివేస్తారా ? ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల సంగతేంటి, ప్రభుత్వానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూటి ప్రశ్న
Hazarath Reddyతెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు
Telangana: వీడియో ఇదిగో, మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు, త్వరలో పెట్టుకునేలా సుందరీకరణ చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyమీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు.. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyగజ్వేల్ వద్ద హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్ రమేష్ సింగ్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ రమేష్‌సింగ్ మృతి చెందాడు.