తెలంగాణ

Hyderabad: రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం, అడ్డంగా పట్టుబడిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి

Hazarath Reddy

రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి.

TGSRTC: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాలం పాటు ఉచిత పాస్‌, ప్రసవం చేసిన స్టాఫ్‌ నర్స్‌కు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

Heavy Rains in Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Hyderabad: వీడియో ఇదిగో, బుర్ఖా ధరించి బైక్ పై డేంజరస్ స్టంట్స్, ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hazarath Reddy

బుర్ఖా ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సామజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Heavy Inflows Into Hussain Sagar: వీడియో ఇదిగో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.

Viral Video: వీడియో ఇదిగో, హాస్టల్‌లోకి అనుమతించని యాజమాన్యం, తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలొంచి అక్కల చేత రాఖీ కట్టించుకున్న బాలుడు

Hazarath Reddy

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది.

Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

Hazarath Reddy

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Hyderabad: గొప్ప మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆస్పత్రి దారి తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి ఆస్పత్రికి స్వయంగా తీసుకువెళ్ళిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్. సకాలంలో బాలుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించిన శ్రవణ్ కుమార్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, భారీ వరదలకు పంజాగుట్టలో అపార్ట్‌‌మెంట్ రెయిలింగ్‌పై పడిన పిడుగు, కారు ధ్వంసం, తప్పిన ప్రాణాపాయం

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, హైదరాబాద్’లో భారీ వరదలకు కొట్టుకుపోయి వ్యక్తి మృతి, రాంనగర్ లో విషాదకర ఘటన

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rain in Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి, కాపాడిన స్థానికులు

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Hyderabad Rain: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం రూ. 2 కోట్లు అప్పు, తీర్చే మార్గం లేక సూసైడ్ చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్‌ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్‌ (28) అప్పు తెచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు.

Delhi Liquor Scam Case: కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలకు ఆదేశాలు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది.

LB Stadium Wall Collapsed: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. ధ్వంసమైన పోలీస్ వాహనాలు

Rudra

హైదరాబాద్‌ లో నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరదపారింది. వర్షానికి బాగా తడిసిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ ఈ ఉదయం కూలిపోయింది.

Kavitha Bail Petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

Rudra

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Advertisement

Holiday for Educational Institutions: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

Rudra

భారీ వర్షాలకు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

Heavy Rain in Hyderabad: హైద‌రాబాద్‌ లో కాలువలైన రోడ్లు.. బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు.. కాపాడిన స్థానికులు (వైరల్ వీడియో)

Rudra

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ అతలాకుతలం అవుతున్నది.

Heavy Rain in Hyderabad: హైద‌రాబాద్‌ లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన‌.. పలు ప్రాంతాలు జలమయం

Rudra

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ అతలాకుతలం అవుతున్నది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండ‌పోత వ‌ర్షం కురుస్తూనే ఉన్నది.

Astrologer Venu Swamy Viral Video: నాకు ఆత్మహత్యే శరణ్యం..ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియో విడుదల..

sajaya

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ వేధింపుల వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సదరు టీవీ ఛానల్ కు చెందిన జర్నలిస్టు తమ నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నారని ఆ డబ్బు ఇవ్వకపోతే తమను మరింత అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆయన ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement