తెలంగాణ
KTR-Women's Commission: మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు
Rudraకాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ ప్రయాణ సదుపాయంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.
Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి
Rudraతెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.
Harish Rao VS Revanth Reddy: అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హరీష్ రావు
Hazarath Reddyరుణమాఫీ పచ్చి అబద్ధమని తెలిశాక రాజీనామా చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పారో ఆ దేవుళ్ల వద్దకు వెళతాను. ఆయన చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారవద్దని ప్రార్థిస్తాను" అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం, అతి వేగంగా వచ్చి తుఫాను వాహనాన్ని ఢీకొట్టిన మారుతి బెలెనో కారు, ఐదుగురి మృతి
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని అతి వేగంగా వచ్చిన మారుతి బెలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అవ్వగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Weather Forecast: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ, హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Hazarath Reddyతెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు ప్రాంతాల్లో కుండపోత వాన
VNSహైదరాబాద్ లో వాతావరణం (Hyderabad rain) ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్ (Rain), అల్వాల్, పటాన్ చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ లో వర్షం దంచికొడుతోంది.
KTR Slams CM Revanth Reddy: రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyరైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని... అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy Challenges Harishrao:రుణమాఫీ చేసి చూపించాం.. చీము -నెత్తురుంటే హరీష్ రావు రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, రాజీనామా చేయకపోతే ఏటిలో దూకాలని మండిపాటు
Arun Charagondaరుణమాఫీ అమలు చేసి చూపించాం..బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామా చేయకపోతే ఏటిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్..31 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామన్నారు.
KTR On BRS - BJP Merge: బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు
Arun Charagondaతప్పకుండ స్టేషన్ ఘన్‌పూర్లో ఉప ఎన్నిక వస్తుంది.. మళ్లీ తిరిగి రాజయ్య గెలుస్తాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..హై కోర్టులో తీర్పు కూడా రిజర్వు చేసి పెట్టారు.. అక్కడ సానుకూల ఫలితం వస్తుందని అనుకుంటున్న అన్నారు. ఊసరవెల్లిలు రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడుతలు, తొండలే వస్తాయి...కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్లకు పెడితే.. ట్రాన్స్‌ఫార్మర్ మీద తొండ పడ్డది, ఉడుత పడ్డదని సమాధానం ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.
Telangana: వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం
Hazarath Reddyఅధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు. రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. మేయర్ కమీషనర్ ఉన్న సమయంలోనే.. ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు విజయ్.
Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..
Hazarath Reddyకామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు
Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోని ఢీకొట్టిన భారీ ఐరన్ లోడ్ లారీ, ఒకరు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyజోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్థాన్ భారీ ఐరన్ లోడ్ ట్రాలీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaతెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్ పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నుండి తిరిగి వచ్చిన సీఎం రేవంత్...ఆనంద్ మహీంద్రా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు
CM Revanth Reddy: గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ
Arun Charagondaదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మరువలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రేవంత్.
Stray Dogs Attack In Karimnagar: కరీంనగర్‌లో వీధి కుక్కల దాడి, ముగ్గురు చిన్నారులపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaకరీంనగర్‌లో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి వీధి కుక్కలు. కరీంనగర్ - వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాగ ప్రణయ్(12), రిషి(10), స్వప్న అనే ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.గాయపడిన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
Telangana: శభాష్ ఆటో అన్న, నీటిలో కొట్టుకుపోతున్న కుటుంబాన్ని కాపాడిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
Arun Charagondaమహబూబాబాద్ - గార్ల మండలంలో ఏరు దాటుతుండగా కాలు జారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు. రాంపురం పాకాల ఏరు పైనుంచి దాటుతున్న తండ్రి, కూతురు, కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడాడు. దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు.
Nagarjuna Sagar Dam: నిండుకుండలా నాగార్జున సాగర్, మళ్లీ రెండు గేట్లు ఎత్తిన అధికారులు, లాంగ్ వీకెండ్ తో క్యూకట్టిన పర్యాటకులు
VNSనల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Dam) నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న ది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను (Gates Lifted) ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Telangana: మా వద్ద హైదరాబాద్ ఉంది, ఏపీతో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మా పోటీ ప్రపంచంతోనేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddy15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.
Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Hazarath Reddyతెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు.
Telangana Governor Quota MLC: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య
Arun Charagondaసుప్రీం కోర్టులో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.