తెలంగాణ

Road Accident Video: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాయంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును, కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

Bagless Days: బ్యాగుల మోతకు చెల్లు.. 10 రోజులు బ్యాగ్‌ లెస్‌ డేస్‌.. 6-8 తరగతులకు అమలు.. కేంద్రం మార్గదర్శకాలు

Rudra

విద్యార్థులపై బ్యాగుల మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది.

Telangana Viral News: చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!

Rudra

భార్యాభర్తల బంధం ఎంతో గొప్పది. అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే.

CM Revanth Reddy Vs Jagadish Reddy: మీరు నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేల‌కు రాసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, అసెంబ్లీలో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ

Hazarath Reddy

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం (CM Revanth Reddy Vs Jagadish Reddy) జ‌రిగింది. జ‌గ‌దీశ్ రెడ్డి హ‌త్య కేసుల్లో నిందితుడు అని సీఎం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Akbaruddin Owaisi on Bribe: హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళుతున్నాయి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పానని తెలిపారు.

Telangana Projects Water Levels: భారీ వర్షాలతో నిండుకుండల్లా తెలంగాణ ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టుల్లో ఎంత వాటర్ ఫ్లో ఉందో తెలుసా?

Arun Charagonda

దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డతో పాటు వివిధ ప్రాజెక్టులు వర్షాలు, వరదనీటితో నిండు కుండలను తలపిస్తున్నాయి.

Viral Video: గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి వ్యక్తి మృతి.. కర్నూల్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

సరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాలు కూడా తీస్తాయి. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన తాజా విషాదం ఈ కోవకే వస్తుంది. మద్దికేరకు చెందిన ఓ వ్యక్తి గుర్రపుస్వారీ చేస్తూ పొరపాటున కిందపడి మరణించాడు.

Viral Video: ఉచిత బస్సులో ఖాళీగా ప్రయాణించడం ఎందుకని.. బ్రష్ చేసుకున్న మహిళ.. నెట్టింట వీడియో వైరల్

Rudra

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది.

Advertisement

Hyderabad Youth Dies in US: అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్‌ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..

Rudra

చేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది?

Telangana Shocker: ప్రేమ వ్యవహారం, డిగ్రీ విద్యార్ధిని చంపిన ఇంటర్ విద్యార్థులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

Arun Charagonda

ప్రేమ వ్యవహారంలో డిగ్రీ విద్యార్థిపై దాడి చేసి చంపారు ఇంటర్ విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం - పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అల్లూరి విష్ణు(22)పై కొంత మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన విష్ణును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, విష్ణు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ ఛాలెంజ్‌, అమ్మవారి సన్నిధిలో రాజకీయాలేంటి?, కోమటిరెడ్డి ఫైర్

Arun Charagonda

భాగ్యనగరం బోనమెత్తింది. నగరం వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొంది. ఎక్కడ చూసిన బోనాల పండగ శోభ సంతరించుకోగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వైన్స్ షాపులు బంద్ చేయగా ట్రాఫిక్ ఆంఓలు సైతం విధించారు.

Shamirpet Road Accident: హైదరాబాద్‌ శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంతో బస్సును ఢీ కొట్టిన కారు, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి, షాకింగ్ వీడియో

Arun Charagonda

తెలంగాణలోని హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ - శామీర్‌పేట రాజీవ్ రహదారిపై అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మోహన్‌(25), దీపిక(25) మృతి చెందారు. బస్సు వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్ ఫుటేజ్ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Telangana Shocker: హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌లో దారుణ హత్య, స్కూల్ టీచర్‌ని చంపేసిన బార్బర్, నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని గొడవ,కత్తితో దాడి, స్పాట్ లోనే చనిపోయిన టీచర్, వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్‌లో మర్డర్ జరిగింది. ఓ కటింగ్ షాపులో పని చేసే గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణ హాస్టల్‌లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG New Governor Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్‌ గా జిష్ణుదేవ్‌ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌

Rudra

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. రాజస్థాన్‌ గవర్నర్‌ గా హరిబౌ కిషన్‌ రావు బాగ్డేను నియమించారు.

Telangana Assembly: ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9.15 వ‌ర‌కు కొన‌సాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార ప‌క్షానికి హ‌రీష్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

VNS

తెలంగాణ శాస‌న‌స‌భ (Telangana Assembly) సోమ‌వారానికి వాయిదా ప‌డింది. బ‌డ్జెట్‌పై (Telanagana Budget) సాధార‌ణ చ‌ర్చ ముగియ‌గానే స‌భ‌ను ఈ నెల 29వ తేదీకి స‌భ వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. 29వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభం కానుంది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ రాత్రి 9:15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది.

Flood At Bhadrachalam: ఒక్కసారిగా పెరిగిన గోదావ‌రి ఉధృతి, భ‌ద్రాచ‌లం వ‌ద్ద ప‌రివాహ‌క గ్రామాల్లో అప్ర‌మ‌త్తం, కొన‌సాగుతున్న రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌

VNS

భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం (Godavari Flood) అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వ‌ర‌ద ప్ర‌వాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది

Advertisement

Hyderabad Bonalu 2024: హైదరాబాద్ బోనాలు, పూనకాలు లోడింగ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వైన్స్ షాపులు బంద్

Arun Charagonda

ఈ నెల 28న హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్దమైంది. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండగా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు బంద్ చుశారు. ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్‌లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో ఆదివారం, సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

Telangana Gurukul Jobs: గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థుల ఆందోళన,  పోలీస్ స్టేషన్‌లో దీక్ష, భిక్ష మెత్తుకుంటున్న అభ్యర్థులు.. వీరల్ వీడియోలు

Arun Charagonda

తెలంగాణ గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ బొరబండ పోలీస్ స్టేషన్లో కొంతమంది అభ్యర్థులను అరెస్ట్ చేయగా పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష చేస్తున్నారు. ఇక అశోక్ నగర్ సర్కిల్‌లో బిక్షమెత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Kaleshwaram Project: బిగ్ బ్రేకింగ్...కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు ఆన్‌, నందిమేడారం,లక్ష్మీపూర్‌ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం

Arun Charagonda

ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్‌లు ప్రారంభమయ్యాయి. ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతలు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు రెండు వరకు కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డెడ్‌లైన్ పెట్టిన నేపథ్యంలో నందిమేడారం తో పాటు లక్ష్మి పూర్ లో పంప్స్ ఆన్ చేశారు అధికారులు.

Telangana Dogs attack: తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన వీధి కుక్కలు, రాజన్న సిరిసిల్లలో వృద్ధుడిపై కుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

తెలంగాణలో మరోసారి కుక్కల దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల - గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో లక్ష్మణ్ అనే వృద్ధుడిపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement