తెలంగాణ

Telugu States CM’s Meeting: ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటీ, గంటా 45 నిమిషాల పాటూ సాగిన చ‌ర్చ‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాలివే!

VNS

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో (Praja bhavan) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమావేశమై చర్చించారు. గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు.

NIMS Doctor Suicide: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్‌ వైద్యురాలు ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన

Rudra

మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని హైదరాబాద్ లోని నిమ్స్‌ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్‌ ప్రాచీ కర్‌(46) నిమ్స్‌ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.

Chandrababu's Hyderabad Visit: వీడియో ఇదిగో, హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన తెలంగాణ టీడీపీ నేతలు, రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు

Advertisement

Road Accident Video: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు

Hazarath Reddy

లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండలం ఎర్రవరం సమీపంలో చోటు చేసుకుంది.

Barrelakka Arrested By Police: బర్రెల‌క్క‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, హైద‌రాబాద్ లో ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ స్టేష‌న్ త‌ర‌లింపు

VNS

టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. దశలవారీగా టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి వస్తున్నారు నిరుద్యోగులు. ఆ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బర్రెలక్క (Brrelakka Arrest)ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: బదిలీపై వేరే స్కూల్‌కు టీచర్,మేము కూడా మీతోనే అంటూ అదే పాఠశాలలో జాయిన్ అయిన 133 మంది విద్యార్థులు

Hazarath Reddy

మనసుకు నచ్చిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే చాలా మంది విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు బదిలీపై వెళితే ఆయనతో పాటే స్కూలులో ఉన్న 133 మంది విద్యార్థులు వెళ్ళి ఆయన దగ్గరే జాయిన్ అయ్యారు.

BRS Student Leaders Protest at TGPSC: టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ జేఏసీ నేతలు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఉద్యోగాల భర్తీపై శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విద్యార్థి విభాగం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అరెస్టులు జరిగాయి.

Advertisement

Sonu Sood at Kumari Aunty Food Stall: వీడియో ఇదిగో, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేసిన సోనూ సూద్, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని చమత్కారం

Hazarath Reddy

కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసిన సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశాడు. సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు

Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. ఈ ఆదివారం నుంచే వేడుకలు షురూ.. భక్తుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Rudra

ఆషాఢ మాసం బోనాలకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. ఈ ఆదివారం బోనాలు ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.

Shock to BRS: బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

Rudra

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయాలు ఎన్నికల వరకేనని వెల్లడి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Advertisement

Hyderabad Gang Rape Case: మియాపూర్‌లో కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, మూడు రోజుల్లో ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ లేఖ

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మియాపూర్ లో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగిన సంగతి విదితమే. తీవ్ర కలకలం రేపిన మియాపూర్‌ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ (National Commission for Women) సీరియస్‌గా తీసుకుంది.

Road Accident Caught on Camera: వీడియో ఇదిగో, అత్యంత వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్, ఎగిరి డివైడర్‌పై పడి మృతి చెందిన బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి

Hazarath Reddy

గజ్వేల్‌ పట్టణంలో అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌కుమార్‌ యాదవ్‌(18) గుంటూరు జిల్లాకు చెందిన స్నేహితుడు పూసులూరి త్రినాథ్‌(18)తో కలిసి ద్విచక్ర వాహనంపై పిడిచెడ్‌ రోడ్డులో శివాజీ విగ్రహం నుంచి గజ్వేల్‌ వివేకానంద చౌరస్తా వైపునకు వస్తున్నారు.

TGEAPCET Counselling: తెలంగాణ‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం కౌన్సెలింగ్ ప్ర‌క్రియ షురూ, రిజిస్ట్రేష‌న్, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ స‌హా ఎలా పూర్తి చేయాలో వివ‌రాలిగో

VNS

తెలంగాణ‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌లో (B tech) ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్‌ (TGEAPCET) కౌన్సెలింగ్‌ (Counselling)ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్‌ కొనసాగనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Telugu States CMs in Delhi: ప్ర‌ధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై తెలుగురాష్ట్రాల సీఎంల స‌మావేశానికి ముందు కీల‌క ప‌రిణామం

VNS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra modi) ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth reddy) విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు.

Advertisement

KCR Slams Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైంది, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి

Telangana: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే

Hazarath Reddy

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.

Telangana: తీవ్ర విషాదం, తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతి, బిడ్డ మృతి చెందిందన్న వార్త విని కుప్పకూలిన తల్లిదండ్రులు

Hazarath Reddy

తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మరణించిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నా­రి రియాన్షిక సోమవా­రం రాత్రి హోం వర్క్‌ చేస్తున్న టైంలో బెడ్‌ మీద నుంచి కింద పడిపోయింది

Advertisement
Advertisement