తెలంగాణ

Hanamkonda Accident: వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. కారు వేగానికి బొక్కబోర్లాపడ్డ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు.. పలువురికి గాయాలు.. హన్మకొండలో యాక్సిడెంట్.. వీడియో వైరల్

Rudra

అతివేగం నిండు ప్రాణాలను బలికొంటున్నది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Sitarama Project Trial Run Success Video: సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్‌, తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్‌ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వ‌ద్ద‌ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్‌ రన్‌ను పర్యవేక్షించారు

Telangana: ఎమ్మార్వో భూ సమస్యను పరిష్కరించడం లేదని పురుగుల మందు డబ్బాతో చెట్టు ఎక్కిన రైతు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, పోలీసుల చొరవతో ఎట్టకేలకు రైతు కిందికి దిగారు. వీడియో ఇదిగో..

Telangana Rain Update: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వానలు, రోడ్లన్నీ జలమయం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్, తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు

Hazarath Reddy

చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో మరో వారం రోజులు పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Constable Rapes Minor Girl: వీడియో ఇదిగో, వీడియోలు తీసి బెదిరిస్తూ మైనర్ బాలికపై కానిస్టేబుల్ నాలుగేళ్ల నుంచి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

శంషాబాద్ ఆర్.జి.ఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రదీప్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్ లో నివసిస్తూ ఇంటికి ఎదురుగా ఉన్న మైనర్ బాలికను మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, సదరు బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Hyderabad Shocker: అత్తాపూర్‌లో దారుణం, టీ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అత్తాపూర్‌లోని హసన్ నగర్ ప్రాంతంలో అత్త(ఫర్జాన) ఇవాళ ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంలో చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, భార్య పరీక్ష రాస్తుంటే కొడుకును ఆడిస్తున్న తండ్రిపై దాడి చేసిన బౌన్సర్లు, జీ.నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ లోని షేక్ పెట్ పరిధిలో జీ.నారాయణమ్మ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వద్ద ఒక వ్యక్తి భార్య కాలేజీ సెంటర్లో పరీక్ష రాస్తుండడంతో పార్కింగ్ వద్ద తన కుమారుడిని ఆడిస్తున్నాడు. ఈక్రమంలో అతడిపై అక్కడున్న బౌన్సర్లు అక్కడి నుంచి వెళ్లమని అతడిపై దాడికి దిగారు.

Telugu speakers in USA: అమెరికాలో పెరిగిన తెలుగోళ్ల డామినేష‌న్, ఏకంగా 12 ల‌క్ష‌లకు పైగా తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్న‌ట్లు ఓ సర్వేలో వెల్ల‌డి

VNS

గ‌డిచిన ఎనిమిదేళ్ల‌లో అమెరికాలో తెలుగువాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. 2016లో 3.2 లక్ష‌ల మంది తెలుగు మాట్లాడేవాళ్లు ఉండ‌గా..2024 నాటికి ఏకంగా అది 12.3 ల‌క్ష‌ల‌కు చేరింది. అంటే ఎనిమిదేళ్ల‌లో దాదాపు 9 ల‌క్ష‌ల మంది తెలుగుమాట్లాడేవాళ్లు పెరిగారు.

Advertisement

Hyderabad Horror: ఎల్బీనగర్‌లో దారుణం, బాత్ రూంలోకి తీసుకెళ్ళి నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచార యత్నం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఎల్బీనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కట్టల శ్రీకాంత్(30)అనే ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చి న్నారిని బాత్ రూంలోకి తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేశాడు.

Telangana Shocker: దారుణం, హారన్ ఎందుకు కొట్టావంటూ కారు డ్రైవర్ పై దాడి చేసిన బైకర్స్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

Hazarath Reddy

హాన్మకొండలో జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డురావడంతో హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు.ఈ ఘటనలో గాయపడిన కారు డ్రైవర్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Hyderabad Horror: యువతిని ప్రేమిస్తున్నాడని బేగంపేటలో కత్తులతో దాడి చేసి యువకుడి దారుణ హత్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాటిగడ్డ ప్రాంతానికి ఉస్మాన్‌ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ వ్యవహారం యువతి బావ అజాజ్‌కు నచ్చలేదు. దాంతో అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్‌ హత్యకు ప్లాన్‌ వేశాడు. నలుగురూ మాటువేసి ఉస్మాన్‌ను కత్తులతో పొడిచిచంపారు

SI Sexually Assaulted Woman: వీడియో ఇదిగో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేపల కూరతో రూంకి రావాలి, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్ఐ లైంగిక వేధింపులు

Hazarath Reddy

రెండు గంటలపాటు అతని చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశాడు. ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్? అతనితో ఉండాలన్న కోరిక లేదా?' అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు.

Advertisement

TGSRTC Digital Payments: తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల్లో త‌ప్ప‌నున్న‌ చిల్ల‌ర క‌ష్టాలు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా టికెట్లు తీసుకునే అవ‌కాశం

VNS

ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర (Change) వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం (Paytm), డెబిట్‌, క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ తదితర అన్నీ రకాల పేమెంట్స్‌ విధానాలతో టికెట్లు జారీ చేయనున్నారు.

'Slow Down When It's Raining': రహదారి భద్రతపై అవగాహన కోసం.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ వీడియోని షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Hazarath Reddy

వర్షాకాలంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC T20 ప్రపంచ కప్ మ్యాచ్ నుండి ఒక వైరల్ సంఘటనను ఎక్స్ లో షేర్ చేశారు.

Asaduddin Owaisi: జై పాలస్తీనా అంటే బీజేపీకి ఎందుకంత ఉలికిపాటు, మీడియా ముందు నిలదీసిన అసదుద్దీన్ ఓవైసీ, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికార పక్షం

Hazarath Reddy

తెలంగాణకు చెందిన ఎంపీలు ఈరోజు లోక్ సభలో ప్రమాణం చేశారు.అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Food Poisoning in Girls Hostel: హైదరాబాద్‌లోని లేడిస్ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్, 50మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో ఉన్న మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది

Advertisement

Telangana: జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్‌ రిట్ పిటిషన్, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

Hazarath Reddy

తెలంగాణలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కమిషన్‌ను రద్దు చేయాలని రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు

Telangana: దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Hazarath Reddy

రంగారెడ్డి - షాబాద్ మండలం కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు.. బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Hyderabad Fire Accident: హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్ముకుంది. భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Telangana: వీడియో ఇదిగో, కాలువ గట్టుపై కార్ రివర్స్ చేస్తూ వాగులో పడిన కారు, ఊపిరాడక డ్రైవర్ అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు అది అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. కారు కాలువలో పడిపోవడంతో ఆ వ్యక్తి చనిపోయాడు.

Advertisement
Advertisement