తెలంగాణ

TGSRTC Bus Accident Video: వీడియో ఇదిగో, అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన టీజీఎస్ఆర్టీసీ బస్సు, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ 35 మంది ప్రయాణికులు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం పద్మానగర్ గ్రామ సమీపంలో సిద్దిపేట డిపోకు చెందిన TGSRTC బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

Graduates MLC Election Counting: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ షురూ, ఫ‌లితం వ‌చ్చేస‌రికి అర్ధ‌రాత్రి లేదా రేపు ఉద‌యం అయ్యే అవ‌కాశం

VNS

తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన, గెలుపు కోటాపైన స్పష్టత వస్తుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్‌ ప్రక్రియను మొదలుపెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ రౌండ్‌ను ప్రారంభిస్తారు.

Hyderabad Lok Sabha Election Result 2024: హైదరాబాద్ కా బాద్‌షా మళ్లీ అసదుద్దీన్ ఓవైసినే, 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై గెలుపు, తెలంగాణలో ఎవరికెన్ని సీట్లంటే..

Hazarath Reddy

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై గెలుపొందారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు.

Telangana Election Results 2024: తగ్గేదేలే అంటున్న ఈటెల రాజేందర్, మ‌ల్కాజిగిరిలో ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి

Hazarath Reddy

మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ల‌క్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయ‌న‌కు 2,89,989 ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతారెడ్డి రెండో స్థానంలో ఉంటే.. బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు

Advertisement

India General Elections 2024 Results: తెలంగాణ సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విశ్వప్రయత్నం...ఓటరు కరుణ ఎవరివైపు..మల్కాజిగిరిలో గెలుపు ఎవరిది..

sajaya

తెలంగాణలో అందరి చూపు ప్రస్తుతం ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుంది అనే దానిపైనే కేంద్రీకృతం అయి ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించాలని సత్తా చాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

Telangana Shocker: నల్లగొండ మున్సిపాలిటీలో దారుణం, వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ, గత 10 రోజుల నుంచి ఆ నీటిని తాగుతున్న గ్రామస్తులు

Hazarath Reddy

డెడ్‌బాడీ హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదైయింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఇదే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు.

Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ - రాజేంద్రనగర్‌లోని మైలార్ దేవ్‌పల్లి బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. బీహార్, ఒడిశాకు చెందిన పలు కుటుంబాలు బాబుల్ రెడ్డి నగర్‌లో నివాసముంటున్నాయి.

Telangana: కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ, ఉన్నత స్థాయిలో ఉన్నా కులవృత్తిపై ప్రేమ తగ్గలేదని నిరూపించిన అధికారి

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల - చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నాగేంద్రచారి, వేములవాడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా విధులు కొనసాగిస్తున్నారు.. ఉన్నత స్థాయిలో ఉన్నా కులవృత్తిపై ప్రేమతో కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు.

Advertisement

Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ జులై 3 వరకు పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

Road Accident Video: ఇరుకు గల్లీలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్, ఇద్దరికి తీవ్రగాయాలు, హైదరాబాద్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు. చికిత్స కోసం యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

Viral Video: షాకింగ్ వీడియో..కిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన...చివరకు ఏం జరిగిందంటే..

sajaya

కిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. సమయానికి స్పందించి కాపాడిన సిబ్బంది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీళ్లలోకి దూకిన మహిళను గమనించిన టూరిజం సిబ్బంది వెంటనే బోటు ద్వారా ప్రాజెక్ట్ లోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు.

MLC Kavitha Liquor Case: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌..నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న తీహార్ జైలు అధికారులు

sajaya

ఢిల్లీ: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌.. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో ముగియనున్న జ్యుడీషియల్ రిమాండ్.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న తీహార్ జైలు అధికారులు.

Advertisement

Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో సోనియా సందేశం, ప్ర‌త్యేకంగా వీడియో సందేశం విడుద‌ల చేసిన సోనియా గాంధీ, ఇంత‌కీ ఆమె ఏమ‌న్నారంటే?

VNS

ప్రత్యేక రాష్ట్ర కల నిజం చేసుకొని 10ఏళ్లు అవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో క్లిప్ మెస్సేజ్ ను ప్లే చేశారు. తెలంగాణ అమర వీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు.

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌, ప‌రేడ్ గ్రౌండ్స్ లో విడుద‌ల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా భావోద్వేగానికి గురైన అందెశ్రీ (వీడియో ఇదుగోండి)

VNS

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ప్ర‌సంగం అనంత‌రం జ‌య జయ‌హే తెలంగాణ అంటూ సాగే రాష్ట్ర గీతాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు

CM Revanth reddy Speech: ప‌దేళ్ల‌లో రాష్ట్ర సంప‌ద గుప్పెడు మందికి చేరింది, త‌ప్పులు జ‌రిగితే స‌రిదిద్దుకొని, అంద‌రినీ క‌లుపుకొని ముందుకు వెళ్తాం

VNS

జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం జ‌రుగుతుంద‌న్నారు. కల‌ను నెరవేర్చిన మన్మోహన్ , సోనియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ నైజమ‌ని, స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ సమాజం స‌హించ‌ద‌న్నారు.

BRS Won MLC By Election: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

VNS

మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Advertisement

Telangana Capital Hyderabad: హైదరాబాద్‌ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు

Rudra

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.

Toll Rates Increased: టోల్ బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెరుగనున్న టోల్ ట్యాక్స్

Rudra

టోల్ బాదుడు మొదలైంది. నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.

Telangana Formation Day 2024 Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ ఫోటో గ్రీటింగ్స్, మెసేజెస్ మీకోసం

sajaya

జూన్ 2, 2014 న ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయి భారతదేశం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి తెలంగాణ చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి పురాతన కాలం నాటి గొప్ప చరిత్ర ఉంది. దీనిని శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు మరియు కుతుబ్ షాహీలు వంటి వివిధ రాజవంశాలు పరిపాలించాయి.

Telangana Formation Day Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. 2014లో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి ఈ రోజు ఒక ముఖ్యమైన గుర్తు. తెలంగాణ దాని చరిత్ర, విభిన్న సాంస్కృతిక, వైవిధ్యంతో గొప్ప రాష్ట్రం. ఎందరో వ్యక్తులు చూపిన స్వయం ప్రతిపత్తికి, ఈ ప్రాంత సామర్థ్యాలను, ప్రత్యేక అవసరాలను గుర్తించినందుకు తెలంగాణ ఏర్పాటు విజయం.

Advertisement
Advertisement