తెలంగాణ
Car Caught Fire Video: కారులో చెలరేగిన మంటలు, 8 మంది ప్రయాణికులు డోర్ తీసి బయటకు దూకడంతో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..
Hazarath Reddyజగిత్యాల - కథలాపూర్ మండలం పోసానిపేట దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నఎనిమిది మంది ప్రయాణికులు కారు డోర్ తీసి బయటకు వచ్చారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అర్మూర్ నుండి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Inter Student Suicide: షాకింగ్ వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థిని
Hazarath Reddyబాచుపల్లిలో ఉంటున్న కృష్ణవేణి(19) అనే అమ్మాయి రెండేళ్ల క్రితం ఏపీలో ఇంటర్ చదివింది.. ఒక పరీక్షలో తప్పడంతో ఏప్రిల్‌లో సప్లిమెంటరీ రాయాల్సి ఉండగా ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
Half-Day Schools in Telangana: మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyమార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటి పూట బడులు (Half-day schools) నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది.
MLCs Appointment: ఎమ్మెల్సీల నియామకాలపై రేవంత్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు, గవర్నర్‌ కోటాలో జారీ చేసిన గెజిట్‌ను కొట్టేసిన ధర్మాసనం
Hazarath Reddyతెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని (MLCs Appointment) తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్‌, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు (Telangana HC quashes rejection order) కొట్టివేసింది.
Car Accident Caught on Camera: కారు వేగంగా వచ్చి చెట్టును ఎలా ఢీకొట్టిందో చూడండి, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Hazarath Reddyఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Car Accident Caught on Camera) ఓ యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలానికి చెందిన పందిరి గౌతమ్(21) తన మిత్రుడు విక్టరీ వినయ్‌తో కలిసి వారి ఫ్రెండ్ ఇన్నోవా కారును తీసుకుని వరంగల్ వైపు వెళ్తున్నారు.
Palamuru Praja Deevena Sabha: 2024 నుంచి 2034 దాకా తెలంగాణలో ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే, మా జోలికి వస్తే అంతు చూస్తామని పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
Hazarath Reddyమహబూబ్ నగర్‌లో పాలమూరు ప్రజాదీవెన సభలో (Congress Praja Deevena Sabha) సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
Rythu Nestham in Telangana: డిజిటల్‌ ఫ్లాట్‌ ఫా ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కారం, రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడారు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రియల్‌ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
Hyd Man Dies in Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసి, ఉద్యోగంలో మోసపోయి రష్యన్ ఆర్మీలో చేరిన మృతుడు
Hazarath Reddyఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు బుధవారం వెల్లడించారు.
Moving Car Caught Fire Video: కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఈరోజు సైఫాబాద్ రోడ్డు వద్ద కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి.మంటలను డ్రైవర్ గమనించిన తర్వాత కారును రోడ్డు పక్కన తీసుకెళ్ళాడు. అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
Group 1, Group 2, Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు, గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు.
Telangana: మా కంపెనీ మందులు వాడితే కొత్త జుట్టు వస్తుందని ప్రజలను మోసం చేస్తున్న బడా కంపెనీ గుట్టు రట్టు, భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు
Hazarath Reddyగుజరాత్‌లోని హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన Minoxytop 10%తో కొత్త జుట్టు వస్తుందంటూ మిస్ లీడింగ్ ప్రకటనతో ప్రజలను కంపెనీ తప్పుదోవ పట్టిస్తోంది.మార్కెట్లో ఇది చెలామణి అవుతోంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు.
Fake Medicines Seized: ఎటువంటి డ్రగ్ వాడకుండా చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు, రూ. 33.35 లక్షల ఫేక్ మందులను స్వాధీనం చేసుకున్న తెలంగాణ డీసీఏ
Hazarath Reddyతెలంగాణలో నకిలీ టాబ్లెట్లు అమ్ముతున్న ముఠా గుట్టును డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు. రూ. 33.35 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana Fire Video: నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో దగ్ధమైన మూడు కార్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా మూడు కార్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Fire Video: కూకట్‌పల్లిలో ఘోర అగ్నిప్రమాదం, హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్, కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలోని శక్తిపీఠం వద్ద ఉన్న హైటెక్ హైడ్రాలిక్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. భవనం మొత్తానికి అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
RS Praveen Kumar Met KCR: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ మర్యాదపూర్వక‌ భేటీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భేటీపై ప్రాధాన్యం
Hazarath Reddyబీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను నంది నగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, ప్రవీణ కుమార్‌ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది
PM Modi Sangareddy Visit: సంగారెడ్డిలో రూ. 7 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నేడు సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని మంగళవారం, మార్చి 5, 2024 నాడు జాతికి అంకితం చేశారు.
Hyderabad Shocker: మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన అగంతకుడు, బయటకు పొమ్మనడంతో 2వ అంతస్తు నుండి దూకేశాడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లోని నిజాంపేటలో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశించావని అని ఆ వ్యక్తిని ధైర్యవంతురాలు అయిన మహిళ ప్రశ్నించింది.
Kazipet Railway Station Fire Video: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి.
Telangana Fire: నాచారంలో భారీ అగ్ని ప్రమాదం, శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదారాబాద్ (Hyderabad) నాచారంలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకర్ బయోటెక్ (Srikar Biotech) అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు