తెలంగాణ
MLA Padi Kaushik Reddy Travel by Auto: అసెంబ్లీ‌కి ఆటోలో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టానికి నిరసనగా ప్రయాణం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో వెళ్లారు. అయితే పోలీసులు అసెంబ్లీ లోపలికి ఆటోను అనుమతించలేదు . మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో..ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకే ఆటోలో వచ్చానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తెలిపారు.
Malla Reddy University Students Protest Video: హాస్టల్ భోజనంలో పురుగులు, కీటకాలు, మల్లారెడ్డి యూనివర్శిటీలోని నిరసనకు దిగిన విద్యార్థినులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన హైదరాబాద్ శివార్లలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్శిటీలోని విద్యార్థినులు హాస్టల్‌లో తమకు అందించిన ఆహారంలో పురుగులు/కీటకాలు ఉన్నాయని ఆరోపిస్తూ క్యాంపస్‌లో నిరసనకు దిగారు.
Male Passengers Fight for Seat in RTC Bus: బస్సులో ఉన్న ఒక్క సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మగ ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవేములవాడ - తిప్పాపురం బస్టాండ్లో మంగళవారం రాత్రి రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సు సీట్ల కోసం పలువురు గొడవ పడ్డారు. మహిళలు బస్సు ఎక్కగానే కనిపించిన ఒకే ఒక్క ఖాళీ సీటుకోసం సీటు నాదంటే నాదంటూ గొడవ పడటంతో ఘర్షణ మొదలై, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు
Hyderabad Shocker: అందరి ముందే కటింగ్ చేయించుకోమన్న పీఈటీ, అవమానం తట్టుకోలేక కాలేజీ భవనం పైనుంచి దూకిన విద్యార్థి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఘట్కేసర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి జ్ఞానేశ్వర్‌ను హెయిర్ కటింగ్ చేయించుకోలేదని డీన్ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్ టైనర్ అందరి ముందు అవమానించి కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అవమాన భారం తట్టుకోలేక అదే యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకాడు.
MLC Balmuri Venkat Travel by RTC Bus: అసెంబ్లీ‌కి మొదటి రోజే ఆర్టీసీ బస్‌లో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చారు. నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి చేరుకున్నారు. ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన సంగతి విదితమే
Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyడ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.
Case Filed On Tollywood Producer: కెమెరామెన్ ను పెళ్లిపేరుతో మోసం చేసిన టాలీవుడ్ మహిళా నిర్మాత, ఇప్పటికే 2 పెళ్లీళ్లు చేసుకున్న కిలాడీ, తీసుకున్న డబ్బులు అడిగినందుకు రివర్స్‌ లో కేసు
VNSపెండ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్‌ మహిళా నిర్మాతపై (Tollywood Producer) ఓ బాధితుడు కేసు పెట్టాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్‌ కెమెరామ్యాన్‌ నాగార్జున జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ పై అందరి దృష్టి, రేవంత్ సర్కారు తొలి బడ్జెట్ సహా కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదిక కానున్న అసెంబ్లీ
VNSతెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటల 30 నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ స్పీచ్‌పై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు
Niloufer Hospital Fire: నిలోఫర్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో భారీగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల వల్ల హాస్పిటల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
RTC Bus Hits Tree Video: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, 30 మంది ప్రయాణికులకు గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా - నర్సాపూర్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉదయం జిన్నారం బయలుదేరిన బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Babu Mohan Resigns BJP: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా, నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదని ఆవేదన
Hazarath Reddyబీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Road Accident: అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, ఆరుమందికి గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో TSRTC పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుండి తలమడుగు మండలం ఝరి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. బస్సు బోల్తా పడటంతో అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Hyderabad Fire Accident: హైదరాబాద్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, ఎగసిపడిన మంటలతో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వెలువడుతోంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Hyderabad Student Attacked in Chicago: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లిన అగంతకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో ఐటీలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి షాపింగ్ నుంచి తిరిగివస్తుండగా దుండగులు వెంటపడటం వీడియోలో చూడవచ్చు.
Viral Video: హైవే పై చేపల లారీ బోల్తా.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ చేపలు.. కవర్లలో తీసుకెళ్లిన స్థానికులు (వీడియో వైరల్)
Rudraవనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవేపై చేపల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి బోల్తా పడింది. లారీ అదుపు తప్పడంతో చేపలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
Road Accident Video: అతివేగంగా దూసుకొచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్‌, మహిళ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి, సీసీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyమీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
TS EAPCET 2024 Schedule Released: విద్యార్థులకు అలర్ట్, తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
Hazarath Reddyతెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
Group-1 Posts Increases: గ్రూప్ 1లో కొత్తగా పెంచిన పోస్టుల వివరాలు ఇవిగో, మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది
Miyapur CI Suspended: ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో మియాపూర్ సీఐ అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గల మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
South Central Railway Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌, ఈ నెల 11 వరకు తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు, కారణం ఏంటంటే..
Hazarath Reddyరైలు ప్రయాణికులకు South Central Railway అలర్ట్‌ మెసేజ్ ఇచ్చింది. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను ఈ నెల 11 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు.