తెలంగాణ
Kodandaram, Amer Ali Khan Appointed as MLC: గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లు ఆమోదించిన గవర్నర్ తమిళిసై..
sajayaఉర్దూ దినపత్రిక ది సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండ రామ్ పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా ఆమోదించారు.
Medaram Jathara: మేడారం జాతర సందర్భంగా మహిళల నుంచి బస్సు టిక్కెట్లు వసూలు చేయొద్దు..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం..
sajayaఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు ప్రత్యేకంగా 6000 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులు నడుపుతున్నారు.
Kurchi Thata in Police Custody: ‘గుంటూరు కారం’ కుర్చీ మడతపెట్టి.. పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత కౌన్సెలింగ్.. అసలేం జరిగిందంటే?
Rudraహీరో మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లోని కుర్చీ మడతపెట్టి పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Secunderabad Girls Hostel: బాత్రూం నుంచి గర్ల్స్ పీజీ హాస్టల్‌ లోకి రాత్రిపూట చొరబడిన దుండగులు.. ఒకడిని పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు.. సికింద్రాబాద్ లో కలకలంరేపిన ఈ ఘటనలో తర్వాత ఏమైంది?? (వీడియోతో)
Rudraసికింద్రాబాద్‌ లోని పీజీ గర్ల్స్ హాస్టల్‌ లోకి అగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. బాత్రూం కిటికీ నుంచి దుండగులు రహస్యంగా లోనికి చొరబడ్డారు. అనంతరం విద్యార్థినులకు అభ్యంతరకరమైన సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా దుండగుల్లో ఒకరిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు.
Narnur Kamdev Jatara: ఆదిలాబాద్‌ లో ప్రారంభమైన నార్నూర్ కామ్‌ దేవ్ జాతర.. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు
Rudraఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామ్‌ దేవ్ జాతర ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.
TSRTC Goodnews for Medaram Jatara: తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మేడారం జాతర సమయంలో మహిళలకు ప్రయాణం ఉచితం.. అయితే, తొలుత మహిళలకు టికెట్ వసూలు చేయాల్సిందేనన్న సజ్జనార్.. వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క.. చివరకు ఫ్రీ బస్ ప్రయాణమే ఖరారు.. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర.. 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
Rudraమేడారం జాతరకు వెళ్లే తెలంగాణ మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.
Chiranjeevi Meets Venkaiah Naidu: ఒకే చోట కలిసిన పద్మవిభూషణులు, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి, స్వయంగా ఇంటికి వెళ్లి కలిసిన మెగాస్టార్
VNSమెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నాడు వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.
TSPSC New Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి, కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ డీజీపీ
Hazarath Reddyతెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
Telangana: ములుగు జిల్లాలో ఘోర విషాదం, రిపబ్లిక్ వేడుకల్లో కరెంట్ వైర్ తగిలి ఇద్దరు యువకులు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్సీ వాడలో జరిగిన ఈ ఘటనలో మరో యువకుడు గాయపడ్డాడు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో వారికి లైవ్ వైర్ తగిలింది.
Mahmood Ali Faints Video: కేటీఆర్ జాతీయ జెండా ఎగరేస్తుండగా..స్పృహతప్పి పడిపోయిన తెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై మాజీ హోం మినిస్టర్ మహమూద్ అలీ కింద పడ్డారు.
Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్
Hazarath Reddyదేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి అన్నారు
Hyderabad Fire: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ మీద మంటల్లో చిక్కుకున్న కారు, భయాందోళనకు గురయిన స్థానికులు
Hazarath Reddyతెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న సమయంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం
Rudraతిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.
Tamilisai Unfurls Tricolour Flag: పబ్లిక్ గార్డెన్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళి సై.. వీడియోలు, ఫోటోలు ఇవిగో!
Rudraరిపబ్లిక్ డే వేడుకల కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్‌ ను, సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు.
Padma Awards: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మభూషణ్‌ కేటగిరీలో లేని తెలుగువారి పేర్లు.. పద్మశ్రీ ఎవరెవరికి వచ్చాయంటే??
Rudraస్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
Deputy CM Mallu Warns BRS: కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్రజేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక
Hazarath Reddyతమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క BRS లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్నారు.
CM Revanth Reddy Slams KCR: ఇది ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyరానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు.
Disproportionate Assets Case: ఆదాయానికి మించిన ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడా జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు
Hazarath Reddyఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో (disproportionate assets case) అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను (HMDA former director Shiva Balakrishna) ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. కోర్టు ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది
TS EAPCET Exam Dates Announced: తెలంగాణ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల
Hazarath Reddyతెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది.