తెలంగాణ

Notification For TSPSC Chairman: ఎట్ట‌కేల‌కు టీఎస్ పీఎస్సీ బోర్డు నియామ‌కంపై ముంద‌డుగు, నోటిఫికేష‌న్ విడుదల, ఈ నెల 18 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు

VNS

టీఎస్‌పీఎస్సీలో (TSPSC) ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ (Notification) విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ (Notification) చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది

Student Dies by Suicide: హన్మకొండ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని అనుమానాలు

Hazarath Reddy

హన్మకొండ జిల్లాలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో సూసైడ్‌ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది. దీప్తి తన క్లాస్‌మేట్‌ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు.

Video: వీడియో ఇదిగో, బస్సులు ఆపట్లేదని బస్సు ముందు పడుకొని నిరసన తెలిపిన ప్రయాణికుడు, కరీంనగర్ చౌరస్తా వద్ద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో లక్షెట్టిపేటలో కరీంనగర్ చౌరస్తా వద్ద 4 గంటల నిలబడ్డ బస్సులు ఆపడం లేదంటూ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన ప్రయాణికుడు. ఇదిలా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో మగవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. సీట్లు దొరకడం లేదని బస్సు ఎక్కే అవకాశం కూడా కనపడటం లేదని పలువురు వాపోతున్నారు.

Fighter Rooster Auction: సజ్జనార్ సార్ దయచేసి నా పందెం కోడి వేలాన్ని ఆపండి, వీడియో ద్వారా వేడుకున్న కోడి యజమాని

Hazarath Reddy

దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో నేడు వేలానికి ముహూర్తం నిర్ణయించారు. తాజాగా పందెం కోడి యజమాని బయటకు వచ్చాడు. ఓ వీడియో ద్వారా వేలం ఆపాలని టీఎస్ఆర్టీసీ ఎండీకి విన్నవించుకున్నారు.

Advertisement

Chicken Auction on Today: ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి.. కోడి తమదని మూడు రోజులు గడిచినా ఎవరూరాని వైనం.. నేడు వేలం వేయనున్న ఆర్టీసీ అధికారులు (వీడియోతో)

Rudra

మూడు రోజుల క్రితం కరీంనగర్‌ లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని నేటి మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు వేలం వేయనున్నారు.

Telangana: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని యువకుడు మృతి, ఇలా చేసి ఉంటే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిపిన డాక్టర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కూలిపని చేసుకునే జార్ఖండ్ వాసి జితేంద్ర చికెన్ తింటుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Telangana: బస్సులో దొరికిన పందెం కోడిని వేలం వేస్తున్న ఆర్టీసీ, కరీంనగర్ బస్ డిపోలో వేలం పాట, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

వరంగల్ నుండి కరీంనగర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు బస్సులో కోడిని మర్చిపోయి వదిలేసి వెళ్ళాడు.. గమనించిన కండక్టర్ కోడిని డిపోలో అప్పగించగా డిపో యాజమాన్యం దానికి జాలి ఏర్పాటు చేసి దాణా, నీళ్లు పెట్టి దాని ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

Ganja Chocolates Seized in Hyd: స్కూలు పిల్లలకు గంజాయి చాక్లెట్లు, పాఠశాల పక్కనే దుకాణం పెట్టిన పాన్ డబ్బా నిర్వాహకులు, పోలీసుల రైడ్‌లో విస్తుపోయే వాస్తవాలు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకులు మొదలు ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లు అలవాటు చేసి ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు

Advertisement

Ganja Chocolates Seized: దారుణం, చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసిన పాన్ డబ్బా నిర్వాహకులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకులు మొదలు ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లు అలవాటు చేసి ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు పాఠశాలలో వింతగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరా తీసి పాన్ డబ్బా నిర్వాహకులను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana By-Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఖాళీ అయిన రెండు స్థానాలకు ఉప ఎన్నికలు

Hazarath Reddy

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది.

Guntur Kaaram: మహేష్ బాబు "గుంటూరు కారం"కు తెలంగాణ, ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్...మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధర రూ.410గా నిర్ణయం.. జీవోలు విడుదల

sajaya

సంక్రాంతికి జనవరి 12న విడుదలవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు థియేటర్లకు అనుమతినిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసాయి. అటు ఏపీలో 50 రూపాయల హయ్యెస్ట్ హైక్ ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Kesineni Nani on Nara Lokesh: వీడియో ఇదిగో, లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యే‌గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి అంటూ ఫైర్ అయిన కేశినేని నాని

Hazarath Reddy

ఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Attacking On TSRTC Staff: ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు, డ్రైవర్‌పై బైకర్ దాడి నేపథ్యంలో ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ డ్రైవర్ మీద బైకర్ దాడి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మండిపడ్డారు.

Charminar Express Derailment: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రైల్వేశాఖ, పూర్తిగా కోలుకునేవరకు చికిత్స అందిస్తామని వెల్లడి

Hazarath Reddy

నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది.

Praja Palana Applications Fly on Road: వీడియో ఇదిగో, రోడ్డుపై కుప్పలుగా ప్రజా పాలన దరఖాస్తులు, నిర్లక్యం వహించిన అధికారిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది.

Telangana Woman Murder Case: షాకింగ్ వీడియో ఇదిగో, మొయినాబాద్‌లో పట్టపగలే యువతిని చంపి కాల్చివేసిన దుండగులు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

మొయినాబాద్‌లో పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను పరిశీలించారు.

Advertisement

Dead Cockroach Found in Biryani: వీడియో ఇదిగో.. బిర్యానీ తినేవాళ్లు ముందు ఈ వీడియో చూడండి, జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు వడ్డించిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక

Hazarath Reddy

జూబ్లీహిల్స్‌లో బిర్యానీ రుచి చూడటానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఇదేంటని నిలదీస్తే.. దిక్కున్న చోట చెప్పుకోమని నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీఎస్ బార్బిక్యూ హోటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Telangana: వీడియో ఇదిగో, మెహిదీపట్నంలో నకిలీ కాస్మెటిక్‌ తయారీ యూనిట్‌పై డీసీఏ దాడులు, విషపూరిత రసాయనం స్వాధీనం చేసుకున్న అధికారులు

Hazarath Reddy

మెహిదీపట్నంలోని నకిలీ మెహందీ తయారీ యూనిట్‌ షకీల్‌ ఇండస్ట్రీస్‌పై డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) దాడులు నిర్వహించి నిర్వాహకుడు యూసుఫ్‌ను అరెస్టు చేసింది. భారీ మొత్తంలో నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు.. యూనిట్‌లో పిక్రామిక్ యాసిడ్ అనే విష రసాయనాన్ని వాడుతున్నట్లు తెలిపారు.

Students Protest in Osmania University: వడ్డించే ఆహారంలో పురుగులు, నిరసనకు దిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు అంబర్‌పేటలోని లేడీస్‌ హాస్టల్ కాంప్లెక్స్ ఎదుట హాస్టల్‌లో వడ్డించే ఆహారంలో పురుగులు, కీటకాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు నిరసనకు దిగారు. మూడు నెలలుగా తమ సమస్యలను అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. వీడియో ఇదిగో..

Telangana Farm Loan Waiver: రైతుల రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, 30 లక్షల మంది రైతుల రూ.32 వేల కోట్ల పంట రుణాల మాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ‘రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నది

Advertisement
Advertisement