తెలంగాణ

Telangana Assembly Elections 2023: నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ సీటు హామీతో వెనక్కి తగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

Hazarath Reddy

నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు బుధవారం బీఫామ్ అందించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్‌ను అందించారు.

Telangana Assembly Elections 2023: కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే జాబ్ క్యాలెండర్‌, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటున్న కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే తాము కచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

Telangana Assembly Elections 2023: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

Hazarath Reddy

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

Ramagundam Thermal Power Station Fire: రామగుండం విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం, నిలిచిపోయిన విద్యుదుత్పత్తి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లాలోని 62.5 మెగావాట్ల రామగుండం బీ థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాయిలర్‌లో బొగ్గు ను మండిస్తుండగా కోల్‌ఫైర్‌ బయటకు రావడంతో పవర్‌కేబుల్‌ అంటుకొని మంట లు చెలరేగాయి.

Advertisement

Hyderabad Shocker: పనిమనిషి అత్యాచారం కేసులో మురళీ ముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్

ahana

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మురళీముకుంద్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కృంగిన ఘటనపై కేసు నమోదు, ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహాదేవ్ పూర్ పోలీసులు

ahana

మేడిగడ్డ ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విద్రోహ శక్తులున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, ఇంకో పదేళ్లలో తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని, సంగారడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తాను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతానని, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి’’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నానన్నారు.

Winter Season: తెలంగాణలో మొదలైన చలి పంజా.. త‌గ్గుముఖం ప‌ట్టిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్‌ లో 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదు

Rudra

తెలంగాణలో గ‌జ‌గ‌జ మొద‌లైంది. చ‌లి వ‌ణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ వైపు శీత‌ల గాలులు వీస్తున్నాయి.

Advertisement

Rahul Gandhi Played Bathukamma Video: చెప్పులతో బతుకమ్మ ఆడిన రాహుల్ గాంధీ, ఇది బతుకమ్మకు అవమానమంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపాటు

Hazarath Reddy

రాహుల్ గాంధీ, జైరాం ర‌మేష్ తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్బంగా బ‌తుక‌మ్మ‌ను ఆడారు. అయితే చెప్పులతో బ‌తుక‌మ్మ‌ ఎలా ఆడుతారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇది ఘోర‌మైన అవ‌మాన‌మ‌ని బీఆర్ఎస్ పేర్కొంది. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగింది పార్టీ.

Suryakumar Yadav Run Out Video: రోడ్ల మీద వెనుకా ముందు చూసుకోకుండా ఇలా వెళితే అంటూ...సూర్యకుమార్ యాదవ్ రనౌట్ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

రోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సూచన చేశారు.

Telangana Assembly Elections 2023: బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే నమ్మించి గొం కోసేశారు, ఏడ్చేసిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీకి రాజీనామా

Hazarath Reddy

నిర్మల్లో బీజేపీకీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్ నుంచి టికెట్ ఆశించగా.బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆమె బోరున విలపించారు.

Immersion of Durga Idols: నేటి నుంచే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం.. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Rudra

దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Advertisement

Saddula Bathukamma: తెలంగాణలో నేలకు దిగిన పూల సింగిడి, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఉయ్యాల పాటలతో హోరెత్తించిన ఆడబిడ్డలు

VNS

సద్దుల బతుకమ్మ వేడుకలు (Saddula Bathukamma ) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పితృ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమైన వేడుకలు.. సద్దులతో ముగిశాయి. తంగేడు, గునుగు, పట్టుగుచ్చులు తదితర తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత గౌరమ్మను చేసి.. పసుపు కొమ్ము, వక్కతో పాటు గౌరమ్మను చేసి బతుకమ్మలో (Saddula Bathukamma ) పెట్టి పూజించారు.

Bathukamma Song: బతుకమ్మ పాట పాడిన కల్వకుంట్ల కవిత...వైరల్ వీడియో మీ కోసం..

ahana

ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా బతుకమ్మ పాటపాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కల్వకుంట్ల కవిత పాడిన బతుకమ్మ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Assembly elections: 52 మందితో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటల పోటీ ..గోషామహల్ నుంచి రాజా సింగ్..

ahana

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీఆర్‌ఎస్‌ కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది.

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసిన బీజేపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్న కాషాయ పార్టీ

Hazarath Reddy

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు

Rudra

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

TS Poll Survey: బీఆర్ఎస్‌ కు 70, కాంగ్రెస్‌ కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన ఇండియా టీవీ సర్వే

Rudra

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, కానీ గతంలో వచ్చినట్లుగా 88 సీట్లు రాకపోవచ్చునని ఇండియా టీవీ సర్వే వెల్లడించింది.

CM KCR Bathukamma Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి

Rudra

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Pravallika Case: ప్రవల్లిక కేసులో సరైన ఆధారాలు లేవు! నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, శివరాం పాత్రపై ఆధారాలు సరిగ్గా లేవంటూ వాదన

VNS

ప్రవల్లిక ఆత్మహత్య (pravallika case) కేసులో శివరామ్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్‌ మంజూరు చేసింది. మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్‌ రాథోడ్‌ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement