తెలంగాణ

KTR Comments: రేపో..ఎల్లుండో ఇంట్రస్టింగ్ వార్త వింటారు! మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలుస్తారు, ఈ సారి బీజేపీకి డిపాజిట్లు రావంటూ కామెంట్స్

VNS

ప్రవళిక మృతి విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే.. తాము మానవీయ కోణంలో చూశామని తెలిపారు. ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని చెప్పామని అన్నారు. రేపో, ఎల్లుండో ఇంట్రెస్టింగ్ వార్త వింటారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో కచ్చితంగా ఓడిపోతారని అన్నారు.

IMAX: హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్‌ లో అర్ధరాత్రి రభస.. శుక్రవారం రాత్రి ‘గణ్‌పత్’ సినిమా ప్రదర్శిస్తుండగా అకస్మాత్తుగా వెలువడిన దుర్వాసన.. స్ప్రే చేసినా మెరుగుపడని పరిస్థితి.. టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేసిన యాజమాన్యం

Rudra

హైదరాబాద్‌ లోని ఐమ్యాక్స్ థియేటర్‌ లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన వెలువడటంతో ప్రేక్షకులు ఇబ్బందుల పాలయ్యారు.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ

Rudra

తెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరంతా గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేశారు.

Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ ప్రాంతంలో వాహనాల మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాలివే!

VNS

Advertisement

Congress-CPM-CPI Alliance: తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులు ఖరారు, వామపక్షాలకు కేటాయించే సీట్లు ఇవే! కోదండరాం పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారంటే?

VNS

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress), సీపీఎం-సీపీఐ మధ్య పొత్తు (CPM - CPI Alliance) పొడిచింది. సీపీఎం, సీపీఐ పార్టీలకు రెండేసి చొప్పున సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. దీనిపై శనివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో భాగంగా సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు.

Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, గులాబీ గూటికి ఉద్యమ నేత రావటం ఆనందంగా ఉందని తెలిపిన కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు.

Telangana Assembly Elections 2023: టీడీపీకి తెలంగాణలో షాక్, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

Hazarath Reddy

వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు

Telangana Assembly Elections 2023: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కన్నా రేవంత్ రెడ్డి చాలా డేంజర్, కౌంటర్ విసిరిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Hazarath Reddy

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా ప్రమాదకరమని తెలంగాణ మంత్రి కెటి రామారావు (కెటిఆర్) శుక్రవారం అన్నారు

Advertisement

HCA Elections: ముగిసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు, మొత్తం 173కు గానూ 169 ఓట్లు పోల్, ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

HCA Elections: వీడియో ఇదిగో, HCA ఎన్నికల్లో TSRTC తరపున ఓటు హక్కును వినియోగించుకున్న సంస్థ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీ ముకుంద్‌, అతని కొడుకు

Hazarath Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇంట్లో పని చేసే యువతిపై యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Hyderabad: వీడియో ఇదిగో, వాహనాలు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ దూసుకెళ్లిన కారు, తీవ్ర గాయాలపాలైన పోలీస్

Hazarath Reddy

రోడ్డుపై వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా ఏకంగా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.

Advertisement

Rahul Gandhi Makes Dosa Video: దోసెలు వేయడం నేర్చుకున్న రాహుల్ గాంధీ, రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దోసె వేస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణాలో కాంగ్రెస్ విజయభేరియాత్రలో జగిత్యాలకు వెళ్లే సమయంలో నూకపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దోసె చేయడం ఎలాగో నేర్చుకున్నారు.వీడియో ఇదిగో..

Revanth Reddy on KTR: రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్, నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. నేతలు పరస్పర దూషణలకు దిగడంతో పాటుగా హామీలతో దూసుకుపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బస్సు యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా మందిర్ దగ్గర బిచ్చం ఎత్తుకుని బతికే వాళ్ళు, రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు.

ICMR Male Contraceptive: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

Rudra

పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది.

Advertisement

WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి

Rudra

ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తాజాగా ఈ విషయం వెల్లడించారు.

TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ

Rudra

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Congress Bus Yatra: కాంగ్రెస్ కార్యకర్తలే మా పులులు, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన రాహుల్ గాంధీ, కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ విమర్శలు

Hazarath Reddy

కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు కోసం ఓయూలో ఉరేసుకుని వినూత్నంగా నిరసన

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట వినూత్నంగా ఉరి తాళ్లతో ఉరేసుకుని నిరసన తెలిపారు.

Advertisement
Advertisement