తెలంగాణ
Bandlaguda Laddu Auction: రూ.కోటి 26 లక్షలు పలికిన బండ్లగూడ లడ్డు, రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డు, భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరం మొత్తం జై బోలో గణేష్ మహరాజ్ నామస్మరణతో మారుమోగుతోంది. వినాయక ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ కళ్లు చెదిరే ధర పలికింది.
Ganesh Laddu Auction: ఏకంగా కోటీ 20లక్షలు పలికిన గణేషుడి లడ్డు, మాదాపూర్‌లో రికార్డు బద్దలు కొట్టే వేలంపాట, రిచ్‌మండ్ విల్లాలోని గణేషుడి లడ్డూకు భారీ డిమాండ్
VNSనవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి లడ్డు వేలంలో (Ganesh Laddu Auction) రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని (Madapur) రిచ్‌మండ్‌ విల్లాలో (Richmond Villa’s) గణనాథుడి లడ్డూ రూ.కోటి 20 లక్షలు పలికింది. ఇక మైహోమ్‌ భుజాలోని (My Home Bhooja) గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్‌ (Chiranjeevi Goud) అనే వ్యక్తి దక్కించుకున్నారు.
Ganesh Immersion: కొనసాగుతున్న మహా నిమజ్జనం, జీహెచ్‌ఎంసీ పరిధిలో హుస్సెన్‌ సాగర్‌ సహా 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు, 40వేల మందితో భారీగా బందోబస్తు
VNSగణేష్ మహా నిమజ్జనం (Ganesh Immersion) కొనసాగుతోంది. మూడు కమిషనరేట్ల పరిధిలో మహా నిమజ్జనానికి పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేసింది. అలాగే జీహెచ్ఎంసీలో మరో 100 చోట్ల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ తోపాటు ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు రోడ్డు మీదకు వస్తున్న మొసలి పిల్లలు, చింతల బస్తిలో నాలా నుండి బయటకు వచ్చిన చిన్న మొసలి పిల్ల వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల బస్తిలోని ఓ నాలా నుండి బయట పడ్డ చిన్న మొసలి పిల్ల. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల కోసం ఎదురుచూస్తున్న పోలీసులు.
Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం
Hazarath Reddyరాగల మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
Hyderabad Rains: అకస్మాత్తుగా హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, ఇంటికి వెళ్లే వారు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచన
Hazarath Reddyహైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌ వినాయకుడు నిమజ్జనం పూర్తి వివరాలు ఇవిగో, ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ
Hazarath Reddyమహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది.
TSPSC Group-1 Prelim Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించండి, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థంచిన తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌
Hazarath Reddyతెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక
Hazarath Reddyతెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Telangana Assembly Elections 2023: రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు, మహేశ్వరం టికెట్ కోసం రూ. 10 కోట్లతో పాటు 5 ఎకరాల భూమి తన పేర రాయించుకున్నాడని అంటున్న కొత్త మనోహర్ రెడ్డి
Hazarath Reddyమహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి.
KCR Health Update: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కేసీఆర్, ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స
VNSతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వల్ప అస్వస్థతకు (Fever) గురయ్యారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ (CM KCR Illness) కోలుకుంటారు వైద్యులు తెలిపారు.
Telangana: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, 2023 కంపెనీ లాభాల్లో కార్మికులకు 32శాతం వాటా చెల్లించేలా కీలక ఆదేశాలు
Hazarath Reddyసింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 20కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 20కు వాయిదా పడింది. అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌.. ఆ తర్వాతే దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.
KTR on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్ట్‌తో మాకేమి సంబంధం, ధర్నాలు ఇక్కడ కాకుండా అక్కడే చేసుకోమని చెప్పానని తెలిపిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyచంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని లోకేష్‌ తనకు ఫోన్‌ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమైతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. వెయిటింగ్ లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం.. కేవలం గంట వ్యవధిలోనే దర్శనం
Rudraశ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు.
Musical Floating Fountains: మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ అదుర్స్.. దుర్గంచెరువు అందం రెట్టింపు.. వీడియోతో
Rudraహైదరాబాద్ మహానగరం కొత్త సొబగులు అద్దుకుంది. నగరంలోని దుర్గం చెరువు అందం రెట్టింపయ్యేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Weather Update: దేశంలో మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ
Hazarath Reddyసాధారణ తేదీ సెప్టెంబర్ 17 నుండి ఎనిమిది రోజుల తర్వాత, ఈ రోజు నుండి రుతుపవనాలు భారతదేశం నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది . IMD ఒక ప్రకటనలో, "నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 25, 2023 న నైరుతి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించుకున్నాయి
Ganesh Visarjan 2023: ట్యాంక్‌ బండ్‌లో గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు
Hazarath Reddyనగరంలో గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్యాంక్‌ బండ్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం (Ganesh Immersion) చేయొద్దని తెలంగాణ హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది
Hyderabad Rains: హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సడెన్‌గా కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.