తెలంగాణ
Tirumala Special Darshan Tickets: ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది.
Corona Virus Video Conference: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.... నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
Rudraదేశంలో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండడం కలవరపరుస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
PM Modi Hyderabad Visit: ఏప్రిల్ 8న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం.. జింఖానా గ్రౌండ్స్‌ లో బహిరంగ సభ!
Rudraప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
MLC Kavitha: కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. కేవియెట్ దాఖలు చేసిన ఈడీ.. నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం
Rudraఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది.
Rains Alert In Telugu States: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Rudraఓవైపు ఎండలు.. మరోవైపు వానలతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
KCR In Maharashtra: మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ సిద్ధం, దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణే లక్ష్యం, మహారాష్ట్ర సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
kanhaమహారాష్ట్రలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో పార్టీ పోటీ చేస్తుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ మార్చి 26 ఆదివారం కంధర్ లోహాలో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.
ISRO LVM-3 Rocket: ఇస్రో ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎల్వీఎం-3 రాకెట్ కు రూపకల్పన.. 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఎల్వీఎం-3
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగంలో విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
Bandi Sanjay: టీఎస్ పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీక్ కేసు... నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం.. ఆయనకు బదులు సిట్ ముందుకు రానున్న బీజేపీ లీగల్ టీమ్.. ఎందుకంటే??
Rudraతెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి సిట్ నోటీసులు పంపింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం బండి సంజయ్ నేడు సిట్ ఎదుటకు రావాల్సి ఉంది. అయితే, నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు.
Hyderabad Shocker: తార్నాకలో దారుణం, అనారోగ్యంతో ఉన్న పిల్లలను చూడలేక సైనేడ్‌ ఇచ్చి చంపిన తల్లిదండ్రులు, అనంతరం విషం తాగి ఇద్దరూ ఆత్మహత్య
Hazarath Reddyహైద‌రాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ దంప‌తులు( Software Couples ) త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విషమిచ్చి చంపి.. అనంత‌రం ఆత్మ‌హ‌త్య( Suicide ) చేసుకున్నారు. ఈ విషాద ఘ‌ట‌న కుషాయిగూడ పోలీసు స్టేష‌న్( Kushaiguda Police ) ప‌రిధిలోని కందిగూడ‌లో చోటు చేసుకుంది.
Pradhan Mantri Ujjwala Yojana: గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట.. ఉజ్వల యోజన మరో ఏడాదిపాటు రూ.200ల సబ్సిడీ
Rudraగ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు.
Vande Bharat Express: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వచ్చేనెలలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశాలు.. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో భారీగా ప్రయాణికుల రద్దీ.. వందేభారత్ తో తిరుమల భక్తులకు మరింత ఉపయుక్తం
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మరో రైలు జత కూడనున్నది. వచ్చే నెలలో సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.
Telangana: వీడియో ఇదిగో, సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగుల మహా ధర్నా, ఖైరతాబాద్‌-పంజాగుట్ట రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
Hazarath Reddyతమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధాలో మహాధర్నా చేపట్టారు. వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
Weather Forecast: ఉత్తర తెలంగాణకు అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో వర్షం
Hazarath Reddyతెలంగాణలోని రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణం(Hyderabad Meteorological) కేంద్రం అధికారులు వెల్లడించారు.
TS SSC Hall Ticket 2023 Out: టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ, ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు
Hazarath Reddyతెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. కాగా నేడు టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Rahul Gandhi's Disqualification: ఈ రోజు భారత ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే, రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ( PM Modi ) పాల‌న ఎమ‌ర్జెన్సీ( Emergency )ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.
TSPSC Paper Leak Case: ఓయూలో నేడు రేపు హై అలర్ట్, పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థి, పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్‌
Hazarath Reddyటీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ అంశం తెలంగాణలో కాక రేపుతోంది.ఈ ఘటనపై ఉస్మానియా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్‌ లీకేజీపై విద్యార్థులు జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు.
Revanth Reddy House Arrest: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదన్న పోలీసులు, దీక్ష జరిగి తీరుతుందని స్పష్టం చేసిన ఓయూ విద్యార్థులు
Hazarath Reddyరేవంత్ రెడ్డి మహాదీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
AP High Court: ఇంటిపనిని చక్కగా పూర్తి చేయాలంటూ కోడలికి అత్త చెప్పడం క్రూరత్వం అనిపించుకోదు.. ఏపీ హైకోర్టు
Rudraఇంటిపనిని చక్కగా పూర్తి చేయాలంటూ కోడలికి అత్త చెప్పడం 498ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం క్రూరత్వం అనిపించుకోదని ఓ కేసు విషయంలో ఏపీ హైకోర్టు పేర్కొంది.
Judges Transfer: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున్ కూడా..
Rudraఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టుకు ఆయన్ని బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ కూడా మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
KTR Legal Notices: బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపాటు.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ విమర్శ
Rudraటీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.