తెలంగాణ

Hyderabad Horror: పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌ పై అత్యాచారం.. గుంటూరు యువకుడి ఘాతుకం.. హైదరాబాద్ లో కేసు

Rudra

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్టు అతనికి దగ్గరైంది. తీరా ఆమెనూ గర్భవతిని చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్నాడు ఓ దుండగుడు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువకుడిపై హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. హరహర నామస్మరణతో ఆలయాల్లో పెరిగిన రద్దీ.. భక్తుల రద్దీతో శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి, వేములవాడ, కీసర, హన్మకొండ వేయిస్తంభాల ఆలయాలు కిటకిట.. వీడియోతో..

Rudra

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరహర అంటూ ఆలయాలన్నీ శివనామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి.

MLA Poaching Case: సీబీఐని కేంద్రం నియంత్రిస్తుంది, అలాంటప్పుడు ఈ కేసును ఎలా అప్పగిస్తారు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది దవే వాదనలు, కేసు విచారణ ఈనెల 27కి వాయిదా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case)ను రాష్ట్ర హైకోర్టు (TS Highcourt) సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది.

Hath Se Hath Jodo: వీడియో, అరక దున్నలేక ఇబ్బంది పడిన రేవంత్ రెడ్డి, వ్యవసాయం అంటే ఎంత కష్టమో తెలిసిందంటూ ట్వీట్, రైతులందరికీ సెల్యూట్ చేస్తున్నానని వెల్లడి

Hazarath Reddy

నాగలి కర్రును రేవంత్ గట్టిగా భూమిలోకి అదిమి పట్టుకోలేకపోవడంతో ఆ ఎద్దులు ఇష్టారాజ్యంగా పరుగులు తీశాయి. దాంతో రేవంత్ అరక దున్నలేక ఇబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి వీడియో సహా ట్విట్టర్ లో పంచుకున్నారు. వ్యవసాయం అంటే ఎంత కష్టమో అని పేర్కొన్నారు

Advertisement

Happy Birthday KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళసై కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.

CM KCR Birthday Celebrations: నిప్పు రవ్వలు పడి పేలిపోయిన బెలూన్లు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్లో ఘటన

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన కేసీఆర్‌ బర్త్‌డే వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.

Fish Curry for Revanth Reddy: రేవంత్ రెడ్డి‌కి చేపల కూరతో భోజనం వడ్డించిన ముదిరాజ్ కుటుంబం, ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కొరమేను చేపలతో కూర వండి భోజనం పంపించింది.

Chlorine Gas Leak In Jangaon: జనగామలో క్లోరిన్ గ్యాస్ లీక్.. 200 మందికి అస్వస్థత.. దవాఖానకు తరలింపు.. వీడియోతో..

Rudra

జనగామలో క్లోరిన్ గ్యాస్ విడుదలైన ఘటనలో 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Mahindra Invest in Zaheerabad: తెలంగాణలో మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1000 కోట్ల పెట్టుబడులు, కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం

Hazarath Reddy

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తెలంగాణాలో రూ. 1000 కోట్లతో ఒక ఈవీ ప్లాంట్ ఏర్పాటుకి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

తెలంగాణ యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Telangana Road Accident) ముగ్గురు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం (Three Killed After Bus Collides With Auto) జరిగింది.

Telangana: ప్రేమికుల రోజున చెరువులో శవాలై కనిపించిన లవర్స్, నార్సింగి గ్రామ సమీపంలోని సరస్సులో ఇద్దరి మృతదేహాలు లభ్యం, ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు

Hazarath Reddy

ప్రేమికుల రోజున పారిపోయిన వివాహిత & ఆమె ప్రేమికుడు (married woman & her lover) తెలంగాణలోని మెదక్ జిల్లాలో చెరువులో శవమై కనిపించారు.20 ఏళ్ల వయస్సు ఉన్న కల్పన & ఖలీల్ మృతదేహాలను నార్సింగి గ్రామ సమీపంలోని సరస్సు నుంచి (found dead in a pond) వెలికి తీశారు.

Telangana Assembly Polls 2023: తెలంగాణలో బీజేపీ ఓడిపోతుంది, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు, కౌంటర్ విసిరిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

Hazarath Reddy

యూపీలో 'బుల్‌డోజర్‌ రాజకీయాలు' చేస్తున్న వారు తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసుకున్నారు. రాజ్యాంగంతో కాకుండా బుల్‌డోజర్‌తో ప్రభుత్వాన్ని నడపాలన్నారు. ఇదంతా చేయడం వల్ల వారికి రాజకీయంగా లాభం ఉండదు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Advertisement

CM KCR Visits Kondagattu Temple: ముగిసిన సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన, ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్ల నిధులు, దేశంలో అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన

Hazarath Reddy

కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్‌ (CM KCR visits Kondagattu Temple) దర్శించుకున్నారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. 100 కోట్లతో చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Express Derails: గోదావరి ఎక్స్‌ప్రెస్‌‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం, బీబీనగర్‌ వద్ద పట్టాలు తప్పిన రైలు, ప్రయాణికులంతా సురక్షితమని తెలిపిన రైల్వే అధికారులు

Hazarath Reddy

బీబీనగర్‌-ఘట్ కేసర్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమయంలో మరో ట్రాక్‌పై నుంచి గూడ్స్‌ రైలు వెళ్లింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితమని రైల్వే అధికారులు వెల్లడించారు

Revanth Reddy Plants Paddy Video: పొలంలో దిగి వరి నాట్లు వేసిన రేవంత్ రెడ్డి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా భద్రాచలం జిల్లాలో ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు. పాదయాత్ర మార్గమధ్యంలో పొలాన్ని చూడగానే, ఆయన ప్యాంటు పైకి మడిచి, తలపాగా చుట్టారు.

Teachers Transfers Row: ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వానికి ..హైకోర్టు (Telangana high court) మంగళవారం ఝలక్‌ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై నెల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్‌ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Advertisement

TSRTC Special Buses: మహాశివరాత్రి కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు, ఏపీ సహా తెలంగాణలోని పలు శైవక్షేత్రాలకు 2,427 బస్సులు నడిపిస్తున్నట్లు ప్రకటన, స్పెషల్ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా...

VNS

ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పనుంది.

Telangana Secretariat: నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభం!

Rudra

ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Valentine’s Day Wishes: ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..

Rudra

వాలెంటైన్స్ డే లేదా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14వ తేదీన మీరు మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రపోజ్ చేయవచ్చు. వివాహిత జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా జరుపుకోవచ్చు! మీ భావాలను వ్యక్తీకరించడానికి WhatsApp, Instagram, Facebook లేదా SMS ద్వారా మీరు మీ ప్రియమైన వారికి పంపగల కొన్నిహృదయాన్ని హత్తుకునే సందేశాలను మేము మీ కోసం తీసుకువచ్చాము.

Hyderabad Shocker: గుజరాత్‌లో మనుషులు చేత కొట్టించాడు, పంజాగుట్ట యువకుడి దాడి కేసులో ట్విస్ట్, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పంజగుట్టలో హర్రర్ చోటు చేసుకుంది. అర్ధరాత్రి 15 మంది యువకులు కార్లల్లో వచ్చి ఓ యువకునిపై విచక్షణారహితంగా దాడి చేశారు.పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన ఇస్లావత్‌ జయరామ్‌ నార్సింగ్‌లో నివాసముంటాడు.

Advertisement
Advertisement