తెలంగాణ
Hyderabad Shocker: మియాపూర్‌లోని అపార్ట్‌మెంటులో ఫ్యామిలీ ముసుగులో వ్యభిచారం, గుట్టురట్టు చేసిన పోలీసులు, అదుపులో నిర్వాహకులు
Krishnaఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
Amit Shah In Hyderabad: నేడు హైదరాబాద్ కు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.
Krishnaకేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించబోతున్నారు. తుక్కుగూడలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం కోసం ఆయన నగరానికి వస్తున్నారు.
KTR vs Bandi Sanjay: బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లీగల్‌ నోటీసులు పంపించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు.. మంత్రి కేటీఆర్‌ (Minister KTR) శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ నెల 11న ట్విట్ట‌ర్‌లో త‌న‌పై బండి సంజ‌య్ నిరాధార‌మైన‌ ఆరోప‌ణ‌లు చేశార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు ఉంటే బ‌య‌ట పెట్టాల‌ని, లేదంటే బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు
C Narasimha Rao Passes Away: ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూత, సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Krishnaహైదరాబాద్, మే 12: ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.
Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి నోటిఫికేషన్, బండ్లగూడ, పోచారంలో అందుబాటులో ఉన్న ఫ్లాట్లు, వేటి ధర ఎంతంటే? కొనాలనుకుంటే చేయాల్సింది ఇది!
Naresh. VNSసొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే హైదరాబాద్ (Hyderabad) వాసులకు హెచ్ఎమ్‌డీఏ (HMDA) శుభవార్త చెప్పింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ (Bandlaguda), పోచారం (Pocharam) పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv Swagruha Flats) అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) కూడా తాజాగా విడుదలైంది.
Telangana: తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని తెలిపిన మంత్రి హరీష్ రావు
Hazarath Reddyమహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని.. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.
Telangana: వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ పెంచిన తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయం
Hazarath Reddyవాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లను స్వల్పంగా పెంచుతూ (Transport dept. enhances life tax) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త లైఫ్‌ ట్యాక్స్‌లు మే9 నుంచి నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు
Telangana: అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో తమ్ముడి మృతి, మంచిర్యాల జిల్లాలో 3 గంటల వ్యవధిలో విషాద ఘటనలు, శోక‌సంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyల‌క్సెట్టిపేట ప‌ట్ట‌ణానికి చెందిన గాజుల భాస్క‌ర్ గౌడ్(46), శ్రీనివాస్ గౌడ్ అన్న‌ద‌మ్ములు. అయితే భాస్క‌ర్ గౌడ్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. అన్న మృతి చెందాడ‌న్న వార్త శ్రీనివాస్ గౌడ్‌కు తెలిసింది. దీంతో హుటాహుటిన ల‌క్సెట్టిపేట‌కు శ్రీనివాస్ గౌడ్ చేరుకుని అన్న మృత‌దేహాన్ని చూసి బోరున విల‌పించాడు. ఈ క్ర‌మంలో శ్రీనివాస్ గౌడ్ కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Kamareddy Road Mishap: కామారెడ్డి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyకామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
Telangana Shocker: ప్రియుడి మోజులో..పెళ్లయిన 35 రోజులకే భర్తను చంపేసిన భార్య, ప్రేమించిన వ్యక్తి, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చిన కసాయి, నిందితులంతా కటకటాల్లోకి..
Hazarath Reddyతెలంగాణలోని సిద్దిపేటలో దారుణం (Telangana Shocker) చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి పెళ్లయిన 35 రోజులకే కట్టుకున్న భర్తను చంపేసింది ఓ ఇల్లాలు. ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో పెళ్లి చేయడంతో అతన్ని చంపేందుకు (Woman Kills Husband for Lover in Siddipet) పథకం రచించి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లింది.
Kamareddy Road Mishap: తెలంగాణలో రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేలు
Hazarath Reddyఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు, గాయపడిన వారితో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి బంధువులకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 సాయం ప్రకటించారు.
Kamareddy Road Mishap: తెలంగాణలో ఘోర విషాదం, కొడుకు దినకర్మకు వెళ్లి వస్తూ తల్లితో సహా 9 మంది మృత్యువాత, మరో 17 మందికి గాయాలు
Hazarath Reddyకొడుకు దినకర్మ తర్వాత ‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ తల్లి సహా సమీప బంధువులు తొమ్మిది మంది ఘోర రోడ్డు ప్రమాదంలో (Kamareddy Road Mishap) మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, ముగ్గురు చిన్న పిల్లలు సహా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Ask KTR: సీఎం సీటును బేరం పెట్టిన బీజేపీ రంగు బయటపడింది, ఇప్పుడెందుకు స్మృతి ఇరానీ ధర్నా చేయడం లేదు, పెట్రోల్ ధరల్లో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్, ఆస్క్ కేటీఆర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు
Naresh. VNSపెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Naendra Modi) దక్కుతుందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమం ద్వారా సమాధానాలు ఇచ్చారు.
KTR Warangal Tour: ఆ రైతుల త్యాగం వెలకట్టలేనిది, వారికి వంద గజాల ఫ్లాట్లు ఇస్తాం, కిటెక్స్ కంపెనీతో 15వేల మందికి ఉపాధి, వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
Naresh. VNSవరంగల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో (Kakathiya mega textile park) ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ టెక్స్ టైల్ (Kitex park)పరిశ్రమకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Congress Warangal Declaration: టీఆర్ఎస్‌తో పొత్తు కావాలనుకునేవాళ్లు బయటకు వెళ్లండి! ప్రజల్లో లేకపోతే ఎంత సీనియర్ అయినా టికెట్ ఇవ్వం, కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్, వరంగల్ డిక్లరేషన్‌లో పలు కీలక హామీలు
Naresh. VNSతెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం సులువుగా ఏర్పాటైంది కాదని.. ఎంతో మంది యువత, తల్లుల రక్తం, కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో (Raithu Sangarshana sabha) రాహుల్‌ గాంధీ మాట్లాడారు.
Weather Forecast: మరో మూడు రోజులు తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyఎండ తీవ్రత పెరిగింది. రెండు రోజులు అకాల వర్షాలు కురియడంతో తాత్కాలికంగా కాస్త చల్లబడిన వాతావరణం తిరిగి వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana: వచ్చే ఎన్నికల్లో రైతులు, విద్యార్థులపై నమ్మకం పెట్టుకున్న కేసీఆర్ సర్కారు, మే 5 నుంచి 14 వరకు జాతీయ నేతల రాకతో తెలంగాణలో వేడెక్కనున్న రాజకీయాలు
Hazarath Reddyప్రతిపక్ష పార్టీల దాడిని తట్టుకుని విద్యార్థులు, రైతుల మద్దతు లభిస్తుందని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నమ్మకంగా ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ హయాంలో పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలను ఎత్తిచూపేందుకు కాంగ్రెస్, బీజేపీలు తమ తమ జాతీయ నాయకులను రంగంలోకి దింపడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
Telangana: ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ, సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకుంటున్న సీఎం కేసీఆర్, అభివృద్ధి బాట వైపు పయనిస్తున్న అన్ని రంగాలు
Hazarath Reddyదేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం (KCR Govt) తీర్చిదిద్దింది.
Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య, మతాంతర వివాహం చేసుకున్న యువకుడిని దారుణంగా హతమార్చిన యువతి తరపు బంధువులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyరాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పరువు హత్య (Honour Killing) చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని దుండగులు దారుణంగా ( Husband Killed After Inter-Faith Couple Attacked) హతమార్చారు. కాగా సరూర్‌నగర్‌లో పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌, ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే, మే 5 నుంచి అమల్లోకి..
Hazarath Reddyఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు (First-class tickets in MMTS) దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి (cheaper by 50% from May 5) రానున్నాయి.