తెలంగాణ
Diwali At Graveyard: స్మశానంలో దీపావళి, కరీంనగర్‌లో ఆరు దశాబ్దాలుగా వింత ఆచారం, సమాధుల దగ్గర టపాసులు కాల్చి దీపావళి పండుగ..వీడియో ఇదిగో
Arun Charagondaసాధారణంగా దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే.. వీళ్లు మాత్రం స్మశాన వాటికలకి వచ్చి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కోనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోనే ఓ సామాజిక వర్గం. సమాధుల వద్ద పూజలు నిర్వహించి... చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. అనంతరం పిల్లలతో కలిసి దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
Mayonnaise Banned in Telangana: తెలంగాణలో మయోనైజ్ బ్యాన్, మోమోస్ తిని మహిళ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
Vikas Mరాష్ట్రంలో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది రోగాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Youtuber Harsha Sai: లైంగిక వేధింపుల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్, తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి
Arun Charagondaయూట్యూబర్ హర్షసాయికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్ట్‌ను ఆశ్రయించారు హర్షసాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
TSPSC Group 3 Exam Date 2024: వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు, తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్
Hazarath Reddyతెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది.
Telangana: లోక కళ్యాణం కోసం ఆత్మార్పణం చేసుకుంటా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని మహిళా అఘోరీ సంచలన కామెంట్
Arun Charagondaలోక కళ్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది మహిళా అఘోరీ. వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడిన మహిళా అఘోరీ..వేములవాడ ఆలయంలో చాలా ఏళ్లుగా ఉన్న దర్గాని కూలగొట్టాలని కామెంట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని ప్రకటించారు.
Minister Komatireddy: మనసున్న మారాజు మంత్రి కోమటిరెడ్డి, పేద విద్యార్థిని చదువుకు అండగా నిలిచిన వెంకట్‌రెడ్డి, ఎంబీబీఎస్ చదువుకు చేయూత
Arun Charagondaపేదింటి విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్ కి చెందిన కాట్రాజ్ సుమలత ఇటీవల MBBS సీటు సాధించింది. కాలేజీ ఫీజు కట్టేందుకు సుమలత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసుకున్నారు. సుమలత చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కోమటిరెడ్డి హామీనిచ్చారు
Weather Forecast: సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్
Hazarath Reddyనిన్న దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
Telangana Caste Census: నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో హస్తం నేతలు!
Arun Charagondaదేశంలో తొలిసారిగా నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
MLA Medipalli Satyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్, రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తి, లండన్ నుండి ఫోన్..లుక్ ఔట్ నోటీసులు జారీ
Arun Charagondaకరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత సెప్టెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ అందుకున్నారు ఎమ్మెల్యే సత్యం. తనకు 20 లక్షలు ఇవ్వకపోతే అప్రతిష్ఠపాలు చేస్తానని, నిన్ను చంపి నీ పిల్లలను అనాధలను చేస్తానంటూ హెచ్చరించారు.
Harishrao: హైదరాబాద్‌లో సముద్రమా?, ప్రజలంతా నవ్వుకుంటున్నారు..రేవంత్ రెడ్డి సీఎం కాదు జోకర్ మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ భిక్షతోనే సీఎంగా రేవంత్ రెడ్డి
Arun Charagondaకేసీఆర్ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్ రావు...రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు...దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు...తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు.
Telangana Congress: బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య డ్రగ్స్ టెస్ట్ యుద్ధం, డ్రగ్స్ టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు...బీఆర్ఎస్ నేతలకు సవాల్
Arun Charagondaతెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌లో డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ సవాల్‌ని స్వీకరించి డ్రగ్స్ టెస్టులకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
CM Revanth Reddy: డాక్టర్ కావాలన్న గిరిజన విద్యార్థిని కోరిక నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు కావాల్సిన సాయాన్ని అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Arun Charagondaడాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.
Hyderabad: టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు, యజమాని అప్రమత్తతో తప్పిన ప్రమాదం...పోలీసుల అదుపులోకి దాడికి పాల్పడ్డ వ్యక్తి..వీడియో ఇదిగో
Arun Charagondaటపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఓ అగంతకుడు. హైదరాబాద్ - లాలాగూడలో రోడ్డుపై ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంపై, 5 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు అగంతకుడు. షాపులో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరికి స్వల్ప గాయాలు, ఆస్పత్రికి తరలించగా యజమానుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని దాడి చేసినట్లు సమాచారం.
Telangana: దీపావళి పండగ వేళ విషాదం, అంబర్‌పేటలో దీపావళి లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్, కాలిపోయిన 14 ఏళ్ల బాలుడి శరీరం..వీడియో
Arun Charagondaతెలంగాణలోని అంబర్‌పేటలో దీపావళి పండగ సందర్భంగా విషాదం నెలకొంది. ఇంటిపై హై టెన్షన్ వైర్ తగిలి బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా, ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ తగిలి అభి(14) అనే బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Maoists Letter On BRS Leaders: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్, దళిత బంధు పేరుతో మోసం చేశారు...డబ్బులు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరిక
Arun Charagondaదళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేశారు జగన్.
Bomb Threat To Shamshabad Airport:శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో బాంబులు పెట్టామని ఫోన్లు, అప్రమత్తమైన సిబ్బంది
VNSశంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది
Hyderabad Shocker: భర్తను, బిడ్డను పోగొట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఈ తల్లిని చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే, ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చలేక కొడుకు సూసైడ్
Hazarath Reddyఆన్లైన్ బెట్టింగ్ కు ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
Babu Mohan: కేఏ పాల్‌కి షాకిచ్చి టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబుమోహన్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లుగా పోస్ట్ చేసిన నటుడు
Hazarath Reddyమాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి విదితమే
BTech Student Dies by Suicide: తల్లి ఇచ్చిన కాలేజీ ఫీజు డబ్బుతో ఆన్‌లైన్ బెట్టింగ్, పోవడంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి
Hazarath Reddyవర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.గణేశ్ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ కుమారుడిని బీటెక్ చదివిస్తుంది..
B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి (వీడియో)
Rudraహైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.