
Suryapet, August 8: తెలంగాణలో మరో పరువు హత్య లాంటి ఘటన (Honor killing in Telangana) కలకలం రేపింది. సూర్యా పేట జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువుపై కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు (Youth Killed By His Lover Brother) గురయ్యాడు. మృతుడిని చందనబోయిన దిలీప్(19)గా గుర్తించారు. బీరుసీసాతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లగడ్డకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ ప్రేమ వ్యవహారం యువతి సోదరుడికి నచ్చలేదు. దీంతో యువతి సోదరుడు అతనిపై పగ పెంచుకున్నాడు. ఈక్రమంలోనే మాట్లాడుకుందాం రమ్మని సద్దల చెరువు వద్దకు దిలీప్‌ను పిలిచాడు.
చెరువు వద్దకు వెళ్లిన దిలీప్‌పై యువతి సోదరుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. బీరు సీసాలతో పదే పదే పొడిచాడు. దీంతో దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.